నటసింహ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర నటులుగా, గొప్ప ఇమేజ్ ఉన్న హీరోలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి చిత్రాలు విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో హంగామా మామూలుగా ఉండదు.
థియేటర్లలో మోత మోగాల్సిందే. వీరిద్దరు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. ఈ హీరోలిద్దరు ఎన్నోమార్లు థియేటర్లలో ఒకేసారి చిత్రాలను రిలీజ్ చేసి, బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అలాంటి హీరోలు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. మరి ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఇద్దరు అగ్రనటులే. నటనలోనూ, రికార్డ్స్ లోనూ, ఫ్యాన్ బేస్ లోను వారికి వారే సాటి. వీరిద్దరూ 60 ఏళ్ల వయసు దాటిన కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు తమ చిత్రాలతో పోటీ పడగా, రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించింది మైత్రీ మేకర్స్.
ఆ సందర్భంలో మీడియా ఇద్దరి కాంబోలో సినిమా చేస్తారా అని అడుగగా, మైత్రి ప్రొడ్యూసర్స్ చిరు, బాలయ్య కలిసి నటించడానికి ఒప్పుకుంటే ఏ ప్రొడ్యూసర్ అయిన అలాంటి ఛాన్స్ ను వదులుకుంటారా అని అన్నారు. మంచి స్టోరీ దొరికితే, ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పారు. చిరు- బాలయ్య కాంబో కుదిరితే ఆ సినిమా నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. అయితే గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’.
ఈ సినిమాలోని ఒక సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు. ఇక వీరు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా కనిపిస్తారు. ఈ చిత్రం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుండి వీరిద్దరు కలిసి నటించాలన్న వీరి ఫ్యాన్స్ కోరికను మైత్రీ మూవీ మేకర్స్ తీరుస్తారేమో చూడాలి.

టోవినో థామస్ తెలుగు ఆడియెన్స్ సుపరిచితమైన పేరు. ఇప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారిని పలకరించారు. ఇటీవల వచ్చిన 2018 కు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. టోవినో థామస్ నటించిన ‘నీలవెలిచమ్’ అనే చిత్రం ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల అవగా ప్లాప్ గా నిలిచింది. కానీ మే 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీకి మంచి స్పందన ఆడియెన్స్ నుండి వస్తోంది.
ఆషిక్ అబూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రిమా కల్లింగల్, టామ్ చాకో, రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 1964లో విడుదలైన విజయనిర్మల నటించిన ‘భార్గవి నిలయం’ చిత్రం మలయాళంలో హారర్ చిత్రాలకు స్పూర్తిగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఆ చిత్రం రీమేక్‌గా ‘నీల వెలిచమ్’ను తీశారు.
బషీర్ (టోవినో థామస్) ఒక రచయిత. స్టోరి రాయడం కోసం సముద్రం తీరంలో ఉన్న ఒక పల్లెటూరికి వస్తాడు. ఆ ఊరి చివర్లో ఉండే భార్గవి నిలయం అనే పాత ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లో భార్గవి అనే ఆత్మ ఉందని ఊర్లో వారు చెప్పుకుంటారు. వారిలో కొందరు ఆ ఆత్మను కూడా చూస్తారు. ఆ ఇంట్లోకి ఎవరూ వచ్చినా సహించని ఆత్మ అద్దెకు వెళ్ళిన బషీర్‌ను ఏం చేయదు. ఊర్లో వారు చెప్పే కథలు విన్న బషీర్ ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవం తెలుసుకొని స్టోరీగా రాయాలని నిర్ణయించుకుంటాడు.
కథ రాసే క్రమంలో బషీర్ ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? భార్గవి ఎలా మరణించింది ? ఆమెను ప్రేమించిన శివకుమార్ మాయం అవడం వెనుక ఉన్న కారణం ఏమిటి? భార్గవి మేనమామ నారాయణన్ బషీర్‌ను ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు అనేదే మూవీ స్టోరి. కథ కొత్తది కానప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్‌గా నడిపించారు.
ముఖేష్ అంబానీ దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలకు తరచూగా వెళుతుంటారు. అయితే ఈ దేవాలయాలలో ఒకటైన నాథద్వారాలో ఉన్న శ్రీనాథ్ దేవాలయం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి చాలాకాలం నుండి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఈ దేవాలయాన్ని అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్టుడు శ్రీనాథుడు అవతారంలో కొలువై వున్నాడు.
17వ శతాబ్ధంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మహారాజా రాజాసింగ్ ఈ ఆలయాన్ని కట్టించారు. శ్రీనాథ్ ఆలయానికి విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయంలోనికి వెళ్లేందుకు నాలుగు వైపులా ద్వారాలు నిర్మించి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీనాథుడు శ్యామల వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఆలయానికి రాజస్థాన్‌కు ప్రజలు తరచూగా వస్తుంటారు. హోలీ పండుగ రోజు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఆలయం జనంతో నిండిపోతుంది.
ఈ త్రినాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని అంటారు. ఇక ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నాథద్వారా ఉదయపూర్ కు దగ్గరగా ఉంది. నాథద్వారాకు ట్రైన్ లేదా విమానంలో ఉదయ్‌పూర్ వరకు వెళ్ళి, అక్కడి నుండి త్రినాథ్ ఆలయానికి వెళ్లవచ్చు.
క్రికెట్ లో మొదటి నుండి కూడా రెడ్ బాల్ ను ఉపయోగిస్తున్నారు. 1971లో వన్డే క్రికెట్ ప్రారంభించిన తరువాత రెడ్ బంతితో వన్డే మ్యాచ్ ఆడటం కష్టం అయ్యింది. ఎందుకంటే సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో రోజుకి 90 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. వెలుగు బాగా ఉన్నప్పుడు 98 ఓవర్లు వరకు బౌలింగ్ చేస్తారు. అయితే మొదట్లో వన్డే క్రికెట్ లో ఇన్నింగ్స్ కు అరవై ఓవర్లు ఉండేవి. అంటే మధ్యాహ్న సమయంలోనే 120 ఓవర్లు పూర్తి చెయ్యాలి. కానీ 120 ఓవర్లు ఒక్కరోజులో పూర్తి చెయ్యడం చాలా కష్టం.
రెడ్ బాల్ పగటి సమయంలోనే బాగా కనిపిస్తుంది. కానీ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెడ్ బాల్ ఎక్కువగా కనిపించదు. ఆ వెలుతురులో రెడ్ బాల్ గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇక పిచ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది. దానివల్ల బ్యాటర్ బంతిని సరిగ్గా గమనించలేడు. ఇక మొదట్లోవన్డేలలో లైట్ ఫెయిల్ అయిన సందర్భాలలో మ్యాచ్ ను ఆపి, ఆ మరుసటి రోజు కంటిన్యూ చేసేవారు. దీంతో 1977 లో వైట్ బాల్ ను తీసుకొచ్చారు. అలాగే వన్డే మ్యాచులను డే అండ్ నైట్ ఆడటం ప్రారంభించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో వైట్ బాల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది.
2015లో టెస్ట్ క్రికెట్ ను కూడా డే అండ్ నైట్ ఆడటం మొదలుపెట్టారు. కానీ అయితే ఫ్లడ్ లైట్స్ వెలుతురులో రెడ్ బంతితో ఆడటం చాలా కష్టం. అందువల్ల టెస్ట్ మ్యాచ్ కోసం పింక్ బాల్ ను తీసుకువచ్చారు. అయితే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లను వైట్ బాల్ తో ఆడితే అయిపోయేది కదా అనుకోవచ్చు. కానీ టెస్ట్ మ్యాచ్ లను వైట్ జెర్సీలు ధరించి ఆడతారు. అందువల్ల టెస్టుల్లో వైట్ బాల్ తో ఆడితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి పింక్ బాల్ ను వాడుతున్నారు.
రెడ్ బాల్ – వైట్ బాల్ మధ్య తేడా:
2. వైట్ బాల్ ఫినిషింగ్ స్మూత్ గా, షైనీ గా ఉంటుంది. దీని వల్లే మ్యాచ్ మొదట్లో వైట్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. మ్యాచ్ అయ్యే కొద్ది తొందరగా పాతగా అవడం, మురికిగా మారడం వల్ల షైన్ పోయి స్వింగ్ తగ్గుతుంది. రెడ్ బాల్ ఫినిషింగ్ కాస్త హార్డ్ గా ఉంటుంది. దాని షైనింగ్, రఫ్ పార్ట్ ఎక్కువ సమయం వరకు ఉంటాయి. దాంతో మొదట్లో 30 ఓవర్స్ దాకా బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది.
3. రెడ్ బాల్ తో పోలిస్తే వైట్ బాల్ బరువు ఎక్కువగా ఉంటుంది. దాంతో బౌలర్ వైట్ బాల్ ను ఎక్కువగా కంట్రోల్ చెయ్యలేరు. ఎక్కువ స్కిల్ ఉన్న బౌలర్స్ వారు అనుకున్న లైన్ అండ్ లెంగ్త్ లో వైట్ బాల్ తో నిలకడగా వెయ్యగలరు. రెడ్ బాల్ బరువు కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఏ బౌలర్ అయినా వేయగలరు.
చక్రవాకంలో ఇంద్రగా నటించిన యాక్టర్ ఇంద్రనీల్ బుల్లితెర పై సంచలనం సృష్టించారు. మంజులనాయుడు తెరకెక్కించిన ఈ సీరియల్, అప్పటి వరకు ఉన్న సీరియల్స్ ట్రెండ్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఇంద్ర రేంజ్ ను మరింత పెంచింది. ఇంద్రనీల్ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంద్ర అనగానే ఇంద్రనీల్‌ని బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆయన క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
క్రమంగా బుల్లితెరకు దూరం అయిన ఇంద్రనీల్ చాలాకాలం తరువాత ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో సామ్రాట్ అనే పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంద్ర బాగా నటించినప్పటికీ, ఆయన పక్కన హీరోయిన్ అమ్మమ్మలా ఉందని ఆమె పాత్రను హైలెట్ చేయడానికి సామ్రాట్ పాత్రను సరిగ్గా చూపించలేదని విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆ తరువాత ఆ పాత్ర కనిపించలేదు. ఇంద్రనీల్ కి రీ ఎంట్రీ పని చేయలేదు.
సీరియల్స్‌లో ఛాన్స్ లు లేకపోవడంతో ఇంద్రనీల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి ఆన్ లైన్లో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించారు. ఇంద్రనీల్, మేఘనాలు ఎన్ఎమ్ ఫుడ్స్ పేరుతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఇంద్రనీల్ తెలుగులో టీవీ నటులకు ఆఫర్స్ చాలా తక్కువ. దానికి కారణం కన్నడ నటుల డామినేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దాంతో చాలామంది తెలుగు ఆర్టిస్ట్‌లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే మేము బాగానే ఉన్నామని, చక్రవాకం ఇంద్ర అనగానే ఇప్పటికీ గుర్తుపడతారు. హీరోగా 18 డైలీ సీరియల్స్ లో నటించాను. ప్రస్తుతం సీరియల్ హీరోలు 1,2 సీరియల్స్ అనంతరం కనిపించడం లేదు. కన్నడ వాళ్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారని మాకేం ఇబ్బంది లేదు. వాళ్లలో ఎక్కువ మంది మా స్నేహితులు ఉన్నారు. తప్పు వాళ్లది కాదు. పరిశ్రమ వాళ్లది. కన్నడ లేదా తమిళ ఇండస్ట్రీలలో తెలుగువాళ్లను తీసుకోరు. అయితే తెలుగులో కన్నడవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్‌కాస్ట్‌లు వంటి ఇతర కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.
మొదట్లో అయితే తెలుపు, నలుపు రంగులలో మాత్రమే లభించేవి. ప్రస్తుతం మార్కెట్ లో అన్ని రకాల రంగులు దొరుకుతున్నాయి. దాంతో ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ప్రస్తుతం మహిళలు ధరించే ప్యాంట్ లలో ఇవి ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వారి దృష్టిలో ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సౌకర్యవంతమైన ప్యాంటు అంటే లెగ్గింగ్స్ అని చెప్పవచ్చు.
అయితే లెగ్గింగ్స్ ధరించడం వల్ల సౌకర్యం ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెగ్గింగ్స్ అనేవి చాలా బిగుతుగా, చర్మానికి అంటిపెట్టుకుని ఉంటాయి. అందువల్ల ఎక్కువ సమయం వీటిని ధరించడం వల్ల గాలి వెళ్ళే అవకాశం లేకపోతే చర్మ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఎందుకంటే ఇవి భారత దేశంలో వాతావరణ పరిస్థితులకు సపోర్ట్ చేసే దుస్తులు కాదు.
ఇండియాలో శరీరానికి గాలి తగలవలసిన అవసరం ఉన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. చలికాలంలో వెచ్చని బట్టలు అవసరం ఉంటుంది. లెగ్గిన్స్ క్లాత్ చాలా పలుచగా ఉంటుంది. దాంతో చల్ల గాలి తాకి చర్మ సంబంధిత సమస్యలు రాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. వీటి వాడకం వల్ల చలి, ఎండ, పొల్యూషన్ వల్ల చర్మం మాత్రమే కాకుండా బాడి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెబుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్ తో పాటు 2 పాటలను కూడా రిలీజ్ చేశారు. వీటికి రెస్పాన్స్ బాగా వచ్చినప్పటికీ, ప్రమోషన్ విషయంలో యూనిట్ పై విమర్శలు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సాంగ్స్ ను లిరికల్ గా కాకుండా పూర్తి వీడియోలు రిలీజ్ చేశారు. అంటే మూవీ కంటెంట్ లో చాలా భాగాన్ని రిలీజ్ కు ముందే చూపించినట్లు అయ్యింది.
ఇటీవల రిలీజ్ అయిన ‘రాం సీతా రాం’ సాంగ్ లో రామాయణంలోని ప్రధానమైన దృశ్యం అయిన శ్రీరాముడు సీతాదేవి కలుసుకునే సన్నివేశాన్ని చూపించారు. భావోద్వేగంతో కూడిన ఈ సిన్ ను సాంగ్ లో చూపించి పెద్ద పొరపాటు చేశారని చెప్పవచ్చు. అలాంటి ముఖ్యమైన సన్నివేశాలను ముందే చూపించడం వల్ల మూవీ ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆడియెన్స్ అంతగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఇది మూవీ యూనిట్ చేసిన పొరపాటని అంటున్నారు.
ఇక ఈ మూవీని ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడంలో ‘ఆదిపురుష్’ యూనిట్ సాంగ్స్ రూపంలో విజయం సాధించింది. అయితే ఉత్కంఠటను కలిగించే సీన్స్ ముందే చూపించడం వల్ల అసలైన ఫీల్ ను ఆడియెన్స్ మిస్ అయ్యేలా మూవీ యూనిట్ చేసింది. మరి ఇక నుండి ఇచ్చే మూవీ అప్డేట్ ల విషయంలో అయినా చిత్ర యూనిట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ కి సినిమాలు తీయడానికి దాదాపుగా అన్ని విధాల సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. కానీ ఒకప్పుడు సినిమా తియ్యలి అంటే మద్రాసుకి వెల్లవల్సిందే. అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతూ తెలుగువారు సినిమాలను చేసేవారు. అయితే ఎందరో చేసిన కృషి వల్ల ఇండస్ట్రీ హైదరాబాద్ కి రాగలిగింది. వారిలో ముఖ్యులు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, సారధి, రామానాయుడు వంటివారు హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించారు.
1983 జనవరి లో ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాదుకు తీసుకురావడంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు. ఆయన సినీ రంగానికి, అభివృద్ధికి కావలసిన అన్నీ సహాయసహకారాలు అందజేశారు. అలా వచ్చిన ఇండస్ట్రీని ఒకప్పుడు పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో అత్యధిక సినిమాలను నిర్మించే ఇండస్ట్రీలలో ఒకటిగా ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి రాకముందు హీరోలు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన వీడియో ఒకటి చకకర్లు కొడుతోంది. ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావాల్సిందిగా కోరారు. మీ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నా అంటూ ముగించారు.
ఆ తరువాత ఏఎన్ఆర్ మాట్లాడుతూ 1963 నుండి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి జరుగుతోందని, కానీ ఇప్పటివరకు అది జరగలేదని, సీఎం ఎన్టీఆర్ సినీ ప్రపంచం నుండి వచ్చిన వారు కావడం వల్ల ఆయనను తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి తరలించాలని కోరడం సమంజసం అని, ఆయన సహకరించాలని అన్నారు.
చిటికెన వేలు అయితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను ఎంతో క్లియర్ గా చెబుతుందని అంటున్నారు. చిటికెన వేలు, ఉంగరం వేలు మధ్య ఖాళీ ఉంటే, వీరు చేసే పనులలో చాలా స్వతంత్రంగా ఉంటారట. ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వల్ల చిటికెన వేలు మిగతా నాలుగు వేళ్ళకు దూరంగా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తులు కూడా అందరిలో ఒకరిగా కాకుండా స్వతంత్ర ఉండేట్టు నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి విషయాలలోనైనా ఈ వ్యక్తులు స్వంతంగా ముందుకు వెళతారు.
ఈ వ్యక్తులు కొంత వ్యక్తిగత మరియు స్వతంత్ర మార్గంలో స్వీయ వ్యక్తీకరణకు బలమైన అంతర్గత అవసరాన్ని కలిగి ఉంటారు. అయితే చిటికెన వేలు ఉంగరపు వేలును తాకినట్లయితే అంటే గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే, ఆ వ్యక్తి ఎదుగుదలను అతని పైన వారు అంత ఎక్కువగా నిరోధిస్తుంటారట.
వీరు జీవితంలో ఏ విషయాన్ని అయినా వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడుతుంటారట. అయితే ఆడవారికి చిటికెన వేలు మరియు ఉంగరం వేలు మధ్యన గ్యాప్ ఉంటే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరు అధికారం చెలాయించే పొజిషన్ లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.