భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వారి రెండవ సంతానానికి స్వాగతం చెప్పారు. కుమారుడు జన్మించినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో కొన్ని నెలల నుండి వస్తున్న ప్రచారాలకు తెరదించారు. ఈ న్యూస్ తెలియగానే ఈ విరుష్క జంటకు క్రికెట్ మరియు సినీ ప్రముఖుల నుండి, ఫ్యాన్స్ నుండి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని అనుష్క తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. కుమారుడికి ‘అకాయ్’ అనే పేరుని పెటినట్లుగా పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. అనుష్క డెలివరీ లండన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా చెప్పనప్పటికీ, అనుష్క మరియు విరాట్ తమ కుమారుడు అకాయ్ పుట్టడానికి కొన్ని వారాల ముందు లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే వారు లండన్ లో డెలివరీ ఎందుకు ప్లాన్ చేశారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గురించి కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండవసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల పై ఇద్దరూ ధృవీకరించలేదు. ఆ మధ్య సౌత్ఆఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు ప్రెగ్నెన్సీ రూమర్స్ నిజం ఉందని అనుకున్నారు. ఆ తర్వాత డివిలియర్స్ ఈ న్యూస్ నిజం కాదని ప్రకటించాడు. దాంతో ఫ్యాన్స్ తో పాటు అందరు అయోమయానికి గురి అయ్యారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుండి కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ కారణాల వల్ల ఆ సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకున్నట్లుగా బీసీసీఐ కూడా ప్రకటించింది. అయితే అనుష్క డెలివరీ లండన్‌లో జరగడం గురించి చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా ఈ విషయాన్ని చెప్పనప్పటికీ, అనుష్క, విరాట్ కుమారుడు అకాయ్ జన్మించడానికి కొన్ని వారాల ముందు లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుండి విరాట్, అనుష్క తమ వ్యక్తిగత జీవితాల గురించి గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. వారి ప్రేమ గురించి వివాహం వరకు అదే పాటించారు.
ఆ తరువాత కుమార్తె వామిక పుట్టినప్పటి నుండి ఆమె ముఖం చూపించకుండా గోప్యంగా ఉంచారు. వామికా జన్మించినపుడు మీడియా హడావుడి చూసిన నేపథ్యంలో అకాయ్ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే విరాట్, అనుష్క ఆసుపత్రి నుండి తమ కుమారుడి గురించిన లీక్‌లను నివారించడం. అలాగే మీడియాను దూరంగా ఉంచడం కోసం లండన్ కి వెళ్లారని సమాచారం.
Also Read: ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?