చిలసౌ సినిమాలో అక్కినేని సుశాంత్ కి సరసన నటించి రుహనీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. దాని తర్వాత హిట్, నూటొక్క జిల్లాల అందగాడు వంటి చిత్రాలలో కథానాయకిగా అందరిని అలరించింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేస్తూ ఉంది రుహాని శర్మ.
అయితే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా ఈ సంక్రాంతి జనవరి 13 కి విడుదల కానుంది. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించనుంది రుహాని.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ, నాకు చిన్నప్పటినుంచి వెంకీ సార్ సినిమాలు అంటే ఇష్టం ఉండేవి. ఆ సినిమాలు చూస్తూనే పెరిగాను. ఎప్పుడైతే ఈ సినిమాలో ఆయనతో నటించే అవకాశం వచ్చిందో ఆయన మీద అభిమానం ఇంకా పెరిగింది. చిన్నప్పటినుంచి నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను. ఈ సినిమాలో నేను డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నా అందుకు చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పింది. అక్కడ ఉన్న యాంకర్ అనుష్క శర్మతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అని అడగడంతో ఆశ్చర్యానికి గురైంది రుహాని.

నేను ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాను మీకు ఎలా తెలుసు? అయినా అడుగుతున్నారు కనుక చెబుతున్నాను వరసకు అనుష్క శర్మ నాకు అక్క అవుతుంది. నాతో చాలా బాగా ఉంటుంది అని చెప్పింది. మరి విరాట్ కోహ్లీ మీకు బావ అవుతారు కదా తనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అని విలేకరి అడగగా, విరాట్ కోహ్లీ నాతో చాలా బాగా మాట్లాడారు. వాళ్ళిద్దరిది ఫిల్టర్ లెస్ బాండింగ్ చాలా సింపుల్ గా ఉంటారు అని చెప్పుకొచ్చింది ఈ భామ. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో రుహాని ఏ ఫోటో పెట్టినా దానికి అనుష్క ఏదో ఒక పొగడ్త పొగుడుతూనే ఉంటుంది. అనుష్క శర్మ కి, విరాట్ కోహ్లీకి ఈమె దగ్గర బంధువు అని తెలియడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు




ఆ ఫోటో ఉన్న హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఉపేంద్ర ఏం చేసినా అది సంచలనమే. 1995 నుండి అనేక సంచలనాలు క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఉపేంద్ర, వరుస విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా ‘నటించిన ఓం’ మూవీ సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులను అందుకుంది.
ఈ మూవీ గత 28 సంవత్సరాలలో 550 సార్లు రిరిలీజ్ అయ్యి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆ తరువాత టనే హీరోగా నటిస్తూ, కూడా సినిమాలు చేసి, బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. పదిహేను ఏళ్ళ తర్వాత ఒక తాజాగా ‘యూ ఐ’ అనే చిత్రానికి దర్శకత్వం చేస్తూ, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీని ఎప్పటిలానే తన శైలిలో ఎవరు ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివి కల ఈ వీడియో మూవీ పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీ కోసం ఉపేంద్ర సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. వింతగా ఉన్న మనుషులు, చివర్లో ఉపేంద్ర గుర్రం పై డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆడియెన్స్ ను భయపేట్టేలా ఉన్నారు. ఉపేంద్ర ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్‌లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్‌సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లా, కరమ్‌తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.
రోహిత్ శర్మ మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి గురునాథ్ శర్మ, తల్లి పూర్ణిమ శర్మ. తల్లి విశాఖపట్నంకు చెందిన వారు. రోహిత్ తరువాత మరో కొడుకు జన్మించాడు. అతని పేరు విశాల్ శర్మ. తండ్రి రవాణా సంస్థ స్టోర్‌హౌస్‌లో కేర్‌టేకర్‌గా చేసేవారు. అయితే శర్మ తండ్రికి ఆదాయం తక్కువకావడంతో శర్మ బోరివలిలో ఉన్న తాత, మేనమామల దగ్గర పెరిగారు. వారాంతాలలో మాత్రమే డోంబివిలిలోని ఒకే గది ఉన్న ఇంట్లో నివసించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాడు.
ఆ సమయంలోనే విశాల్‌తో ఆడుకునేవాడు. అన్నదమ్ములిద్దరు క్రికెట్ ఆడేవారు. ఈ క్రమంలో రోహిత్ టాలెంట్ చూసిన అతని అంకుల్ రోహిత్ పేరును క్రికెట్ క్యాంపులో రిజిస్టర్ చేయించాడు. అలా 14ఏళ్ళకే క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ‘హిట్‌మ్యాన్’ పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో టీమిండియా కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ముంబైలో భార్యా, కుమార్తెతో లగ్జరీ ప్రాంతంలో నివసిస్తున్న రోహిత్, తల్లిదండ్రులు మరియు సోదరుడి కోసం వారింటి కొంచెం దూరంలో మరోక గృహాన్ని కొనుగోలు చేశాడు.ఇంటికి పెద్ద కుమారుడిగా ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటున్నాడు. తమ్ముడు విశాల్‌కు అండగా నిలిచాడు. ఎక్కడో జాబ్ వెతుక్కోవాల్సిన పని లేకుండా తాను ప్రారంభించిన క్రికెట్ అకాడమీలను చూసుకునే బాధ్యతను విశాల్‌కు అప్పగించాడు. ప్రస్తుతం విశాల్ శర్మ భారత్, సింగపూర్లలోని రోహిత్ క్రికెట్ అకాడమీలకు ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేస్తున్నాడు.