కేజీఎఫ్ రిలీజ్ తరువాత రవి బస్రూర్ పేరు పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యింది. ఎవరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అని భారతీయ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘సలార్’ చిత్రంతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది.
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ రిలీజ్ అయ్యి, 18 రోజులు అవుతున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ ప్లస్. సాంగ్స్, అద్భుతమైన బీజీఎమ్ అందించారు. ప్రస్తుతం రవి బస్రూర్ బీజీఎమ్ కోసం బాలీవుడ్ స్టార్లు సైతం తహతహలాడుతున్నారు. అయితే రవి బస్రూర్ అసలు పేరు కాదు. తన పేరు మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం..
రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి, పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.? 54 ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నారంటే.?













తేజ సజ్జ, అమృత అయ్యర్ లు జంటగా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా వినయ్ రాయ్ నటించారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల రూపాయలు. ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
తేజ సజ్జా:
అమృత అయ్యర్:
వరలక్ష్మీ శరత్ కుమార్:
వినయ్ రాయ్:
వెన్నెల కిశోర్:
హనుమాన్ మూవీలో నటించిన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రాజ్ దీపక్ శెట్టి రూ. 85 లక్షలు, గెటప్ శ్రీను 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, వాసుకి లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. జనవరి 5 నుండి ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. 90లలో ఉన్న మధ్యతరగతి పిలల్ల జీవితాల్ని ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు.
శివాజీ, వాసుకి భార్యభర్తలుగా చక్కగా నటించగా, వారి ముగ్గురు పిల్లలకు మంచి పేరు వచ్చింది. వీరిలో పెద్ద అబ్బాయిగా నటించిన బాలనటుడి పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. ఇప్పటికే మౌళి సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ. అతన్ని 4 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సైతం ఉంది. ఇదివరకే ‘హాస్టల్ డేస్’ సిరీస్ లో నటించాడు.
శివాజీ చిన్న అబ్బాయి ఆదిత్యగా నటించి, పాపులర్ అయిన బాల నటుడి పేరు రోహన్ రాయ్. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలలో నటించాడు. ఈ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. శివాజీ కూతురు దివ్యగా నటించిన వాసంతిక సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

