నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ తాజాగా విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. మృణాల్ ఠాకుర్, నాని జంటగా శౌర్యువ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టైర్ గా ముందు నుంచి అంచనాలు పెంచేసింది.విడుదలైన పాటలు ట్రైలర్లు సినిమా మీద విపరీతమైన ఆసక్తి కలిగేలా చేశాయి. తండ్రి కూతురు మధ్య అనుబంధాన్ని ప్రధాన అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకసారి ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనే విషయాల్లోకి వెళ్తే…!

హాయ్ నాన్న సినిమా టోటల్ బడ్జెట్ విషయానికి వస్తే.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లతో పాటు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని టాక్. ఈ సినిమా నిర్మాణం కోసం 40 కోట్లు, ప్రమోషన్స్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక ప్రమోషన్స్ కు భారీ స్పందన లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.
తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌కు మంచి డిమాండ్ కనిపించింది. నైజాం థియేట్రికల్ హక్కులను 9 కోట్ల రూపాయలకు అమ్మారు. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలకు కలిపి 12.6 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 21.6 కోట్ల వరకు జరిగింది.

ఇక ఓవర్సీస్లో రిలీజ్ డేట్ కంటే ఒక రోజు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. అమెరికాలో జరిగిన ప్రీమియర్లకు మృణాల్ థాకూర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఇక 6.5 కోట్ల రూపాయలతో ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ సినిమా నాని కెరీర్ లో మరో మైలు రాయి అవుతుందని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.

రాత్రి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయినప్పుడే మంచి నిద్ర పడుతుంది. అందువల్ల భోజనానికి మరియు పడుకునే వేళకి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. లేకపోతే నిద్ర సంబంధితమైన ఇబ్బందులు మొదలవుతాయి. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. అందువల్ల తిన్న తరువాత పడుకోవడానికి మధ్య 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటే మంచిది.
ఇక రాత్రివేళ 8 గంటల లోపు డిన్నర్ చేయనట్లయితే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రక్తంలో షుగర్ స్థాయి పెరిగి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమయానికి ఆహారం తినడమే సరైన పరిష్కారం అని చెప్పవచ్చు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎసిడిటి, అల్సర్ లాంటి సమస్యలు కూడా రావచ్చు.
ఇక జీర్ణక్రియ అనే ప్రక్రియ సరిగ్గా జరగాలన్నా కూడా వేళకి ఆహారం తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో కారం ఎక్కువగా తీసుకోకపోవడం, ఘాటైన మసాలాలను తగ్గిస్తే మంచిది. రాత్రి పూట ఆహారంలో సలాడ్లు, పండ్లు, జ్యూస్‌లు ఉండేలా చూసుకోవాలి.
Also Read:





















