జూన్ 11న నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టీఎస్పీఎస్సీ బోర్డు మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ బోర్డు హైకోర్టు ఇచ్చిన తీర్పు పై డివిజన్ బెంచ్‌కు వెళ్తామని ప్రకటించినా కూడా అభ్యర్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 కోసం 3 లక్షల 80 వేలమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 2,32,457 మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను లీకేజీ వల్ల మొదటిసారి రద్దు చేశారు. ఆ తరువాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు రెండవ సారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ టైమ్ లో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేని ఓఎంఆర్ షీట్లు ఇవ్వడంతో అక్రమాలకు తావిచ్చేలా ఉందని కొందరు అభ్యర్థులు ఈ విషయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా గవర్నమెంట్ ను, టీఎస్పీఎస్సీ బోర్డును ఆదేశించాలని అభ్యర్థులు బి. ప్రశాంత్, జి.హరికృష్ణ, బండి ప్రశాంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషనర్ల తరఫున లాయర్ గిరిధర్‌రావు వాదనల అనంతరం, పరీక్షను రద్దు చేస్తూ ఏరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అభ్యర్థులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: కాకినాడ టీచర్ ఘటనలో నిజానికి ఏం జరిగింది..? అసలు ఇందులో తప్పు ఎవరిది..?

గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీల, మెయిన్ హీరోయిన్ అవగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకున్నారని తెలుస్తోంది. జగపతి బాబు ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు తల్లిగా ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితో నటించిన రమ్యకృష్ణ, కొన్నేళ్ళ నుండి హీరోలకు తల్లిగా, కీలక పాత్రలలో నటిస్తోంది. ఇటీవల జైలర్ మూవీలో రజినికాంత్ భార్యగా నటించింది. రమ్యకృష్ణ ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లిగా నటిస్తోంది. అయితే వీరిద్దరు ఇంతకు ముందు ‘నాని’ మూవీలో కలిసి నటించారు. మళ్ళీ 19 ఏళ్ల తరువాత గుంటూరు కారంలో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని కుటుంబం చెన్నైలోని డిడి కే రోడ్ లో నివసిస్తుంది. విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు మీరా ఆంటోనీ, లారా ఆంటోని. పెద్ద కుమార్తె మీరా వయసు 16 సంవత్సరాలు. ఆమె చర్చ్ పార్క్ హై స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈమె ప్రయాణం తీసుకోవడానికి కారణం డిప్రెషన్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆమె గత కొద్దిరోజులుగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుందని అంటున్నారు.
గారాల కుమార్తె మీరా దూరం అవడం హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. పిల్లలే లోకంగా బ్రతికే తండ్రి, వారిలో ఒకరు శాశ్వతంగా దూరం అయితే కలిగే దుఖాన్ని ఎవరూ ఓదార్చలేరు. కుమార్తె మీరాతో పాటు తాను కూడా చనిపోయానని విజయ్ ఆంటోనీ చేసిన ట్వీట్ అందరి హృదయాలను కలిచివేస్తోంది. తన జీవితంలో ఎన్నో కోల్పోయిన విజయ్ ఆంటోని ఇప్పుడు కుమార్తెను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నాడు.
తన కుమార్తె మీరా ఆంటోని అడిగిన ఆఖరి కోరికను తీర్చలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారట. మీరా థాయిలాండ్ కు తీసుకువెళ్లమని కోరిందంట. అయితే విజయ్ ఆంటోనీ బిజీ షెడ్యూల్స్ వల్ల తీసుకెళ్లలేకపోయాడట. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మరింతగా విజయ్ బాధపడుతున్నారు.





కానీ విన్నర్ ఎవరనేది ముందే ప్లానింగ్ చేసి ఉంటాదని చాలామంది నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న ఆటను బట్టి విన్నర్ ఎవరంటే ఎక్కువగా శివాజీ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పటికీ శివాజీ బాగా ఆడుతున్నాడని నెటిజన్లు అంటున్నారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేవరకూ కూడా తనపై చాలా నెగిటివిటీ ఉంది.
గుడిలో దేవుడి సన్నిధికి భక్తితో, స్కూల్ కు శ్రద్దాసక్తులతోనూ వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేవుడు అంటే పాపభీతి లేదు. చదువు నేర్పే గురువులకు గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటూ, భక్తితో పూజలు చేస్తుంటే, మరో వైపు మండపాల వద్ద ఏమాత్రం ఆలోచన లేకుండా కొందరు దొంగతనాలు చేస్తుంటే మరికొందరు వెకిలి వేషాలు వేస్తున్నారు.
మియాపూర్‌లో రెండు రోజుల కిందట ఒక గణపతి మండపంలో దేవుడికి కూడా భయపడకుండా ఒక వ్యక్తి గణపతి చేతిలోని లడ్డును దొంగిలించడం తెలిసిందే. తాజాగా మేడ్చల్ లోని రాఘవేంద్రనగర్ కాలనీలో గణేష్ మండపంలో నిద్రిస్తున్న యువకుల వద్దకి వచ్చిన ఒక దొంగ, అర్ధరాత్రి 1: 50 నిమిషాలకు మండపలోకి వచ్చి, పడుకున్నవారి తల దగ్గర పెట్టుకున్న సెల్ ఫోన్లను సైలెంట్‌గా తీసుకున్నాడు. వారిలో ఒకరు కదులుతున్నా, కొంచెం కూడా భయపడకుండా మెల్లగా సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు.
అలికిడికి లేచిన ఒక యువకుడు చూసేసరికి, దొంగ పరారయ్యాడు. మిగతా ఫ్రెండ్స్ ను కూడా లేపి, దొంగ కోసం వెతికారు. అప్పటికే పారిపోయిన దొంగ దొరకలేదు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్ కలిసి నిర్మించాయి. ఈ సిరీస్ కు గోమఠేష్ ఉపాధ్యాయ డైరెక్షన్ చేయగా, యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఈ సిరీస్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దీనిని తెలుగులోనే కాకుండా తమిళ్, మళయాల, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో నిత్యామీనన్, గౌతమితో పాటు ఒక సీనియర్ నటి కనిపించారు. ఆమె ఎవరో కాదు తాళ్లూరి రామేశ్వరి. తెలుగు, హిందీ, ఒడియా, మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించి, ఆకట్టుకున్నారు. రామేశ్వరి 1977లో మొదటిసారి ‘దుల్హన్ వహీ జో పియా మాన్ భాయే’ మూవీలో నటించింది. ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పెద్ద బ్రేక్ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి.
తెలుగులో 1978 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీతామాలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ నటించింది. ఈ మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యింది. రీ ఎంట్రీలో మహేష్ బాబు హీరోగా నటించి నిజం మూవీలో తల్లిగా నటించింది. ఆ తరువాత పలు సీరియల్స్ నటించింది. తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ నానమ్మగా కనిపించింది.

రీసెంట్ గా “జవాన్” డైరెక్టర్ అట్లీ తన సినిమాని ఆస్కార్ కి పంపిస్తానని చెప్పగా, నెటిజెన్లు ఆయనను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేశారు. పాత మసాలా చిత్రాలన్ని కలిపి కలగూరగంపలా, తీసిన మూవీని ఆస్కార్ కి పంపి ఏం మెసేజ్ ఇస్తారని నెటిజెన్లు గట్టిగా తలంటారు. ఆ ట్రోలింగ్ ఆపకముందే మరో రెండు సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
వివాదాస్పద మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అదా శర్మ సంతోషంతో తాను నటించిన మూవీని ఆస్కార్ కు పంపాలని అనుకుంటున్నారని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై నెటిజన్లు కౌంటర్లు కూడా వేస్తున్నారు.
మరో సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, ఈ మూవీని కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ మూవీని కూడా ఆస్కార్ కు పంపించాలని అనుకుంటునట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, అలియా ఓవర్ యాక్షన్ చేశారని, ఇలాంటి మూవీని ఆస్కార్ పంపిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.