టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ నిలబెట్టిన మూవీ బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా నటించి మెప్పించారు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అమరేంద్ర బహుబలి వ్యాక్స్ విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ మ్యూజియంలో పెట్టిన మైనపు విగ్రహాం పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మండిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాలలో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ మైనపు బొమ్మకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ‘బాహుబలి’ విగ్రహంలో ప్రభాస్ పొలికలు లేకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అందులో “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!

ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు.
కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 20న ఆ ఊరిలో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం చిత్తూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు యువకులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అయితే పోస్టుమార్టంలో బాధితురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవనే విషయం ప్రాథమికంగా తెలిసినట్టు ఎస్ఐ అనిల్‌కుమార్ వెల్లడించారు. ఆమె పై అఘాయిత్యం కానీ, విషప్రయోగం కానీ, జరిగిందా అనేది పరీక్షించడానికి సాంపిల్స్ ను తీసుకున్నట్లు వెల్లడించారు. బావిలో మునిగి ఊపిరాడక మరణించిందా? లేదా వేరే ఎక్కడైనా చంపి, ఆమె మృతదేహాన్ని తెచ్చి బావిలో పడేశారా అనే విషయం నిర్ధారించడం కోసం స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను సేకరించి కెమికల్ అనాలసిస్ చేయడం కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి బెడ్ పై కూర్చుని టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు తండ్రి కూర్చున్న బెడ్ పక్కనే నేల మీద కూర్చుని అతను చేసిన పనికి ఎవరైనా నవ్వకుండా ఉండలేరు. తండ్రి టీవీ చూడడంలో నిమగ్నం కావడంతో, కుమారుడు మద్యం బాటిల్, ఒక గ్లాసు తీసుకుని బెడ్ పక్కనే కూర్చుని, గ్లాస్ లో మద్యం పోస్తున్నాడు. అయితే కుమారుడు చేస్తున్న పనిని ఆ తండ్రి గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తాగుబోతు అని అనుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అతనికి మద్యం తాగే అలవాటు లేదట. సరదాగా ఆ వీడియో చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఎస్_కింగ్ 746 పేరుతో ఉన్న అకౌంట్ లో వారం క్రితం షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే టైమ్ లో ఈ వీడియోను 14 లక్షల మంది లైక్ చేసారు. నెటిజెన్లు ఈ వీడియోకి రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ ‘అన్నయ్యా నిమిషం లేట్ అయితే మీ తండ్రి కూడా వాటాకి వచ్చేస్తారు‘ అంటూ కామెంట్ చేశారు. ‘అన్నయ్యా ఒంటరిగా డ్రింక్ చేస్తే నాన్నకి కోపం వస్తుంది’ అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
అభి నక్షత్రం, అనుమోల్, మదన్ కీలకపాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ముత్తు కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్లగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, తమిళనాడులో ఉండే వీరపన్నై అనే ఊరి గ్రామ దేవత అయలీ. ఆ దేవతను రజస్వల కాని అమ్మాయిలు మాత్రమే దర్శించుకోవాలనే నియమం ఉంటుంది. ఆ ఊరి అమ్మాయిలకు రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని, అమ్మాయిలు అంతగా చదువుకోకూడదనే కట్టుబాట్లు ఉంటాయి.
అయితే ఈ కట్టుబాట్లు పాటించకుండా, ప్రేమించిన వ్యక్తితో ఒక అమ్మాయి పారిపోవడంతో దేవత ఆగ్రహించి ఆ ఊరిని నాశనం చేసిందనుకున్న ఆ గ్రామస్థులందరు వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. ఆ గ్రామస్థుల ఒక ఊరిని నిర్మించుకుని, అందులో అయలీ దేవత గుడిని నిర్మించి, తమ ఆచారాల్ని మళ్ళీ కొనసాగిస్తుంటారు. అయితే ఆ గ్రామాంలోని యళిల్ (అభి నక్షత్ర) డాక్టర్ కావాలని కలలు కంటుంది. ఆమె టెన్త్ క్లాస్ వరకు ఎలా చదువుకుంది? ఆమె కల నెరవేరిందా? లేదా? ఆమె ఊరి ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది? అనేది మిగిలిన కథ.
మొదటి నుంచే యళిల్ పాత్ర పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానిని దర్శకుడు అలానే కొనసాగిస్తూ ఆమె పోరాటాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అభి నక్షత్ర యళిల్ క్యారెక్టర్ లో జీవించింది. స్టోరీని ఆ పాత్రే ముందుకు నడిపించింది. అనుమోల్, సింగంపులి, మదన్, టీఎస్ ధర్మరాజు, లింగా వంటివారు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. రెవా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హత్తుకుంటుంది. రామ్‌జీ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఉత్తర కర్ణాటక సావాజీ కమ్యూనిటీకి చెందిన వారు శ్రావణ మాసాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణం నుండి వినాయక చతుర్థి వరకు మాంసాహారాన్ని తినరు. మాంసాహార డైట్ ను ఎలుకల వీక్ మొదలవుతుంది. తొలి రోజు మోదక, కడుబు వంటి తీపి ఆహారాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు వినాయకుడి మూషికానికి ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా ఎలుకలు మొక్కలకు హాని చేస్తాయి. ఇలా ఎలుకలను పూజిస్తూ, హాని కలిగించకూడదని ప్రార్ధిస్తారు.
నాన్ వెజ్‌లో వంటకాలలో మటన్ వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. మటన్ మసాలా, మటన్ ఖీమా, మటన్ బోటీ తదితర వాటిని నైవేద్యంగా పెడతారు. అయితే కొందరు చికెన్, చేపలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎడ్మి, రోటీ మొదలైన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా వినాయకుడికి మాంసాహార వంటకాలు నైవేద్యంగా సమర్పించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ ఫ్యామిలిలో జన్మించాడు. న్యూ ఢిల్లీలో పెరిగిన కోహ్లి, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో క్రికెట్ లో శిక్షణ పొందాడు. ఢిల్లీ అండర్-15 జట్టుతో తన కెరీర్ మొదలుపెట్టాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలో వన్డే జట్టులో ముఖ్యమైన ప్లేయర్ గా మారాడు. ఆ తర్వాత టెస్టుల్లో 2011లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిసారి నంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నాడు.
నెక్స్ట్ మ్యాచ్‌ల్లో కూడా కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. శుక్రుడు, శని, చంద్రుడు కోహ్లికి అవకాశాలను కల్పిస్తారు. విరాట్ కోహ్లీ లైఫ్ లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ జాతకంలో అదృష్టాన్ని ఇచ్చే రాజయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రహా స్థితి చాలా బాగుంది. కోహ్లీ జాతకం ప్రకారంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
రేఖ ఆనందం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో యువతకు రేఖ మరింత చేరువైంది. ఆ మూవీ తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రేఖకు అవకాశాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో రేఖకు మంచి హిట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత రేఖ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కొన్ని సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.
చాలా రోజుల తరువాత రేఖ బుల్లితెర పై మెరిసింది. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాగా చిక్కిపోయింది. ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొంది.ఆ షోలో రేఖ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అది సహజం, మన వృత్తిని చూసి అలా జరగవు. అయితే ఏం జరిగినా కూడా లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన లైఫ్ లో గుణపాఠం లాంటిది.
తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగింది. అయితే చాలా మందికి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. చిన్నవి అయినా, పెద్ద వ్యాధి అయినా ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు.
ఉపేంద్ర 90లలో ఓం, ఎ, ఉపేంద్ర, రా లాంటి సినిమాలతో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ ఉపేంద్ర వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర డైరెక్షన్ లో మూవీ అంటే టేకింగ్, కథాకథనాలు ఆడియెన్స్ అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుంది. ‘ఉపేంద్ర’ మూవీతో తెలుగులో హిట్ అందుకుని భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర, గత 20 ఏళ్ళలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అయితే చాలా విరామం తర్వాత ‘యుఐ’ అనే సినికు దర్శకత్వం చేస్తూ, నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 18న థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఉపేంద్ర ఇచ్చిన షాక్ కి కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయారు. టీజర్ ప్లే చేయగానే ఒక్కసారిగా చీకటిగా మారింది. విజువల్ ఏం లేకుండా ఆడియో మాత్రమే వినిపించడంతో ముందుగా ఏదో టెక్నికల్ ఎర్రర్ అని భావించారు. కానీ టీజర్ అది అని గ్రహించడానికి టైమ్ పట్టింది.
అయితే గత కొద్దిరోజులుగా ఉపేంద్రపై కన్నడ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు సినిమాలు చేయకుండా నిషేధం విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఉపేంద్ర సినిమా తరువాత ఆయన డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. దాంతో ఉపేంద్రను బ్యాన్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఉపేంద్ర, నటన వైపు వెళ్లాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ కు దూరంగా ఉన్నట్టు తెలిపారు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన మూవీ లెజెండ్. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై ఆచంట గోపిచంద్, ఆచంట రామ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. కొర్రపాటి సాయి సమర్పించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి త్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నాంది అవార్డ్ వచ్చింది.
ఈ రెండు సినిమాలలో ఆనంద్ రాజ్ అనే యాక్టర్ నటించాడు. సింహా సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ నటుడి పేరు ఆనంద్ రామరాజు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించారు. తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అక్కడే పూర్తి చేశాడు. నటన పై విపరీతమైన ఆసక్తి ఉన్న రామరాజు 2003లో సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు.
ఆనంద్ రామరాజు 2004 లో ఆరుగురు పతివ్రతలు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రు. ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ తరువాత గౌతమ్ SSC, పోకిరి, సింహా, నేనింతే, లెజెండ్, లౌక్యం, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్‌లో నటించిన రామరాజు తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.