తమిళ స్టార్ హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోని కుమార్తె ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను హస్పటల్ కు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారని తెలుస్తోంది.
ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి, ప్రాణాలు తీసుకోవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనికి ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో గతంలో బలవన్మరణానికి పాల్పడడం పై విజయ్ ఆంటోని మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ గా మారాయి.
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్‌కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.
#VijayAntony about suicidal thoughtspic.twitter.com/sqQGEx70h4
— Cine Promoters (@cinepromoters) September 19, 2023
Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.









#11.




సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘7:11 పీఎం’ జులై 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, హంసలదీవి అనే గ్రామంలో 1999 సంవత్సరంలో రవి ప్రసాద్ (సాహస్) ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ, ఐపీఎస్ సాధించాలని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. రవి, విమల (దీపికా రెడ్డి) ప్రేమించుకుంటారు. రాజేశ్ అనే వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఊరిలోని ప్రజలందరిని మోసం చేయడానికి రెడీ అవుతాడు.
ఆ మోసాన్ని తెలుసుకున్న రవి అతన్ని అడ్డుకొనే ప్రయత్నంలో అనుకోకుండా ఒక బస్సు ఎక్కుతాడు. నిద్ర లేచే సరికి రవి మెల్బోర్న్లో ఉంటాడు. అక్కడ కాలం 2024 లో నడుస్తూ ఉంటుంది. అసలు ఆ ఊరికి టైమ్ మిషన్ ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ టైమ్ మిషన్ ఎక్కాల్సి వచ్చింది? అతను తిరిగి తన కాలానికి వెళ్లాడా? తాను ప్రేమించిన విమలను కలిశాడా లేదా? అనేదే మిగిలిన కథ.
డైరెక్టర్ చైతూ మాదాల సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఆ పాయింట్‌ను కథగా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. అయితే మొదటి సినిమా దర్శకుడిగా స్టోరీని డీల్ చేసిన తీరు, పలు క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రల్లో సహజత్వం కనిపిస్తుంది. హీరో సాహస్ చక్కటి నటనను ప్రదర్శించాడు. హీరోయిన్ దీపిక పాత్ర పరిధి మేరకు నటించింది.
19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా 41 సంవత్సరాల కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో రావడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్, మేజర్ ఆశిష్ ధోంచక్ మరణించారు.
ముగ్గురు అమర వీరుల భౌతిక కాయాలను వారి స్వగ్రామలకు తరలించారు. ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని పంజాబ్ రాష్ట్రంలోని మల్లాన్‌పూర్ కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. కన్నిటితో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ అంతిమ సంస్కారాలను జరిపించారు. అయితే ఆయన భౌతిక కాయం వద్ద చోటు చేసుకున్న ఒక సన్నివేశం అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేసింది.
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఆరేళ్ళ కుమారుడు కబీర్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, కనిపించాడు. అక్కడ ఏం జరిగిందో అర్ధం కానీ చిన్న వయసులో ఉన్న ఆ బాబు తన నాన్న భౌతిక కాయానికి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. అన్న సెల్యూట్ చేయడం చూసిన ఆ బాబు చెల్లెలు రెండేళ్ల పాప కూడా సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసినా, టార్గెట్ ఛేదించలేక 259 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్
దానికి కారణం ఏమిటంటే, ఆసియా కప్ 3 టోర్నీలో 





1. రిమాండ్ ప్రిజనర్స్ ఈ ఖైదీలకు కేటాయించే నంబర్ రికార్డులో ఆర్.పి. అనే లెటర్స్ తర్వాత ఉంటుంది.
ప్రస్తుతం పైన చెప్పిన నాలుగు కేటగిరీల క్రిందనే ఖైదీలకు నంబర్లు కేటాయిస్తున్నారు. ఇక నంబర్ ఎలా ఇస్తారంటే, జైలు ఏర్పటు చేసినప్పటి నుండి వస్తున్న ఖైదీల క్రమ సంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల క్రింద నంబర్ కేటాయిస్తారని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డిఐజి ఒకరు బీబీసీతో చెప్పారు.
రిమాండ్ ఖైదీ అంటే, ”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై తగిన ఆధారం దొరికినపుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో లేదా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఇలా చేయడాన్ని రిమాండ్ అంటారు. కోర్టులో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారని బీబీసీతో తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ చింతపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఖైదీ వరుస సంఖ్యను బట్టి 7691 నంబర్ ను కేటాయించారని తెలుస్తోంది.