మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మలయాళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు దగ్గర అయ్యారు. స్ట్రైట్ తెలుగు చిత్రాలలోను మమ్ముట్టి నటించారు.
మమ్ముట్టి కమర్షియల్ ట్రెండ్ కి భిన్నమైన స్టోరీస్ ను, క్యారెక్టర్లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మరో ప్రయోగాత్మక స్టోరీతో మమ్ముట్టి ఆడియెన్స్ ముందుకి వచ్చారు. అదే నాన్ పకల్ నేరత్తు మయక్కం సినిమా. ఈ చిత్రం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా జల్లికట్టు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ, తెలుగు బాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిలాసఫికల్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ జేమ్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
జేమ్స్ అనే వ్యక్తి వేలంకిని మాత దర్శనానికి తన భార్యాపిల్లలు మరియు బంధువులతో కలిసి వెళతాడు. అక్కడి నుండి బస్ లో తిరిగి వచ్చేటపుడు తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఊర్లో దిగిన జేమ్స్, నేరుగా ఒక ఇంటిలోకి వెళతాడు. తెలుగు వ్యక్తి అయిన జేమ్స్ అప్పటి నుండి తమిళంలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులోని అందరిని వారి పేర్లతో పలకరిస్తూ, తన ఊరు అదే అని చెబుతాడు.
ఆ ఊరి నుండి 2 సంవత్సరాల క్రితం మిస్ అయ్యిన సుందరంలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. జేమ్స్లో సడెన్ గా వచ్చిన ఆ మార్పుకు కారణం ఏమిటి అనేది జేమ్స్ భార్య, బంధువులతో పాటు ఆ ఊరివాళ్లకు అర్ధం కాదు. జేమ్స్ ను తీసుకెళ్లడానికి భార్య, బంధువులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ అంగీకరించడు. జేమ్స్ అసలు ఎందుకు అలా మారాడు? సుందరంగా మారిన జేమ్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?
జేమ్స్ తన గతాన్ని తెలుసుకొని భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడా? లేదా సుందరంగా ఆ ఊరిలోనే ఉండిపోయాడా అనేదే మిగతా స్టోరి. మమ్ముట్టి అటు జేమ్స్ గా, ఇటు సుందరంగా 2 క్యారెక్టర్లలోనూ జీవించాడు. ఈ రెండు పాత్రలలో మమ్ముట్టి యాక్టింగ్, వేరియేషన్స్ అద్భుతం.
Also Read: బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏదో తెలుసా..?

ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ వార్తలతో నిండిపోయింది.
ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విధానాన్ని చూసి, రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదిపురుష్ కి మద్ధతుగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలోని రావణుడు సీతను అపహరించే వీడియోను, ఆదిపురుష్ లో అదే సన్నివేశాన్ని పొలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
సీరియల్ లో రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కానీ ఆదిపురుష్ లో రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయకుండా తీసుకెళ్లాడు. దీనిని అందరు తప్పుగా చూపించారని అంటున్నారు. సీరియల్ తో పోలిస్తే ఆదిపురుష్ కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీతమ్మను ఎవరు టచ్ చేయలేరని కామెంట్స్ పెడుతున్నారు.
నట సింహం బాలకృష్ణ 108వ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో ఏర్పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంటో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
టైటిల్‌ను డిఫరెంట్ గా ప్రకటించాలని ప్లాన్ చేసిన చిత్రబృందం, రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 108 హోర్డింగ్‌లను పెట్టి మూవీ టైటిల్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదంట. ‘బ్రో ఐ డోంట్ కేర్’ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి టైటిల్ ‘బ్రో’ అని ఫిక్స్ చేశారు. దాంతో ఆ టైటిల్ ను పక్కనపెట్టి ‘భగవంత్ కేసరి’ ఫైనల్ చేశారంట.
ఇంటింటి గృహలక్ష్మి తాజా ఎపిసోడ్ లో తులసి గృహహింస కేసును రీ ఓపెన్ చేయిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సాక్ష్యాన్ని కూడా పట్టుకుంటుంది. గృహహింస కేసు రీ ఓపెన్ చేశారనే విషయం తెలిసిన లాస్య, ఏదో ఆధారం దొరికినట్టుంది. అందుకే తులసి కేసు రీ ఓపెన్ చేయించిందని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు లక్కీ తులసి ఆంటీ నాన్న గురించి అడిగిందని చెప్పడంతో షాక్ అవుతుంది. ఏం చెప్పావ్ అని అడిగితే లక్కీ నకు తెలిసింది చెప్పాను అని అంటాడు.
తులసికి దొరికిన ఆధారం ఏమిటో అర్ధం అయిన లాస్య, వెంటనే ఆమె మాజీ మొదటి భర్త శేఖర్ కి కాల్ చేసి, పర్సనల్ గా మాట్లాడాలని, లొకేషన్ పంపించమని అంటుంది. వచ్చేదాకా వెయిట్ చేయమని అని అతని ఇంటికి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ లవ మొదటిసారి లాస్య మొదటి భర్త ఎంట్రీ ఇచ్చి, ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ తో ఈ సీరియల్ మీద ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది. లాస్య మొదటి భర్త శేఖర్ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్ర పోషించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి తరచు ఈ మూవీ పై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కార్టూన్ సినిమా అని ట్రోల్స్, కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై విపరీతమైన నెగటివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో మేకర్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ కారణంగానే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.
ఆ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలు కాస్త తగ్గాయి. కానీ రామాయణాన్ని తప్పుగా చూపించారని మరోసారి ఆదిపురుష్ పై వివాదం మొదలైంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఆదిపురుష్ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా చేసింది. మూవీ రిలీజ్ అయిన థియేటర్లలో ఒక్క సీట్ హనుమంతుడికి కేటాయించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆదిపురుష్ మూవీ టీమ్ మాత్రం మీడియా ఇంటరాక్షన్లు మరియు ఇంటర్వ్యూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తమ చిత్రం చుట్టూ వివాదాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లేదా ఇంటర్వ్యూలలో అడిగే కొన్ని ప్రశ్నలు వివాదానికి దారి తీస్తుండడం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. తమ మూవీకి ఎలాంటి వివాదాలు రాకుండా చేయడం కోసం ఆదిపురుష్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.
ఎన్ని రకాల లైట్లు..
హెడ్‌లైట్ ఎంత దూరం కనిపిస్తుంది..
రెడ్ లైట్ వెలిగినపుడు ఇంజిన్ షంటింగ్ కోసం రివర్స్ లో వెళుతున్న విషయం రైల్వే సిబ్బందికి అర్ధం అవుతుంది. ఇంజిన్ షంటింగ్ చేయడం కోసం ఇంకా ముందుకు వెళ్ళే సమయంలో వైట్ కలర్ లైట్ ను ఆన్ చేస్తారు.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ చేతిలో డీఫెరెంట్ వెపన్ పట్టుకొని ఉన్నారు. అలాగే టైటిల్ లో భగవంత్ పదంలో మూడు సింహాల గుర్తు ఉంది. అంటే ఈ మూవీ కథ చట్టం, పోలీసుల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా కూడా ఉన్నారు.
విజయ్ దళపతి కొత్త సినిమాల కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో దక్షిణాది ఆడియెన్స్ అలరించిన విజయ్, ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ పెయిర్ గా పాపులర్ అయిన ఈ జంట 17 ఏళ్ల తర్వాత మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లియో చిత్రం పై హైప్ ను పెంచింది.
విజయ్ ఒక వైపు లియో మూవీ షూటింగ్ లో పాల్గోంటూనే, మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తలపతి 68’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నాడు. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన విషయాలను పజిల్స్ తో చూపించారు.
అందులో విలన్ ఎవరో క్లూ ఇచ్చారు. ఒక ట్విట్టర్ ఖాతాలో ఆ పజిల్ క్లిపింగ్ ను ఇచ్చి, విలన్ ఎవరో గెస్ చేయమని అంటే ఎక్కువగా ఎస్ జే ఎస్ అక్షరాలకు రౌండప్ చేసి ఎస్ జే సూర్య ఈమూవీలో విలన్ అని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మరియు ఎస్ జే సూర్య ఇంతకు ముందు కూడా నటించారు.
తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గరకి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగిరం చేసింది. అయితే హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు.
సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. మహేష్ నటిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు మందు నెల రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమూవీ గురించే వినిపించింది. నాలుగైదు టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా వాటిలో నుండి ఒకటి గుంటూరు కారం పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
గ్లింప్స్ లో మహేష్ ను మాస్ స్టైల్ లో చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ గ్లింప్స్ 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ టైటిల్ ఎందుకు పెట్టారని చర్చ మొదలైంది. దానిని నెటిజన్లు డికోడ్ చేశారట. మహేష్‌బాబును షార్ట్‌గా GSSMB అని అంటుంటారు.
ఇక మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో పాటు వరుస 5 చిత్రాలను తీసుకుంటే, G అంటే గుంటూరు కారం అని, S అంటే సర్కారు వారి పాట అని, S అంటే సరిలేరు నీకెవ్వరు అని, M అంటే మహర్షి అని, B అంటే భరత్ అనే నేను అని లాస్ట్ ఐదు చిత్రాల తొలి అక్షరాలు కలిపితే GSSMB అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారాయి.