మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సినిమా వేదాళమ్ కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. హీరోయిన్ కీర్తిసురేశ్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్స్ విడుదల అయ్యాయి. తాజాగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీని రెండు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఒక నిర్మాణ సంస్థ కనిపించలేదు. దాంతో ఏమైందా అని ఆరా తీస్తున్నారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేయాలి. అయితే మూవీ ప్రారంభం అవుతుండగా కేఎస్ రామారావుకు సంబంధించిన క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ కూడా ఈమూవీలో భాగం అయ్యింది. దాంతో మూవీ పోస్టర్ల పై రెండు ప్రొడక్షన్ హౌస్ ల పేర్లు కనిపించాయి. కొన్నేళ్ళ నుండి పెద్ద చిత్రాల ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న ఈ సంస్థ ఎందుకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. దానికి సమాధానం రాలేదు.
తాజాగా వచ్చిన భోళా శంకర్ పోస్టర్లో సిసి సంస్థ పేరు కనిపించలేదు. దానిపై మళ్లీ కొంతమంది అడిగారు. ఈ సారి ఆ నిర్మాణ సంస్థ సన్నిహితుల నుండి సమాధానం వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2 ప్రొడక్షన్ హౌస్ ల ద్వారానే చేయాలని మొదట అనుకున్నారట. కానీ ఈ సంవత్సరం క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థకు చాలా ప్రత్యేకం. బ్యానర్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సినిమాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఈ ఏడాది మరో బ్యానర్‌తో కలసి ఎందుకు సినిమా చేయడం.
డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఈ సంవత్సరం మూవీ చేసి 50వ ఏడాదిని ప్రత్యేకం చేసుకుందామని భావించారట. అందువల్లనే ఈ మూవీ పోస్టర్లో ఆ సంస్థ పేరు కనిపించలేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్స్ కాబినేషన్ లో ఇప్పటివరకు 5 చిత్రాలు వచ్చాయి. చివరిగా 1991లో రిలీజ్ అయిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే మూవీని చేశారు. మళ్ళీ సినిమా చేస్తే 22 సంవత్సరాల తరువాత చేసినట్లు అవుతుంది.
Also Read: అప్పుడు అమ్మోరు.. ఇపుడు ఆదిపురుష్..! ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆదిపురుష్ థియేటర్లలో ఆ ఒక్క టిక్కెట్ అంటే సీట్ హనుమాన్ కోసం వదిలేస్తారట. ఎందుకంటే రామాయణ పారాయణం, శ్రీరాముడి కథను కానీ ప్రదర్శించినపుడు అక్కడికి హనుమాన్ వస్తాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఆ ఒక్క సీటూ అంజనేయుడి కోసం ఉంచేస్తారట.
ఇక థియేటర్ ఫుల్ అయిన ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే అందరి దృష్టి ఆ ఒక్క సీటు పైనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆ సీట్ లో అంజనేయుడి ప్రతిమ ఉంచినట్లయితే ఆడియెన్స్ అందరు భక్తి మూడ్ లోకి వెళ్తారు. అలా హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్ అంటే మూవీకి పబ్లిసిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
1995 జూన్ 16న రిలీజ్ అయిన ‘అమ్మెరు’ మూవీ సమయంలో కూడా ఇలాంటిది చేశారు. కానీ అది మూవీ యూనిట్ ప్లాన్ చేయలేదు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు కలిసి చేశారు. ఆ మూవీ ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టారు. అలాగే థియేటర్ల బయట చిన్న దేవాలయాన్ని కూడా పెట్టారు. పూజలు, ప్రసాదాలు, హుండీల లాంటివి ఏర్పాటు చేశారు. అమ్మెరు మూవీ అప్పటికే హిట్ అయినా వీటి వల్ల ఆ మూవీ వసూళ్లు మరింతగా పెరిగాయి.
రెండి సంవత్సరాలకు ఒకసారి ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జూన్ 7న (బుధవారం) నుండి మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ గ్రౌండ్ సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరి ఈ ఓవల్‌లో ‘గద’ అందుకునే జట్టు ఏది అని అందరు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం టీ20 దే హవా నడుస్తోంది. జెంటిల్మన్ గేమ్‌కు అసలు రూపం అంటే టెస్ట్. ఈ టెస్ట్ మ్యాచ్ లకు పాపులారిటీ తీసుకురావడం కోసం ఐసీసీ చేసిన ఆలోచనే డబ్ల్యూటీసీ. ఇది 2019-21లో మొదలైంది.
ఇప్పుడు జరుగబోయేది డబ్ల్యూటీసీలో రెండో సీజన్. గెలిచిన జట్టుకు అందచేసే గదను ఇంగ్లండ్ లోని థామస్ లైట్ తయారు చేసింది. క్రికెట్లో ముఖ్యమైన బంతిని కేంద్ర బిందువుగా చేసి, గదను తయారు చేసింది. దీనికి బంగారు పూత ఉన్న బంతిని అమర్చింది. బంతి అమరిక టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిని తెలుపుతుంది. గద యొక్క హ్యాండిల్ క్రికెట్ స్టంప్ ను సూచిస్తుంది. హ్యాండిల్ కి రిబ్బన్ ఉన్నగెలుపుకు చిహ్నంగా భావిస్తారు.
ఈ గదను ముందుగా డిజైన్ చేసింది మాత్రం ట్రోఫీ డిజైనింగ్ కంపెనీ ట్రెవర్ బ్రౌన్. గద రూపకల్పనకు ప్రేరణ ఇచ్చింది ఏమిటనేది బ్రౌన్ తెలిపారు. ‘ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన వెంటనే ఒక ప్లేయర్ స్టంప్‌ను తీసుకొని దానిని సంతోషంగా ఊపడం నన్ను ఆకర్షించింది. ఆ విధంగా గద ఐడియా వచ్చింది’ అని అన్నారు.
ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించింది. అయితే ఈ మూవీని రాజమౌళి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాలని భావించడట.
అయితే సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ డేట్స్ ఇతర సినిమాలకి ఇవ్వడంతో డేట్స్ లేక ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరకి వెళ్ళడానికి కాస్త ఆలోచించాడట. దానికి కారణం గతంలో రాజమౌళి ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి చిత్రాలను రిజెక్ట్ చేసాడు. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాడట.
అయితే ఒకరోజు ప్రభాస్ పుట్టినరోజు పార్టీకి తెలుగు స్టార్ హీరోలు, నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. ఆ ఆహ్వానం తనకు కూడా రావడంతో రాజమౌళి పార్టీకి వెళ్ళినపుడు, తన దగ్గర ఒక కథ ఉందని, వింటావా అని ప్రభాస్ ని అడగాడట. తరువాతి రోజు చెప్పమని అన్నాడంట. రాజమౌళి తరువాతి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం, ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పారంట.
టాలీవుడ్ చిత్రాలలో నటించి హీరోగా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2021 లో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ మూవీ పై సిద్ధార్థ్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడాడు. మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో కానీ ఆమూవీ ఆశించినట్లుగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ప్లాప్ అవడం పై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ‘మహా సముద్రం’ నా ఫేవరెట్ సినిమా. కానీ ఆ మూవీ జనాలకి కనెక్ట్ కాలేదు. హీరో ఫ్రెండ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం ఆడియెన్స్ కి నచ్చలేదు, అందువల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలా అని ఈ చిత్రం చెడ్డ మూవీ కాదు. దర్శకుడు అజయ్ భూపతితో వర్క్ చేయడానికి ఇప్పటికీ నేను రెడీగా ఉన్నాను.
అతను గ్రేట్ టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100 మూవీని మించిన చిత్రాలు అజయ్ నుండి చాలా వస్తాయని అన్నారు. కొంతమంది నాతో ఈ మూవీ మరో 10 సంవత్సరాల తరవాత రావాల్సింది అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదని చెప్పుకొచ్చారు.
ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణించే సమయంలో కానీ, వాటి కోసం వేచి చూసే సమయంలో కానీ రైల్వే స్టేషన్ లో కనిపించే రైళ్ల పై చాలా రకాల గుర్తులు కనిపిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా రైలు వెనకాల ఉండే ఎక్స్ గుర్తును దాదాపు అందరు చూసే ఉంటారు. ఈ గుర్తు రైలు చివరి బోగి పై చాలా పెద్దగా రాసి ఉంటుంది. అందువల్ల తేలికగా కనిపిస్తుంది.
నిజానికి ఈ పెద్దగా రాసిన ఎక్స్ గుర్తు ఎల్లప్పుడూ ట్రైన్ ఆఖరి బోగీ పై రాస్తారు. దీని అర్థం ఏమిటంటే ఆ గుర్తు ఉన్న బోగీ ఆ రైలు యొక్క ఆఖరి పెట్టె. ఇక ప్యాసింజర్ ట్రైన్ చివరి పెట్టెలో ఎక్స్ మాత్రమే కాకుండా ఎల్వి అనే గుర్తు లేదా అక్షరాలు కూడా ఉంటాయి. ఎల్వి అనగా లాస్ట్ వెహికల్ అని అర్ధం. ఈ రెండు గుర్తులు ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు మరియు అధికారులకు సంబంధించినవి.
ఒకవేళ రైలు చివరి బోగీ మీద ఎక్స్ లేదా ఎల్వి గుర్తు కనిపించకపోతే రైల్వే ఉద్యోగి లేదా అధికారి వెంటనే అలర్ట్ అయ్యి ఆ విషయన్ని సమీప కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేస్తాడు. ఈ రెండు గుర్తులు రైలు చివరి బోగీ పై కనిపించకపోతే ఆ రైలు యొక్క చివరి బోగీ లేదా రైలు కొంత భాగం ఆ ట్రైన్ నుండి వేరు అయ్యిందని అర్ధం.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 




మాన్యాలు, ఆస్తులు పోగొట్టుకున్న ఇతర పాలేగాళ్ళు రెడ్డి నాయకత్వంలో చేరారు. వీరిలో వనపర్తి, జటప్రోలు, మునగాల, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్,పెనుగొండ, అవుకు జమీందార్లు, కొందరు చెంచులు, బోయలు కూడా ఉన్నారు. 



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు (జూన్ 6) ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తోంది. ఈ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం.
తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ఆంజనేయస్వామి భక్తులకు గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. అది ఏమిటంటే “ఆది పురుష్” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు. హనుమంతుడి కోసం సీటు ఖాళీగా ఉంచడం ఏంటనే సందేహం వస్తుంది. దానికి సమాధానం కూడా ఆ ప్రకటనలో ఇచ్చారు.
ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.