జూన్ 2న ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ ప్రమాదం పై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఇతర దేశాల అధినేతలు మరణించిన వారి ఫ్యామిలిలకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడి కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం అచ్చం ఒక సినిమాలోని రైలు ప్రమాదం లాగే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. మరి ఆ చిత్రం ఏమిటో? ఆ రైలు ప్రమాదం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒరిస్సాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదం లో 280కి పైగా మరణించగా, 1000కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని భారత దేశ రైల్వే హిస్టరీలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా అనుకుంటున్నారు. నలబై సంవత్సరాల క్రితం హార్‌లోని సహస్ర దగ్గర ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 500 మంది మరణించారు.
ఇదే ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై భిన్నామైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ఈ ప్రమాదం ఇటీవల రిలీజ్ అయిన “విడుదల పార్ట్ 1” సినిమాలో జరిగినట్లే ఉంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఆయన చిత్రాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి.
ఈ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్, కొందరు వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపించింది. విడుదల పార్ట్ 1 సినిమా రైలు ప్రమాద సన్నివేశంతో మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో ఇక ట్రైన్ ను బాంబుతో పేల్చే స్తారు. అయితే ప్రమాదం మాత్రం అచ్చం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం లాగే ఉండడంతో సేమ్ టు సేమ్, ఆ సినిమాలోని సీన్ రిపీట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారత దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ ట్రైన్. రైల్వే చరిత్రలో లెజెండ్. అలాగే వేగంలో రారాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ది, వందేభారత్ ట్రైన్స్ వచ్చాయి. అయితే 46 సంవత్సరాల క్రితం వచ్చిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇదే. ఇండియన్ హిస్టరీలో అత్యధిక వేగం కలిగిన మొట్టమొదటి రైలుగా పేరుగాంచింది.
1997లో మార్చి 6న మొదలైన ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు హౌరా నుండి చెన్నై మధ్య 4 రాష్ట్రాల గుండా 25 గంటల్లో, 16 వందల 61 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రతీరోజూ దాదాపు 1661 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ చెన్నైలో మొదలయితే నాన్ స్టాప్ గా 431 కిలో మీటర్లు ప్రయాణించి 6 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది.
క్షణాల్లో స్టేషన్ దాటుతుందంటే దాని వేగం అలాంటిది. 46 ఏళ్ళుగా నిరంతరాయంగా తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తోంది. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే నడిచేది. ఆ తర్వాత ఈ రైలుకు డిమాండ్ పెరగటంతో ఈ ట్రైన్ ను ప్రతిరోజూ నడుపుతున్నారు. గతంలో కూడా కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ కి గురైంది.
అయితే ప్రస్తుతం జరిగిన ఈ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ ట్రైన్ ను ప్రవేశపెట్టిన తరువాత ఇలాంటి భారీ ప్రమాదం జరగలేదు. ఇప్పటి దాకా లక్షలాది మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు భారీ యాక్సిడెంట్ జరగటంతో దాని హిస్టరీని, స్పీడ్ ను ఆయా ప్రాంతాలవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు.
1997లో ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడిగా జయంత్ సి పరాన్జీ, ఆమూవీ హిట్ తో వరుస అవకాశాలు అందుకుని, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలను చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘తీన్ మార్’ అనే సినిమాని చేశారు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ మూవీ తరువాత జయంత్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జయంత్ ‘తీన్మార్’ ప్లాప్ కావడం పై స్పందించారు. జయంత్ మాట్లాడుతూ ‘ తీన్మార్ సినిమా నాకు ఇప్పటికీ, ప్రెష్ ప్రేమకథగానే అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాప్ అవడానికి కారణాలు అయితే చెప్పలేను. కానీ ఈ సినిమా వల్ల కొందరు పవన్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ త్రిషకు సోనూసూద్‌తో పెళ్లి కావడం, ఆ తర్వాత త్రిష మళ్ళీ పవన్ కల్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు ఆడియెన్స్ కి నచ్చలేదు. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడలేక పోయారు. ఇదే సినిమాని ఆ సమయంలోని యంగ్ హీరోతో తెరకెక్కించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది కావచ్చు” అని అన్నారు.
ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కసితో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతుంది. ఆఖరిసారిగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 7 నుండి 11 వరకుఇంగ్లండ్లో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. కెన్నింగ్టన్ ఓవల్ గ్రౌండ్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో వర్షం పడే ఛాన్స్ ఉండడంతో ట్రోఫీ విన్నర్ ను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. జూన్ 7 – 11 వరకు జరిగే మ్యాచ్ లో నిర్ణయం రానట్లయితే జూన్ 12 రిజర్వ్ డే అందుబాటులో ఉంది.
ఇక వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయినట్లయితే, ఐసిసి రూల్స్ ప్రకారం ఫైనల్ లో తలపడే రెండు జట్లను అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు జట్లను ఐసిసి చాంపియన్‌షిప్ విజేతలుగా ప్రకటిస్తుంది. అందువల్ల భారత జట్టు అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.








1. సమంత:
2. పూజా హెగ్డే:
3. సాయి పల్లవి:
4. రష్మికా మందన్న:
5. కీర్తి సురేష్:
6. అనుష్క శెట్టి:
7. కాజల్ అగర్వాల్:
8. కృతి శెట్టి :
9. రకుల్ ప్రీత్ సింగ్:
10. ప్రియాంకా మోహన్:
11. రాశి కన్నా:
12. దీపికా పదుకొనే:
దీపికా పదుకొనే ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
అయితే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కండిషన్ సీరియస్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. వీలైనంత త్వరగాపంచ్ ప్రసాద్ సర్జరీ చేయాలని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని, అందు కోసం దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.
పంచ్ ప్రసాద్ హెల్త్ కండిషన్ ను వివరిస్తూ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోనే నూకరాజు ఒక వీడియో విడుదల చేశాడు. “ఎన్నో హాస్పటల్స్ తిరిగామని ప్రసాద్ అన్న హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితమే 2 కిడ్నీలు ఫెయిలయినా, ఆ బాధను అప్పటి నుండి అలాగే భరిస్తున్నాడు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి జబ్బులు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయని, ప్రసాద్ అన్నకు అలానే జరిగింది.
వైద్యులు వీలైనంత త్వరగా ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని, చేయించకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఈ ఆపరేషన్ కు ఖర్చు లక్షల్లో అవుతుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా దయ చేసి మీకు వీలైనంత సహాయం చేయండి” అని నూకరాజు అర్థించాడు. పంచ్ ప్రసాద్ ఈ వీడియోలో ముఖానికి ఆక్సిజన్ మాస్కుతో కనిపించాడు.
మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన శ్రీకాంత్ అడ్డాల గత కొన్నేళ్ళ నుండి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయజానకి నాయక, అఖండ లాంటి సినిమాల నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్ణను ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.
ఈ పోస్టర్ లో హీరో విరాట్ కర్ణ మాస్ లుక్ తో కనిపించాడు. అదే కాకుండా విరాట్ ఊరులోని ఓ వర్గానికి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ పై ‘ఓ సామాన్యుడి సంతకం’ క్యాప్షన్ కనిపిస్తోంది. దీంతో మూవీ ప్రారంభంలోనే పోస్టర్ అందరిని ఆకర్షించింది. ఈ మూవీ కోనసీమలో 1980ల నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఆ సమయంలో అక్కడ జరిగిన రాజకీయాలు, కులాల, వర్గ పోరాటాలు, గొడవల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీ భారతీయ సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులను ఒక్కసారిగా మార్చివేసింది. సినీ హిస్టరీలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే ఈ చిత్రాలకు ఊహించని స్థాయిలో ఖర్చు అయ్యింది. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్స్ 400 కోట్లు అప్పు చేశారని ఇటీవల రానా చెప్పుకొచ్చారు. 3, 4 ఏళ్ల క్రితం చిత్రాలకు డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్ తన ఇంటి నుంచి, లేదా బ్యాంకులలో ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేవారని రానా అన్నారు. గతంలో 24-28 శాతం వడ్డీ కట్టేవాళ్లమని చెప్పారు.
బాహుబలి 1,2 చిత్రాల కోసం 300-400 కోట్లు 24 శాతం వడ్డీకి అప్పుగా తీసుకువచ్చారని రానా అన్నారు. బాహుబలి 1 సమయంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ సమయంలో నిర్మాతలు 180 కోట్ల రూపాయలు 24 శాతం వడ్డీకి అప్పు చేశారని చెప్పుకొచ్చారు. బాహుబలి ఆడకపోతే ఆ కండిషన్ ను ఊహించుకోవడం కూడా కష్టమని రానా అన్నారు.