తెలుగు టెలివిజన్ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. ఎపుడు ప్రసారం చేసినా.. ‘అమృతం’ సీరియల్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీరియల్‌ను కొంత మంది ప్రేక్షకులు యూట్యూబ్ వేదికగా చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఒక్కో సీరియల్‌కు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి.ఈ సీరియల్ హక్కులను జీ 5 డిజిటల్ మీడియా భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక నుంచి ఈ సీరియల్ చూడాలనుకునే వాళ్లు జీ5 డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఉచితంగానే వీక్షించవచ్చు.
అంతేకాకుండా ఇప్పుడు ఈ సీరియల్ కి కొనసాగింపుగా అమృతం 2 మొదలు పెట్టినారు , గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయిపోయారు. ఇందులో కూడా అంజి, సర్వం, అప్పాజీ ఇలా అన్ని పాత్రలు ఉంటాయి. అయితే ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ వచ్చిన గుండు హనుమంతరావు ప్రస్తుతం లేరు కాబట్టి అయన పాత్రలో సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. ఇక మిగిలిన వారు అమృతం 2 లో కూడా కొనసాగనున్నారు. దానికి సంబందించిన ప్రోమో వచ్చేసింది.
అయితే చాలా మంది అమృతం ఫాన్స్ కి ఈ రెండో సీజన్ రావడానికి ఇంత లేట్ ఎందుకు అయ్యింది అనే డౌట్ ఉంది. ఆ ప్రశ్నకు అమృతం ప్రొడక్షన్ టీం లో ఒకరు ఇలా క్లారిటీ ఇచ్చారు. అమృతం మళ్ళీ చిలుకుతున్నాం ఇన్నాళ్ళెందుకు పట్టింది? ‘అమృతం’ మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు…
1. అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). 2.ఇవన్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది.
3.గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు దూరమవ్వడం.
ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అమృతం ద్వితీయం మనముందుకు రానుంది.