భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ అవి ఎంతవ రకు వెళ్తాయి అనేదే ముఖ్యం అవుతుంది. కొన్ని గొడవలు ఒక మనిషిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. ఆ కథ ఏంటో అతని మాటల్లోనే విందాం. నా పేరు శేఖర్. కాలేజ్ రోజుల నుండి కూడా సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడటం మాత్రమే కాదు. సినిమాలు తీయాలి అనే ఆలోచన ఉంది. దాంతో కాలేజ్ రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడిని. ఒకసారి నా ఇంటర్ స్నేహితులు అందరూ కూడా కలిసాం. అప్పుడు నా ఫ్రెండ్ విద్యని కలిసాను. తనకి నాకు ఇలా సినిమాలు అంటే ఇష్టం అని చెప్పాను.

అప్పటి వరకు అందరూ, “సినిమాలు అవసరమా?” అని అన్నారు. కానీ విద్య మాత్రమే, “అలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవడం చాలా గ్రేట్” అని అంది. దాంతో నాకు ఆ విషయం చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి నుండి విద్యతో మాట్లాడటం మొదలు పెట్టాను. మెల్లగా మా స్నేహం ప్రేమగా మారింది. ఒకసారి నేనే తనకి చెప్పేసాను. తను కూడా నా ప్రేమని అంగీకరించింది. నాకు డైరెక్టర్ అవ్వాలి అని ఉంది అనే విషయం కూడా చెప్పాను. పెళ్లి తర్వాత కూడా తను నా లక్ష్యాన్ని చేరుకోవడంలో సపోర్ట్ చేస్తాను అంది. ఇద్దరి ఇళ్లల్లో ఒప్పించాం. విద్య ఇంట్లో ఒప్పుకోవడం కాస్త కష్టం అయ్యింది. కానీ తను ఒప్పించింది. అలా మా పెళ్లి జరిగింది.

నేను కూడా డైరెక్టర్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాను. కానీ ఇంత పెద్ద ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే చిన్న విషయం కాదు. రోజు ఏదో ఒక ప్రయత్నం చేద్దామని వెళ్లేవాడిని. నిరాశగా ఇంటికి వచ్చేవాడిని. ఒక ఏడాది ఇలాగే గడిచిపోయింది. విద్య మాత్రం నాకు అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. పని చాలా ఎక్కువగా ఉండేది. కానీ సినిమా తీయడం ఎలా అనే విషయంలో టెక్నిక్స్ తెలిసేవి. మెల్లగా విద్యలో మార్పు రావడం మొదలయ్యింది. చిన్న చిన్న వాటికి విసుక్కునేది. ఎంత బిజీగా ఉన్నా కూడా నేను తనతో సమయం గడపడానికి ప్రయత్నించే వాడిని.

ఒకరోజు, “ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా?” అని కోపంగా చెప్పింది. నాకు ఏమీ అర్థం కాలేదు. విద్యలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. అప్పటికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. కానీ డైరెక్టర్ అవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. అలా అని చెప్పి నేను నా లక్ష్యాన్ని వదులుకోలేను. అందరికంటే ఎక్కువగా నన్ను నమ్మిన తనే ఇప్పుడు నేను దేనికి పనికిరాని వాడిని అన్నట్టు చూస్తోంది. నా వయసు వాళ్ళు అందరూ చాలా బాగా సెటిల్ అయిపోయారు అని అంటోంది. తన మాటల వల్ల నా ఆత్మవిశ్వాసం పోతోంది.

నా మీద నాకు అసలు నమ్మకం లేదు. కాన్ఫిడెన్స్ కూడా లేదు. మానసికంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఒకసారి ఇదే విషయం తనకి చెప్పాను. ఇవన్నీ మాటలు అనుకొని అసలు నేను చెప్పేది వినలేదు. ఇది ఇంకా బాధగా అనిపించింది. ఈ విషయానికి కూడా నన్ను అవమానిస్తుందా? అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంది కదా? ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు నేనేం చేయాలి? నా లక్ష్యాన్ని వదిలేయడం కూడా తప్పు కదా? నా పరిస్థితికి పరిష్కారం కూడా నాకు అర్థం కావట్లేదు.
ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ గురించి ఈయన చెప్పినట్టే జరిగింది..!






















మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014 లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.