ఎంవీఆర్ గ్రూపు సంస్థల అధినేత ఎంవీఆర్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించేలా కనిపిస్తున్నారు..అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన
గత రెండు దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంవీఆర్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయని సమాచారం..టికెట్ హామీ ఇస్తేనే జాయిన్ అవుతానని ఎంవీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. దీంతో ఎంవీఆర్ ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారాం.

ఒక ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఎంవీఆర్ కు కన్మర్మ్ చేసినా..ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. ఆ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని ఎంవీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇన్నాళ్లూ ఏ పార్టీలోనూ చేరకుండా సొంతంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న ఎంవీఆర్..ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేస్తే బెటర్ అని ఆయన రాజకీయ సహచరులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది..
ఎన్నో ఏళ్లుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎంవీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.. వృద్ధులను తీర్థయాత్రలకు పంపడం..రూపాయికే భోజనం.. యువతకు ఉపాధి, విద్య, వైద్యం..ఇలా అనేక రంగాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.. ఎంవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు, దేవాలయాల పునరుద్ధరణ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రతీ ఇంటికి ఎంవీఆర్ చొచ్చుకుపోయారు.. ఆయన సాయం అందని కుటుంబాలు అరుదు అంటే ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు..
ఇక ఏడాదిలో ఆరు నెలల పాటు ఆధ్యాత్మిక చింతనలోనే గడిపే ఎంవీఆర్..రాజకీయాల్లోకి రావడం కూడా ప్రజల కోసమే..వారికి ఇంకా ఏదైనా చేయొచ్చు కదా అనే..అంటారు.. చూద్దాం మరి ఆయనకు ఇష్టమైన పార్టీ నుంచి టికెట్ వస్తుందా..లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా.. ఎంవీఆర్ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే కచ్చితంగా గెలుస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.













కమెడియన్ సంతానంను హీరోగా నిలబెట్టిన చిత్రాలలో ఏ1 మూవీ ఒకటి. కోలీవుడ్ లో విడుదల అయిన ఐదేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏ1 మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు.
సంతానం కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో పాటుగా రూ. 79 చెల్లించాల్సి ఉంటుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి జాన్సన్ కే దర్శకత్వం వహించాడు. అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమా మంచి వసూళ్ళు సాధించి, స్టార్ హీరోల చిత్రాలతో పోటీగా విడుదల అయ్యి, బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.











తనకంటూ ఉన్న ఒకేఒక ఆస్తి శంకర్ పల్లి దగ్గర ఉన్న ఎనిమిది ఎకరాల పొలం అని తెలిపారు. దానిని పవన్ ప్రేమతో కొన్నారని, పవన్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అందుకోసమే, ఎన్నో ఏళ్ళ క్రితం కొనుగోలు చేశారని చెప్పారు. తన కెరీర్ మొదట్లో మూవీ ద్వారా వచ్చిన తొలి ఎనిమిది లక్షలతో ఈ పొలాన్ని తీసుకున్నాడు. అయితే దానిని కూడా ఒక టైమ్ లో అమ్మబోగా తానే వద్దని అడ్డుపడినట్లుగా తెలిపారు. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఆస్తి శంకర్ పల్లి ఫార్మ్ హౌస్ ఒకటే అని నాగబాబు చెప్పుకొచ్చారు.



