యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా విజయం తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో దేవర మూవీ పై సహజంగానే అంచనాలు పెరిగాయి.
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ప్యాన్ ఇండియా మూవీగా, తారక్ కెరీర్ లో హైయ్యేస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ గ్లింప్స్ లోని ఓ షాట్ పైనే అందరి దృష్టి పడింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
కొరటాల నుండి ఇప్పుటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ సోషల్ మెసేజ్ టైప్ లో ఉంటాయి. కానీ దేవర మాత్రమే మొత్తం మాస్ ఉంది. స్టోరీ చెప్పకుండా దేవర ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఓడలతో పాటు రక్తంతో నిండిన సముద్రం, నెవ్వర్ బిఫోర్ అనే విధంగా మాస్ పాత్రలో ఎన్టీఆర్ ఊచకోత కోసాడు. ఓ షాట్ లో ఆఫ్ మూన్ ఉండగా, నెక్స్ట్ షాట్ లో ఇంకో హాఫ్ మూన్ బ్లడ్ తో కలిసి ఫుల్ మూన్ గా కనిపిస్తుంది. ఈ షాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ యాక్టింగ్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో అందరికి తెలిసింది. ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ రేంజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ట్యాగ్ తో ఉన్న ఎన్టీఆర్, ఈ మూవీతో “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.
Also Read: చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనా..? ప్లాన్ మామూలుగా లేదుగా..?








అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నా సామి రంగా’ జనవరి 14కి రిలీజ్ కానుంది. ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకటి, రెండు రోజుల తేడాతో రిలీజ్ కానున్నాయి. ‘నా సామి రంగా’ రీమేక్ మూవీ అనే విషయం తెలిసిందే.
మూడేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ యాంటీ క్లైమాక్స్ మూవీ. నాగార్జున ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రీమేక్ అని తెలిసిన వెంటనే చాలామంది మలయాళ మూవీని చూశారు. ఇక మలయాళ మూవీ స్టోరీ, కథనం తెలుగుకి వర్కౌట్ కాదు. ఎందుకంటే మలయాళ మూవీలో హీరో పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆ సీన్ ను ఏమైనా మార్చరా లేదంటే, తెలుగు ప్రేక్షకులు అలాంటి ముగింపును అంతగా ఇష్టపడరు. అలా వచ్చిన సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి. గతంలో నాగార్జున నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ మూవీ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ అలా కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో నాగార్జున ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు.



బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్‌కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్‌కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్, మూడు పాటలు, పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.
ఆదివారం నాడు సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య గుంటూరు కారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే యూట్యూబ్ లోనూ విడుదల అయ్యింది. రెండు నిమిషాల, 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మహేష్ పాత్రను, బాడీ లాంగ్వేజ్ హైలెట్ అయ్యే విధంగా చూపించారు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫిదా చేశాడు. మహేష్ డైలాగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్లు శ్రీలీల , మీనాక్షిల గ్లామర్ సైతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో ప్రెస్ మీట్ లో రమ్యకృష్ణను ఒక జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కనిపించింది.
అతని వాయిస్ త్రివిక్రమ్ వాయిస్ లా ఉంది. దాంతో ఈ మూవీలో త్రివిక్రమ్ కనిపించే ఛాన్స్ ఉందమో అని టాక్. అంతే కాకుండా మహేష్ పాత్ర చిన్నప్పుడు నిప్పు రవ్వ కంట్లో పడినట్టుగా కనిపించింది. ఒకవేళ మహేష్ కంటికి సమస్య ఏదైనా ఉందన్నట్టుగా చూపిస్తారేమో, రెండు సీన్స్ లో మహేష్ కన్ను ఒకటి మూసి చూడడం కనిపించింది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఫైట్ సీన్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్న ఫీల్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంటూ ఇప్పటికే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది.