నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అదే ఊపుతో ఇప్పుడు తన తదుపరి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమాకి మెగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ చేయనున్నారు.
బాబీ కూడా ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టారు మీరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమా నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది అని.శ్రద్ధ ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు చేసింది.మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.ప్రస్తుతం వెంకటేష్ తరఫున సైంధవ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అయితే శ్రద్ధ బాలయ్య సినిమాలో నటిస్తుంది అనగానే చాలామంది షాక్ అవుతారు ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య వయసు 63 సంవత్సరాలు. శ్రద్ధ వయసు 33 సంవత్సరాలు. ఎంత పెద్ద సీనియర్ హీరో పక్కన ఎంత చిన్న అమ్మాయి హీరోయిన్ గాన అంటూ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ హీరోలు పక్కన సినిమాలు చేస్తున్న శ్రద్ధ సీనియర్ హీరో పక్కన చేస్తే ఆఫర్లు రావు అంటూ చెప్పుకొస్తున్నారు.
ALSO READ : ఆదికేశవ మూవీలోని ఈ సీన్ చూశారా..? ఆ హిట్ మూవీ నుండి కాపీ చేశారా..?

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆదికేశవ. ఈ మూవీలో మలయాళ యాక్టర్ జోజు జార్జ్, రాధిక, తనికెళ్ళ భరణి, సుధాకర్, రచ్చ రవి వంటివారు కీలక పాత్రలలో నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ కాపీ సన్నివేశాలని గమనించారు. ఆ విషయాన్ని వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు మూవీలోని ఫ్లాష్ బ్యాక్ యాక్సిడెంట్ సీన్ ను ఆదికేశవ మూవీలో ఉపయోగించారు. దీంతో రెండు సినిమాలలో సీన్స్ నెట్టింట్లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజెన్లు తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే దూకుడు సీన్ ను గల్లీ రౌడీ అనే మూవీలో కూడా ఉపయోగించారని మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
ప్రభాస్ సలార్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. వీరిలో ‘కాటేరమ్మ కొడుకును పంపింది’ అంటూ డైలాగ్ చెప్పిన అమ్మాయి కూడా చాలా పాపులర్ అయింది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్. దాంతో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. ఫర్జానా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫర్జానా ముస్లిం అమ్మాయి. అయితే సురభి క్యారెక్టర్ ను ఎలా చేశావని అడగగా, ఆమె మాట్లాడుతూ తన తండ్రి ముస్లిం, అని, తల్లి హిందూ అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో పండగలన్ని చేసుకుంటామని చెప్పింది. నటన ముఖ్యమని, దానికి మతంతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ, మోడల్‌గా ఇప్పటికే పలు యాడ్స్ లో నటించానని, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించానని తెలిపింది. ఆ క్రమంలోనే ‘సలార్’ లో ఛాన్స్ వచ్చిందని ఫర్జానా చెప్పింది.
సురభి క్యారెక్టర్ కోసం ఎంతో మంది ఆడిషన్స్‌కు వచ్చారని, అయితే తను ఎంపిక అవ్వడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు సలార్ మూవీలోని ‘ఫర్జానా’ లుక్ కు, నిజ జీవితంలోని లుక్ కు చాలా ఛేంజ్ ఉందని అంటున్నారు. రియల్ లైఫ్ లో ఆమె చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్‌ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.










