ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల షూటింగ్ లో అల్లు అర్జున్ కి నడుం నొప్పి వచ్చిందని షూటింగ్ వాయిదా కూడా వేశారు.
అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు అనేదానిపైన స్పష్టత లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీని ప్రకటించారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు అల్లు అర్జున్ హోం బ్యానర్ గీత ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.ఇది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వినికిడి.

అయితే అల్లు అర్జున్ మరో కొత్త మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టిన తమిళ్ డైరెక్టర్ అట్లి డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక మూవీ చేయనున్నారు అనే వార్త ఎప్పటినుండో వినిపిస్తుంది. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ అట్లీతోనే అని అంటునారు. ఇప్పటికే ఈ కథ సినిమాకు సంబంధించిన కథ చర్చిలు అల్లు అర్జున్ అట్లీ పూర్తి చేశారట.

అట్లీ చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని వీలైనంత త్వరగా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే దాని పైన క్లారిటీ లేదు.ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నారట. అట్లి సినిమాలంటే ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఫార్మేట్ లో ఉంటాయి. అయితే అల్లు అర్జున్ ని అట్లీ ఎలా చూపించబోతాడో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 చివరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది





ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ అలరిస్తున్నాయి. ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అనే డైలాగ్ రాగానే ప్రభాస్ యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థియేటర్లు బిజీఎం, విజిల్స్‌తో దద్దరిల్లుతున్నాయి. ఆ కాటేరమ్మ కథ గురించి చాలామందికి తెలియదు. కైలాసంలో శంకరుడు నిద్రిస్తున్న సమయంలో పార్వతి దేవి ప్రతి రోజూ రాత్రి సమయంలో వెళ్లి, సూర్యోదయం కాకముందే కైలాసానికి వెళుతుంది.
ఈ విషయం పై శంకరుడు పార్వతిదేవిని నిలదీస్తాడు. అయితే ఆమె తనకు తెలియకుండానే అలా జరిగిపోతుందని బాధపడుతుంది. ఓ రాత్రి కైలాసం అడవుల నుండి వెళ్తున్న పార్వతిని శంకరుడు అనుసరిస్తాడు. ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి, పాతిపెట్టిన శవాలను తవ్వి, తీసి తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఉగ్ర రూపంలోని పార్వతిదేవిని ఆపడానికి శివుడు అడవి దారిలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. పార్వతి ఆ గొయ్యిలో పడిపోయి, తను చేసినదానికి పశ్చాత్తాపం పడుతుంది. ఇక మీదట ఇలాంటివాటికి దూరంగా ఉంటానని, ఉగ్రరూపాన్ని వదిలి పార్వతిదేవిగా శివుడికి వెంట వెళ్తుంది. అలా పార్వతి దేవి విడచిన శక్తి అవతారమే కాటేరమ్మగా చెబుతారు.
ద్రవిడ సంస్కృతి నుండి అవతరించిన శ్రీ కాటేరీ దేవత హిందూ దేవతగా మారింది. దుష్ట సంహారం చేస్తూ, తనను విశ్వాసించిన వాళ్లకు తోడుగా ఉండే దేవత కాటేరమ్మ. సౌత్ ఇండియాలో, ప్రధానంగా కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, అక్కడి ఆలయాల్లో కొలువై, నిత్యం పూజలు అందుకుంటోంది. కాటేరమ్మను పార్వతిమాత ఇంకో రూపంగా భావిస్తారు. కలియుగంలో జబ్బులను నయం చేయడానికి వెలిసిన దేవతగా పూజలు అందుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో గ్రామానికి కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా ఎన్నో తరాల నుండి కొలుస్తున్నారు.












భరత్ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో హీరోగా, సైడ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 2020 లో మలయాళంలో విజయం సాధించిన లవ్ మూవీని అదే టైటిల్ తో భరత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో వాణిభోజన్ హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8 నుండి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అజయ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి వద్దని దివ్య తండ్రి వద్దని ఎంతగా చెప్పినా వినకుండా అజయ్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన సంవత్సరంలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. అజయ్ చేస్తున్న బిజినెస్‌లో నష్టాలు రావడంతో, మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో దివ్య గర్భవతి అని తెలుస్తుంది. చెకప్ కోసం దివ్య హాస్పటల్ కి వెళుతుంది.
అజయ్ ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. దివ్య కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో దివ్య అతని పై సీరియస్ అవుతుంది. అతనిలో మార్పు రాదని శాశ్వతంగా అతని నుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. అజయ్ ఎంతగా కన్వీన్స్ చేసినా దివ్య అతని మాట వినదు. దాంతో కోపం వచ్చిన అజయ్ దివ్యను నెట్టేస్తాడు. ఆమెకు దెబ్బ బలంగా తగలడంతో అక్కడిక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అజయ్ లైఫ్ లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, సలోని బాత్రా, సురేష్ ఒబెరాయ్, తృప్తీ డిమ్రీ, శక్తి కపూర్ వంటివారు కీలక పాత్రలలో నటించారు. యానిమల్ విజయంతో సందీప్ వంగా పై ప్రశంసలు కురిసాయి. ఇక ఈ మూవీ పై వచ్చిన విమర్శలన్ని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో వెనక్కి వెళ్లాయి. అయితే విమర్శలు వచ్చిన కొన్ని అంశాల గురించి తాజాగా సందీప్ వంగా స్పందించాడు.
ఈ మూవీలో చూపించిన రణబీర్ కపూర్, రష్మికల కులాంతర వివాహం కావాలని పెట్టింది కాదని వంగా చెప్పారు. రణబీర్, రష్మికలు ఫ్యామిలీ మెంబర్స్ ముందే లిప్ లాక్ గురించి అడుగాగ, “రాక్ మ్యూజిక్ లో ఒక నిర్లక్ష్యం ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో రాక్ ప్లే అవుతుండడంతో తమ ఆవేశాన్ని బయటపెడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో కాస్త నిర్లక్ష్యం కూడా ఉంది” అన్నారు.
ఇక బాబీ డియోల్ ను ముస్లింగా చూపించడం పైన సందీప్ వంగా స్పందించారు. ”ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి ఎక్కువ మంది మారడం చూస్తున్నాం. కానీ హిందూ మతంలోకి ఎవరూ మారడం చూడలేదు. అందువల్ల దీన్ని వాడాలని భావించాను. ఇస్లాంలో ఒకరి కన్నా ఎక్కువమంది భార్యలు ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఒకరి కన్నా ఎక్కువ దాయాది క్యారెక్టర్లకు ఛాన్స్ ఉంది. డ్రామా కూడా పెద్దగా ఉంటుంది. ఆ కారణం వల్లే తప్ప ముస్లింను చెడుగా చూపించాలని భావించలేదు” అంటూ సందీప్ వంగా చెప్పుకొచ్చారు.