మనకి విద్యని అందించే గురువు దేవుడితో సమానం అని అంటారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని అన్నారు. తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఒక గురువు తన శిష్యుల బాగు కోసమే ఎప్పుడు తాపత్రయపడతారు. అలాంటి గురువుకి సంబంధించిన కథే ‘నీతోనే నేను’. టీచర్‌గా పని చేసి ఇప్పుడు మంచి స్టేజ్‌కు చేరుకున్న నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి తను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘటనలను బేస్ చేసుకుని ఈ మూవీ కథను తయారు చేశారు.
తానే నిర్మాతగా మారి శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ని అంజి రామ్ దర్శకత్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. సినిమా బండి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వికాష్ వశిష్ట ఈ సినిమాలో కథానాయకుడిగా నటించారు. కుషిత కళ్లపు, మోక్ష కథానాయకులుగా అలరించారు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మేకర్స్ ఏం సందేశం ఇచ్చారు?. ‘నీతోనే నేను’ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనా, లవ్ స్టోరీనా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం….

కథ:
రామ్ (వికాస్ వశిష్ట) ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలను నిర్వహిస్తుంటాడు. స్కూల్‌కి వచ్చామా? మన పని మనం చూసుకున్నామా? వెళ్లామా? అనే ఆలోచనతో కాకుండా తన స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని బలంగా కోరుకుంటాడు. మంచి చేయాలని తాపత్రయపడే తనను చూసి కొందరు ఉపాధ్యాయులు ఈర్ష్య పడుతుంటారు. కొందరు ఇష్టపడుతుంటారు. అలా రామ్‌ను ఇష్టపడుతుంది ఆయేషా (కుషిత కళ్లపు).

ఆమె అదే స్కూల్లో పీటీ టీచర్‌గా పని చేస్తుంటుంది. క్రమంగా ఆయేషాకు రామ్‌పై ఏర్పడ్డ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఓ రోజు ఆయేషా తన మనసులోని మాటలను రామ్‌కు చెబుతుంది. అయితే తనకు పెళ్లైందని, చిన్ననాటి స్నేహితురాలే సీత (మోక్ష)ని పెళ్లి చేసుకున్నట్లు రామ్ చెబుతాడు. ఓ రోజు రామ్, సీతలను పలకరిద్దామని వారింటికి వెళుతుంది ఆయేషా. అయితే ఆమెకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకు రామ్ గురించి ఆయేషాకు తెలిసే నిజం ఏంటి? రామ్ జీవితంలో ఉన్న సమస్య ఏంటి? సీతకు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి? తన స్కూల్లోని పిల్లల కోసం రామ్ చేసే పనేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ:
చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే పిల్లలకు చాలా సరైన వసతులు ఉండవు. కానీ వాళ్లకి మంచి సదుపాయాలను ఏర్పాటు చేస్తే వాళ్లు కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్లలకు ధీటుగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అనే విషయాన్ని దర్శకుడు అంజిరామ్ తెరకెక్కించిన తీరు బావుంది. ఓ వైపు మెసేజ్‌తో పాటు మంచి లవ్ స్టోరీని మిక్స్ చేసి తెరకెక్కించారు. కథను స్కూల్ బ్యాక్ డ్రాప్లో తీసుకెళుతూ ఇంటర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మధ్య ఇచ్చే ట్విస్ట్ బావుంది.

అయితే ఫస్టాఫ్‌ను కాస్త సాగదీతగా చేసినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఈ ట్విస్టులను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. కాకపోతే కథ మధ్యలో కమర్షియల్ సాంగ్ పెట్టటం కాస్త పక్కకెళ్లారేమో అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్ విజువల్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అందించిన పాటలు బావున్నాయి. నిర్మాత సుధాకర్ రెడ్డి తన పరిధి మేరకు మంచి కమర్షియల్ అంశాలతో సినిమాను రూపొందించారు.

నటీనటుల విషయానికి వస్తే సినిమా బండితో మెప్పించిన వికాస్ వశిష్ట ఓ వైపు గవర్నమెంట్ టీచర్‌గా, మరో వైపు భార్య కోసం పరితపించే పాత్రలో చక్కగా నటించారు. కుషిత కళ్లపు లుక్ పరంగా చక్కగా ఉంది. ఎమోషనల్ పాత్రలో మోక్ష మెప్పించింది. కన్నింగ్ టీచర్ పాత్రలో ఆకెళ్ల నటన ఆకట్టుకుంది. మొత్తంగా ఒక గవర్నమెంట్ టీచర్, తనకు వ్యక్తిగత జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో చూపించింది నీతోనే నేను

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
టోవినో థామస్-ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మాయానది 2017లో మలయాళంలో రిలీజ్ అయిన డిఫరెంట్ ప్రేమ కథ. మొదటి షోతో యావరేజ్ టాక్ తెచ్చుకొంది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టోవినో థామస్ ఉత్తమ నటుడు, ఉత్తమ క్రిటిక్స్ అవార్డ్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మాధవ్ (టోవినో థామస్) తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. మాధవ్ డబ్బు కోసం తప్పుడు దారిలో నడుస్తుంటాడు. అయితే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కలిసిన అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన వారు విడిపోతారు. మాధవ్ కొన్ని రోజుల తరువాత ఒక మాఫియా డీలింగ్ సమయంలో అనుకోకుండా పోలీస్ అధికారిని చంపి, అక్కడి నుండి పారిపోతాడు.
ఇక ఆ రోజు నుండి పోలీసులు మాధవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో మాధవ్ తన వద్ద ఉన్న డాలర్స్ ను ఇండియన్ కరెన్సీ లోకి మార్చి, దుబాయ్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. అయితే తనతో పాటుగా తాను ప్రేమించిన అపర్ణను దుబాయ్ తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే అపర్ణ అప్పటికే అతన్ని మర్చిపోయి, హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయత్నిస్తుంటుంది. తనను వెతుకుతున్న పోలీసుల నుండి తప్పించుకుని, మాధవ్ ఎలా అపర్ణను దుబాయ్ తీసుకువెళ్లాడు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
‘యాత్ర 2’ సినిమా నుంచి తాజాగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ ల క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ గా కోలీవుడ్ హీరో జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇద్దరు ఇన్టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సీక్వెల్‌కు శపథం అనే పేరు ఖరారు చేస్తూ, ఒకే పోస్టర్ లో వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ సినిమాలలో జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో అజ్మల్ నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రెండు సినిమాలలో జగన్ పాత్రలలో నటిస్తున్న ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు ఒక మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా పేరు రంగం. ఈ సినిమాకి కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. జీవా, అజ్మల్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు.
ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్, అనిరుధ్ నామా, దేవాన్ష్ నామా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఒక గ్రామంలో శాంతమ్మ(అనసూయ) తన భర్త నాగరాజు(రవివర్మ), పిల్లలు రామ్ (దేవాన్ష్ నామా) లక్ష్మణ్ అలియాస్ లచ్చు (అనిరుథ్ నామా)లతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటుంది. అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. తన కోరికను తండ్రికి చెబితే, నాగరాజు పంట చేతికివచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెప్తాడు. కానీ కొన్నిరోజులకే అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ, పిల్లలను పోషించుకుంటుంది.
ఇంకో గ్రామంలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)తో కలిసి కిరాణా కొట్టు నడుపుతూ జీవిస్తుంటారు. మణి ఆ గ్రామ సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు తమ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు. ఈ క్రమంలో ఈ జంట ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? విమానం ఎక్కాలనే కోరికతో శాంతమ్మ పిల్లలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.






రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్‌కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
రోజా అసలు పేరు శ్రీ లతారెడ్డి. 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నవంబర్ 17న జన్మించారు. ఆ తరువాత కాలంలో వారి కుటుంబం హైదరాబాద్ కు వచ్చారు. రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు. ఆమె ఇండస్ట్రీలో రాకముందు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
రోజా 1991 లో ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సర్పయాగం మూవీలో నటించింది. 1992 లో ఆర్ కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమెకు వరుస సినిమాలలో నటించి, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతిబాబు, వినోద్ కుమర్, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. రజినికాంత్, శరత్ కుమార్, సత్యరాజ్, విజయ్ కాంత్, అర్జున్ సర్జా, మమ్ముట్టి, ప్రభుదేవా వంటి వారితో నటించి మెప్పించింది. 1991 నుండి 2002 వరకు హీరోయిన్ గా నటించింది. 2002 లో ఆగస్ట్ 21న కోలీవుడ్ దర్శకుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజా, సెల్వమణి వెడ్డింగ్ ఫోటోలను మీరు చూసేయండి..
2.

