బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్స్ ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్నా ఈ టాక్ షో మూడవ సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఈ టాక్ షో కి సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు వచ్చి హడావిడి చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ టాక్ షోలో ముందు జరిగిన రెండు సీజన్స్ ను సీజన్ 1, సీజన్ టు అని పిలువగా ముచ్చటగా వచ్చే మూడవ సీజన్ ని మాత్రం లిమిటెడ్ ఎడిషన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ కొత్త సీజన్ సరికొత్త ఎపిసోడ్లు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ హాజరయ్యే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలామంది అది నిజమని నమ్మారు కూడా. మన మిమర్స్ అయితే ఈ విషయం పై చాలా ఎక్సయిట్ అవ్వడమే కాకుండా తమకు తోచిన మిమ్స్ కూడా చేశారు.
బాలకృష్ణ ,చిరంజీవి కలిసి ఎపిసోడ్ చేస్తున్నారు అంటే ఆ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఫాన్స్ ఎగ్జాయిటింగ్ గా ఎదురు చూశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో కలిసి బాలయ్య చేసిన ఎపిసోడ్ కంటే కూడా ఇది పవర్ ప్యాకెట్ గా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే చివరికి మెగాస్టార్ ఈ ఎపిసోడ్ కి రావడం లేదు అని ఆహా టీం స్పష్టం చేసింది. దసరా కంటే ముందే వచ్చే మొదటి ఎపిసోడ్ లో బాలయ్య తో పాటు భగవంత్ కేసరి టీం వచ్చే అవకాశం ఉందని చూచాయిగా ఆహా టీం హింట్ ఇచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి,కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్…వీళ్ళు అందరూ లేక వీరిలో కొందరు అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో కనిపించే అవకాశం ఉంది.












విజయ్ దళపతి, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
ఇక ట్రైలర్ చూసిన తరువాత ఈ మూవీ హాలివుడ్ మూవీ రీమేక్ అని కొందరు, లేదు తెలుగు మూవీకి రీమేక్ అని మరికొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీకి 13 కట్స్ చెప్పినట్టుగా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ తో స్పష్టత వచ్చింది. అందులో ఒకొక్క కట్ లో కొన్ని పదాలను మరియు కొన్ని సీన్లను కూడా ప్రస్తావించారు. సెన్సార్ మెంబర్స్ సూచనల మేరకు మొత్తం 47 సెకన్ల నిడివిని తగ్గించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
స్రవంతి చొక్కారపు యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. జెమినిలో కొన్ని రోజులు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ మూవీ విడుదల సమయంలో పుష్ప యూనిట్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత మల్లెమాల సంస్థ షోస్ లో స్రవంతి సందడి చేసింది. దీనివల్ల ఆమెకు ‘బిగ్ బాస్’ లో పాల్గొనే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అఖిల్, అజయ్ లతో ఉంటూ వార్తల్లో నిలిచేది. స్రవంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఆమెకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖలో షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వీటిని చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజెన్ మాత్రం “నీ వయసుకి మరియు నువ్వు వేసే వేషాలకి ఏమైనా సంబంధం ఉందా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తికి స్రవంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తరువాత ఆ వ్యక్తి తన కామెంట్లను డిలీట్ చేశాడు. దానికి కూడా స్రవంతి “ఏంట్రా నాన్న భయమేసిందా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేశావు” అంటూ కామెంట్ చేసింది.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో రామ్ కార్తిక్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, సాయికుమార్ బబ్లూ వంటివారు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అనాధ అయిన హేమంత్ (రామ్ కార్తీక్) తన స్నేహితుడితో కలిసి ఒక కాఫీ షాప్ ని నడిపిస్తుంటాడు. ఆ షాప్ కి చైత్ర (హెబ్బా పటేల్) తరచు కూకీస్ తీసుకువస్తుంది. ఈ క్రమంలో హేమంత్ చైత్రను ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని చైత్రకు చెప్తాడు.
అయితే ఆమె హేమంత్ లవ్ ని రిజెక్ట్ చేస్తుంది. దాంతో హేమంత్ ఆమె జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఆ ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో హేమంత్ ను తనుకూడా ప్రేమిస్తున్నట్టుగా చైత్ర చెప్తుంది. కానీ తాను అతన్ని పెళ్లి చేసుకోలేనని, ఎందుకంటే త్వరలో తాను, తన కుటుంబం అంతా ఒకేసారి ఆ-త్మ-హ-త్య చేసుకోబోతున్నామని చెప్తుంది. విషయం విని హేమంత్ షాక్ అవుతాడు. చైత్ర మరియు ఆమె కుటుంబం మొత్తం ఎందుకు సూ-సై-డ్ చేసుకోవాలని అనుకున్నారు? చైత్ర చెప్పింది విన్న హేమంత్ ఏం చేసాడు? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన స్టోరీ.
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ ను తెరపై చూపించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. హెబ్బా పటేల్ చైత్ర పాత్రకు న్యాయం చేసింది. హీరోగా నటించిన రామ్ కార్తిక్ తన పరిధి మేరకు నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ మూవీని చూడవచ్చు.









విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ. గతనేల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక విజయ్ దేవరకొండ, సమంత చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ కు వచ్చాయి.
ఇటీవలే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఒక ఓటీటీలో పలుమార్లు చూసిన నెటిజెన్లు ఆ మూవీలోనీ పొరపాట్లను గమనించి సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానిని చూసిన నెటిజెన్లు కామెంట్లు పెట్టడం ఇటీవల కాలంలో సాధారణం అయ్యింది. వీటిలో కొన్ని వైరల్ గాను మారుతున్నాయి.
ప్రస్తుతం ఖుషీలో కూడా ఇలాంటి మిస్టేక్ ను గమనించిన ఒక యూజర్, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ బైక్ నడుపుతుండగా సమంత వెనకాల కుర్చుని ఉన్నారు. విజయ్ దేవరకొండ తమను వెంబడిస్తున్న బైక్ ఎడమ వైపు పట్టుకుని పైకి లేపాడు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, బైక్ కి లెఫ్ట్ సైడ్ కూడా యాక్సిలరేటర్ ఉంటాయా అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపకపోవడంతో సామాజిక మధ్యమాలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడిపి కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడిపి అభిమాని ఒకరు ఎన్టీఆర్ కు స్వయంగా కాల్ చేసి, ఎన్టీఆర్ చిత్రాల గురించి వార్నింగ్ ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చంద్రబాబుకు మద్దతు తెలపకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆడనివ్వము అని గట్టిగా హెచ్చరించారట. వచ్చే ఎలెక్షన్స్ లో టీడిపి అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆడనివ్వము అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం కౌంటర్ ఇచ్చారని సమాచారం. చంద్రబాబు అరెస్టు కావడంతో నెట్టింట్లో అభిమానుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది.
అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో స్పందించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.