వరుస సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. సినిమా టాక్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : రూల్స్ రంజన్
- నటీనటులు : కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్, నేహా శెట్టి.
- నిర్మాత : దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
- దర్శకత్వం : రతినం కృష్ణ
- సంగీతం : అమ్రీష్
- విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

స్టోరీ :
మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. యావరేజ్ స్టూడెంట్ అయిన మనోరంజన్, ఎంతో కష్టపడి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదిస్తాడు. ఉద్యోగం కోసం ముంబైకి వెళ్తాడు. ముందు హిందీ రాకపోయినా తర్వాత నేర్చుకొని టీం లీడర్ గా ఎదుగుతాడు. తర్వాత నుండి ఆఫీస్ లో రూల్స్ పెట్టడం మొదలు పెడతాడు. అందుకే అతనికి రూల్స్ రంజన్ అని పేరు వస్తుంది. అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల మనోరంజన్ తన కాలేజ్ స్నేహితురాలు అయిన సన (నేహా శెట్టి) ని కలుస్తాడు.

మనోరంజన్ సనని ఎప్పుడో కాలేజ్ లో చదువుకునేటప్పుడే ప్రేమించినా కూడా భయంతో ఈ విషయాన్ని బయట పెట్టడు. తర్వాత ఇప్పుడు కలిసినప్పుడు ఈ విషయాన్ని సనతో చెప్తాడు. సన కూడా మనోరంజన్ ప్రేమని అంగీకరిస్తుంది. తర్వాత మళ్లీ సన దూరం అయిపోతుంది. అప్పుడు మనోరంజన్ ఏం చేశాడు? మనోరంజన్ ని ప్రేమించిన సన మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ పెళ్లిని మనోరంజన్ ఎలా ఆపాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కిరణ్ అబ్బవరం. అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే తన నెక్స్ట్ సినిమా ప్రకటించేస్తున్నారు. అంత ఫాస్ట్ గా ఉన్నారు. ఈ రూల్స్ రంజన్ అనే సినిమా ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా ముందే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇవాళ రిలీజ్ అయ్యింది.

సినిమా కథ విషయానికి వస్తే చాలా బలహీనంగా ఉంది. దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు? అసలు ఏం చెప్పాడు? ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు. సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది అసలు కన్ఫ్యూజన్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే, సినిమా ఎప్పుడు అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కామెడీ ట్రై చేశారు. ఒకటి రెండు చోట్ల తప్ప అది కూడా పెద్దగా పేలలేదు.

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా ఎలా ఉన్నా కూడా కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి తనని తాను మార్చుకునే విధానం మాత్రం బాగుంటుంది. ఈ సినిమాలో ముందు సినిమాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉన్న పాత్ర పోషించారు. తన పాత్ర వరకు తను బానే చేశారు. నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర అయితే కాదు.

పాటలు కూడా గుర్తు పెట్టుకునే అంత గొప్పగా ఏమీ లేవు. శ్రేయ ఘోషల్ పాడిన సమ్మోహనుడా పాట తప్ప మిగిలినవి ఏమి గుర్తు ఉండవు. పాటలనే కాదు, అసలు సినిమా మొత్తం కూడా ఈ పాట తప్ప వేరే ఏది గుర్తుండదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. లవ్ ట్రాక్ కూడా బాగాలేదు అని చెప్పలేము. అలా అని బాగుంది అని కూడా అనలేము. కానీ మరి తీసి పడేసే అంతగా ఏమీ లేదు. కానీ సినిమాకి అది పెద్దగా హెల్ప్ కూడా అవ్వలేదు.
ప్లస్ పాయింట్స్ :
- లవ్ ట్రాక్
- నేహా శెట్టి
- కొన్ని కామెడీ సీన్స్
- సమ్మోహనుడా పాట
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ఫ్లాట్ గా ఉన్న స్క్రీన్ ప్లే
- సహనానికి పరీక్ష పెట్టే సీన్స్
- చిత్రీకరించిన విధానం
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అని తాపత్రయ పడుతున్న నటుల్లో ఒకరు. ఈ సినిమాకి కూడా అలాగే కొత్తగా కనిపించడానికి ప్రయత్నించారు. తన ప్రయత్నం వరకు బాగానే ఉన్నా కూడా బలహీనమైన కథనం వల్ల రూల్స్ రంజన్ సినిమా పెద్దగా అలరించని సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : అదే కాన్సెప్ట్ తో వచ్చిన మన తెలుగు మూవీని ఫ్లాప్ చేసి… ఆ డబ్బింగ్ మూవీని మాత్రం సూపర్ హిట్ చేశారా..?













#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


ఉత్తర్ప్రదేశ్ కేడర్ 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ నటన మీద ఉన్న ఇష్టంతో సంచలన నిర్ణయం తీసుకుని, ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అభిషేక్ సింగ్కు యాక్టింగ్, మోడలింగ్ అంటే చాలా ఆసక్తి ఉండడంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమైనహోదాలో కొనసాగారు. మరో వైపు తనకు ఇష్టం అయిన నటన, మోడలింగ్ రంగాలలో రాణించారు.
అభిషేక్ సింగ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్- 2’ లో ఇన్వెస్టిగేషన్ అధికారి క్యారెక్టర్ లో నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలలో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటూ, మోడల్ గా ఆకట్టుకుంటున్నారు. అభిషేక్ సింగ్ మొదటిసారి నటించిన షాట్ ఫిలిం ‘చార్ పండ్రా’. దీనిని టీ సిరీస్ సంస్థ రూపొందించింది.
ఈ సాంగ్ లో అభిషేక్ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, మెప్పించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఒక యాక్టర్ గా అద్భుత నటనను కనబరిచినందుకు ఆడియెన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 రోజులకే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పటి వరకు ఆ సాంగ్ కు యూట్యూబ్ లో 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిషేక్ సింగ్ కు ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు. కొరటాల ఈ మూవీ కోసం ధర్మస్థలి అనే కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు.
ఈ మూవీ 2022 మే 20న భారీ అంచనాల మధ్య, గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షోతోనే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెటిజెన్లు ఈ మూవీని, దర్శకుడు కొరటాల శివను విపరీతంగా ట్రోల్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే మైనస్ అనే టాక్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో చిరంజీవి ఆచార్య అనే నక్సల్ నాయకుడుగా నటించాడు. ఆచార్య కార్పెంటర్ వేషంలో ధర్మస్థలికి వస్తాడు. అయితే అక్కడికి ఎళ్లిన తరువాత కొందరు గుడి ముందు తాగుతూ ఉంటే, హీరో గుడి ముందు ఇలాంటివి చెయ్యడం తప్పు అని చెబుతాడు. ఆ ఊరు అంతా గుడిలో పూజలు చేస్తారు. అయితే ఆ తరువాత నిమిషంలో హీరోనే సానా కష్టం వచ్చిందే అని ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తాడు. మరి హీరో చెప్పిన రూల్స్ ను ఆయనే పాటించరా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.


కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి ‘ఛార్లీ’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ చేరువయ్యాడు. అంతకుముందు అతడే శ్రీమన్నారాయణ మూవీతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్స్ సాధించి, లాభాలను అందించాయి. సప్త సాగరదాచే ఎల్లో మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగులో మొదటి రోజు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే దాదాపు ఇదే స్టోరీ లైన్ తో రిలీజ్ అయిన మాస్ మహారాజ రవితేజ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్ తొలి సారి దర్శకత్వం వహించిన షాక్ మూవీలో రవితేజ, జ్యోతిక జంటగా నటించారు.
ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కూడా హీరో జైలుకి వెళ్తాడు. నెట్టింట్లో అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ సినిమాని మాత్రం సూపర్ హిట్ చేసారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తమిళ సినిమా “కా పే రణసింగం”. ఈ మూవీని దర్శకుడు పి.విరుమాండి తెరకెక్కించారు. ఈ మూవీ కోలీవుడ్ లో 2020లో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. అక్కడ విజయం సాధించడంతో ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ టైటిల్ తో తెలుగులో డబ్ చేసి, 2020లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ5 లో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న గ్రామంలో నివసించే రణసింగం(విజయ్ సేతుపతి) కి విప్లవ భావాలు అధికంగా ఉంటాయి. గ్రామంలో ఏలాంటి సమస్య వచ్చినా కూడా రణసింగం ముందుండి పోరాడుతాడు. అతని మంచితనం నచ్చడంతో సీత (ఐశ్యర్వ రాజేష్) ప్రేమిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారికి పాప పుట్టిన తర్వాత రణసింగం దుబాయ్ కి జాబ్ కోసం వెళ్తాడు.
అయితే అక్కడ రణసింగం పనిచేసే ఫ్యాక్టరీలో జరిగిన గొడవల కారణంగా రణసింగం మరణించాడని చెప్తారు. రణసింగం మృతదేహాన్ని ఇండియాకి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత సీత ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. నటన విషయానికి వస్తే విజయ్ సేతుపతి కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే రణసింగం పాత్రలో ఒదిగిపోయాడు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర ఐశ్యర్వ రాజేష్ ది. ఆమె అద్భుతంగా నటించింది.
ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ 7/జి బృందావన్ కాలనీ. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. రెండు చోట్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ లో కూడా ఈ మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా ఈ మూవీలో ఒక సీన్ కు సంబంధించిన తెలుగు మరియు తమిళం వీడియోలను ఒక యూజర్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ, వీటిలో ఏ వర్షెన్ నచ్చింది అంటూ అడిగారు. తమిళ్ సీన్ లో తండ్రి హీరోతో ఎమోషనల్ గా చెప్తాడు. అయితే తెలుగు సీన్ లో తండ్రి ఫ్రస్టేషన్ తో చెప్తాడు. ఈ రెండింటిలో తెలుగులోనే తండ్రిగా సహజంగా నటించారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి పాత్రలో చంద్ర మోహన్ చాలా సహజంగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.