బుల్లితెర సీరియల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఏ ప్రోగ్రామ్ కు లేని ఆదరణ సీరియల్స్ కు ఉంటుందని చెప్పవచ్చు. సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలలో నటించేవారికి, గుర్తింపు, క్రేజ్ ఎక్కువే. ఒకప్పుడు సీరియల్స్ చూసినవారికి మాత్రమే వారి గురించి తెలిసేది.
సోషల్ మీడియా కారణంగా సీరియల్స్ లో నటించే నటీనటులు మరింత గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. సీరియల్ నటి మేఘనా లోకేష్ కు బుల్లితెర పై మంచి గుర్తింపు ఉంది. తాజాగా మేఘనా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేసింది. ఏమైందా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు సీరియల్స్‌లో ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత కన్నడ నటీనటులకు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. వారికి తెలుగులో నటిస్తే ఎక్కువగా గుర్తింపు, పాపులారిటీ లభిస్తుండడంతో కన్నడ నటీనటులు తెలుగు సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చిన కన్నడ నటి మేఘనా లోకేష్.
శశిరేఖ పరిణయం సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది. శశి పాత్రలో నటించిన మేఘనా లోకేష్ అందం, నటన అప్పట్లో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. ఆ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ప్రస్తుతం మేఘనా పలు సీరియల్స్ లో నటిస్తూనే, జీ తెలుగుఛానెల్ ఈవెంట్లు మరియు షోలలో కూడా సందడి చేస్తోంది. బుల్లితెరపై మేఘనాకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె హీరోయిన్‌గానూ నటించిది. కానీ విజయం సాధించలేదు.
మేఘనా లోకేష్ తాజాగా ఇన్ స్టా స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో మళ్లీ ఈరోజు నాకు చెడు రోజు. ఈ సంవత్సరం నన్ను ఇలా ఎందుకు బాధపెడుతోంది. ఏం అయ్యిందో అని అందరూ ఎక్కువగా ఆలోచించకండి. ప్రస్తుతం ఆ విషయాలను షేర్ చేసుకోలేను. మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇలాంటివి ఈ సంవత్సరం చాలా జరిగాయి. మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందని రాసుకొచ్చారు. అయితే ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. దీంతో ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
Also Read: హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే..?

టాలీవుడ్ నుండి కోలీవుడ్ వెళ్ళిన సిద్ధార్థ్ రెండేళ్ల కిందట ‘మహా సముద్రం’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత ‘టక్కర్’ అనే మూవీటో వచ్చారు. అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు సిద్ధార్థ్ కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి, అందరి చేత ప్రశంసలు పొందుతున్న సిద్ధార్థ్ సినిమాని తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. కోలీవుడ్ లో తెరకెక్కిన చిత్త మూవీని ఎటాకి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా, సిద్ధార్థ్ సమర్పించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలలో నటించారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈశ్వరన్ (సిద్ధార్థ్) అన్న చనిపోవడంతో అతని జాబ్ ఈశ్వరన్ కు వస్తుంది. అన్న కూతురిని ఈశ్వరన్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తినడం, స్కూల్ కి తీసుకెళ్లడం దగ్గర నుండి పడుకునే వరకు అన్ని పనులు తనే చేస్తూ ఉంటాడు. అయితే ఆ పాపకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఎవరో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అప్పటినుండి ఆ పాప అదోలా మారిపోతుంది.
అది ఏమిటో తెలుసుకుందామని ఈశ్వరన్ ప్రయత్నిస్తే, ఆ పాపని అతనే ఏదో చేసాడనుకుని అందరూ ఈశ్వరన్ కొడుతారు. అయితే ఈశ్వరన్ ఏ తప్పు చేయలేదని తెలుసుకునే లోపు, ఈశ్వరన్ అన్న కూతురిని ఎవరో ఎత్తుకెళ్తారు. ఆ తరువాత ఏం జరిగింది? ఈశ్వరన్ తన అన్నకూతురిని ఎలా రక్షించాడు? అతను ఏ తప్పు చేయలేదనే విషయం తెలిసిందా? అనేది మిగిలిన కథ.
ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఖుష్బూ. కోలీవుడ్ లో ఏకంగా ఆమెకు అభిమానులు గుడినే కట్టారు. నార్త్ లో పుట్టి, పెరిగిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మరో వైపు రాజకీయాలలో రాణిస్తూ, తమిళనాడు పాలిటిక్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే ఒక నటిగా, ప్రొడ్యూసర్ గా, రాజకీయ నాయకురాలుగా రాణిస్తున్న కుష్బూ రీసెంట్ గా అరుదైన గౌరవం పొందింది.
కేరళ త్రిస్సూర్ లో విష్ణు మాయ దేవాలయంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది చేసే నారీ పూజలో కూర్చునే అవకాశం సీనియర్ నటి కుష్బూకి దక్కింది. కుష్బూని ఆలయకమిటీ ఆహ్వానించగా, కుష్బూ నారీ పూజకు హాజరైంది. ఆలయంలో ఒక పీఠం పై కుష్బూని కూర్చోపెట్టి పూజారులందరు పూజలు చేశారు. ఆ తరువాత కుష్బూకు నైవేద్యాలు ఇచ్చి, దీవించారు. కుష్బూ పూజకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో “దేవుని ఆశీర్వాదలు అందుకున్నాను.
త్రిస్సూర్‌లోని విష్ణుమాయ దేవాలయం నారీపూజ కోసం ఆహ్వానించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.నారీపూజ కోసం ఎంపికైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. దైవమే స్వయంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటుందని వారు నమ్ముతారు. నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు, ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రార్థించేవారికి, తమను రక్షించే సూపర్ పవర్ ఉందని నమ్మే వారందరికి, ఈ పూజ మంచిని తెస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”. అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఐఎండీబీ ప్రకారం ప్రభాస్ బెస్ట్ సినిమాలు:
2. . బాహుబలి: ది బిగినింగ్:
3. చత్రపతి:
4. డార్లింగ్:
5. మిర్చి:
2. ఈశ్వర్:
3. సాహో:
4. మున్నా:
5. పౌర్ణమి:
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.ఐఎండీబీ ప్రకారం 5.8 రేటింగ్‌ను పొందింది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. రిలీజ్ కు రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ ఈ మూవీ గురించి ఇప్పటి నుండే చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సలార్, షారుక్ ఖాన్ డుంకీ సినిమాల మధ్య క్లాష్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అభిమానుల మధ్య అప్పుడే ట్రోలింగ్ వార్ మొదలైంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళా అభిమాని ప్రభాస్ చెంప పై కొట్టినట్టుగా కనిపిస్తోంది.
వీడియోలో ప్రభాస్‌ను చూసి సెల్ఫీ దిగడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్న మహిళా అభిమాని ప్రభాస్ తో సెల్ఫీ తీసుకున్న తరువాత ప్రభాస్ ముఖం పై ఆ అభిమాని అత్యుత్సాహంతో టచ్ చేసింది, కొట్టలేదు. ఈ వీడియో నిజానికి 2019లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుణ్ణం గంగరాజు రూపొందించిన అమృతం సీరియల్ కు డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ జెమిని టీవిలో 2001లో నవంబర్ 18న మొదలైంది. 2007 నవంబర్ 18 వరకు 313 ఎపిసోడ్లలో 6 సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రసారం చేయబడింది. అప్పట్లో సండే వచ్చిందంటే, రాత్రి టెలివిజన్ లో అమృతం సీరియల్ అలరించేది. ఇంటిల్లిపాది కూర్చుని, అమృతం చూసేవారు.
సీరియల్ సాంగ్ తో మొదలయిన నవ్వులు ఆంజనేయులు (గుండుహనుమంతరావు) ఆలోచనలు, అమృత రావు అమాయకత్వం, ఇంటి ఓనర్ అప్పాజీ వేసే పెనాల్టీలు, సర్వం, ఇలా ప్రతిదీ ఆడియెన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేది. అయితే తాజాగా ఆంజనేయులు పద్దుతో చెప్పిన ఒక డైలాగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా గురించే అప్పుడే చెప్పారు అన్నట్టుగా ఈ వీడియో సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇటీవల రిలీజ్ అయిన భోళా శంకర్ మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు విజయం సాధించలేదు. ఈ మూవీ పై నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మెహర్ రమేష్ ను నమ్మి మూవీలో నటించాడనే టాక్ ఉంది. అదే విషయాన్ని అప్పట్లో ప్రసారం అయిన అమృతంలో ఆంజనేయులు చెప్పినట్టుగా షేర్ చేశారు. ఆ వీడియోలో ‘ఆ బాస్ ఎప్పుడు అంతే ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తాడు భోళా శంకరుడు’ అని ఆంజనేయులు చెప్తాడు.
పెళ్లి దుస్తులతో రెడీ అయ్యి, వచ్చిన రిషీతో జగతి ఒక విషయం చెప్పాలని పిలుస్తుంది. ఏంటమ్మా? అని అడిగిన రిషితో ‘నా తరువాత మహేంద్రకు అన్నీ నువ్వే అవ్వాలి’ అని అంటుంది. ‘మహేంద్రకు ఎల్లప్పుడు నువ్వు తోడు ఉండాలి, ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. తోడు ఉండాల్సిన సమయంలో ఎప్పుడు తోడుగా లేను.
ఇక ఇప్పుడు ఉంటానో లేదో తెలియదు. మీ నాన్నకి మంచి భార్యను కాలేకపోయాను. కానీ నువ్వు మాత్రం గొప్ప కుమారుడిగా ఉండి, ఆయనను ఆనందంగా చూసుకో’ అని జగతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి తప్పక కుండా చూసుకుంటానమ్మా అని చెప్తాడు. ఆ తరువాత రిషి, వసుల వివాహం జరుగుతుంది.
ఇద్దరు దేవయాని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత జగతి దగ్గర ఆశీర్వాదం కోసం మోకాళ్ల మీద కూర్చుంటారు. అప్పుడు జగతి రిషీతో ‘ఇక నుండి మెషన్ ఎడ్యుకేషన్ కూడా మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని చెప్తుంది. అది విని షాక్ అయిన దేవయాని, శైలేంద్రలు కోపంతో చూస్తుంటారు. ఆ తరువాత జగతి ఇద్దరి పై అక్షింతలు వేసి, రిషి తల పై చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ, అలానే కన్ను మూస్తుంది.






