నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ తో మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎదిగి ఇప్పుడు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన నటులలో ముందు వరుసలో ఉన్నారు రవితేజ. అయితే రవితేజ ప్రొడ్యూసర్ గా కూడా మారి కొత్త వారికి అవకాశాలు ఇస్తూ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. అలా రవితేజ కార్తీక్ రత్నం హీరోగా నిర్మించిన సినిమా ఛాంగురే బంగారు రాజా. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఛాంగురే బంగారు రాజా
- నటీనటులు : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు, అజయ్, ఎస్తేర్, వాసు ఇంటూరి.
- నిర్మాత : రవితేజ
- దర్శకత్వం : సతీష్ వర్మ
- సంగీతం : కృష్ణ సౌరభ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2023

స్టోరీ :
ఒక చిన్న ఊరిలో ఉండే ఒక మెకానిక్ (కార్తీక్ రత్నం) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అనుకోకుండా అతను ఒక మర్డర్ లో ఇరుక్కుంటాడు. తన పేరుని అందులో నుండి తీసేయడానికి కష్టపడుతూ ఉంటాడు. తను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి అతను చేసే ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? చివరికి అతను నిర్దోషి అని తెలిసిందా? అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
కేరాఫ్ కంచరపాలెం, నారప్ప వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు కార్తీక్ రత్నం. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చిన్న మెకానిక్ తనని తాను ఒక నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసే ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలని కామెడీ యాడ్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకి ఈ మధ్య ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటీవల వచ్చిన బలగం సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎన్ని అవార్డులు అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఒక ఊరిలో జరిగే సినిమాగా రూపొందించారు. అక్కడ జరిగే సంఘటనలు, వారిలో ఉండే అమాయకత్వం వీటన్నిటిని దర్శకుడు తెరపై చాలా బాగా చూపించారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో అందరూ కూడా తమని తాము ఆల్రెడీ నటులుగా ప్రూవ్ చేసుకున్నవారే.

కాబట్టి వారందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. కార్తీక్ రత్నంకి మరొక మంచి పాత్ర దొరికింది. ఇందులో కార్తీక్ రత్నం చాలా సహజంగా నటించారు. అలాగే కార్తీక్ రత్నం తర్వాత సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర సత్య. ఇటీవల వచ్చిన రంగబలి సినిమాకి సత్య కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.

పాటలు పరవాలేదు. సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ కథలో మాత్రం అక్కడక్కడ కొత్తదనం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చూసే ప్రేక్షకులకు ఈ సినిమా తెలిసిపోయేలాగానే ఉంటుంది. దాంతో ఈ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- కార్తీక్ రత్నం నటన
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, ఒక మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకునే వారికి, రొటీన్ కథ అయినా పర్వాలేదు ఎంటర్టైనింగ్ గా ఉంటే చాలు అని అనుకునే వారికి ఛాంగురే బంగారు రాజా సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : MARK ANTONY REVIEW : “విశాల్, SJ సూర్య” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

పిజ్జా 3 మూవీలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు జంటగా నటించారు. మోహన్ గోవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, నలన్ (అశ్విన్ కకుమాను) ఒక ఫేమస్ రెస్టారెంట్ కు ఓనర్. అతను కయల్ (పవిత్ర) ను ప్రేమిస్తాడు. ఆమె యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటుంది. నలన్ కయల్ తో పెళ్లి గురించి ఆమె అన్నయ్య ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారితో మాట్లాడగా, అతను నలన్ అవమానిస్తాడు.
నలన్ రెస్టారెంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. నలన్ కు తెలిసిన వ్యక్తులు వరసగా చనిపోతుంటారు. వాటికి కారణం చిన్న ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. వరుస మరణాలకు, ఈ బొమ్మకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వారిని చంపడానికి కారణం ఏమిటి ? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
అశ్విన్ కకుమాను ఇప్పటికే చాలా సినిమాలలో నటించి యాక్టర్ గా సత్తాను చాటుకున్నాడు. పలు హారర్ చిత్రాలలో నటించిన అశ్విన్ ఈ మూవీలో కూడా ఆకట్టుకున్నాడు. పిజ్జా 3 రొటీన్ హారర్ రివెంజ్ మూవీ. తమిళంలోనే యావరేజ్ గా నిలిచిన మూవీని తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ ఇలాంటివి ఎన్నో చూశారు. దాంతో ఈ మూవీ చూస్తున్నప్పుడు తరువాత వచ్చే సీన్ సులభంగా ఊహించగలరు. హర్రర్ మూవీ అయినా అంతగా భయపెట్టలేదు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది.










మెగా కోడలు ఆనే ట్యాగ్ బరువైన బాధ్యతతో కూడినది అని చెప్పవచ్చు. ఆమె ఏం చేసిన మెగాఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల కాబోయే మెగా కోడలు లావణ్యాత్రిపాఠి తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా, అడుగులేస్తున్నారు. నిశ్చితార్థం తరువాత లావణ్య సినిమాలు చేయడం తగ్గించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. అయితే గతంలో ఒక స్టోరీ నచ్చడంతో ఒక వెబ్ సిరీస్ కి లావణ్య ఓకే చెప్పారట. ‘స్కైలాబ్’ మూవీ డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్ర బోల్డ్‌గా ఉంటుందని, ఇంటిమేట్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. దాంతో లావణ్య ఆ వెబ్‌సిరీస్ మేకర్స్ కి తాను ఆ పాత్ర చేయలేనని, వేరే హీరోయిన్ ను చూసుకోమని చెప్పిందంట. నిశ్చితార్థం తర్వాత మెగా ఫ్యామిలీ కోడల్ని. ఇలాంటి వాటిలో నటించడం సరి కాదని అన్నారట. ఈ క్రమంలోనే సెలెక్టివ్‌గా కొన్ని మూవీ ఆఫర్లను కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ సమక్షంలో జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి ఎక్కడ అనేది అనౌన్స్ చేయకపోయినా, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతుందని ప్రచారాలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ తరువాత హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని టాక్.
గద్వాలకు చెందిన శివ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. శివ పాడే సాంగ్స్ కొద్ది రోజులుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ట్రోల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. అతని పాటలను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలా శివ బాగా పాపులర్ అయ్యాడు. ఆ వ్యక్తిని శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటస్ట్ ఎపిసోడ్ కు తీసుకువచ్చారని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
అయితే శివతో వేదిక పైన పాట పాడించారు. అతని ప్రతిభను గుర్తించి, అవకాశం ఇచ్చారనుకోవచ్చు. కానీ శివ పాట పాడుతుంటే, ఇంద్రజ, హీరోయిన్ రేఖ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోని మిగతా వారంత పగలబడి మరి నవ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజెన్లు అతన్ని ఈ ప్రోగ్రామ్ కు తీసుకువచ్చి మరీ పరువు తీయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోను వారు మాత్రమే ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు టెలివిజన్ ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చి పరువు తీసేస్తున్నారని అంటున్నారు. పాడుతుంటే అంతగా నవ్విన ఇంద్రజ ఆ తరువాత ‘నీలో పాడగలను అనే ధైర్యం ఉంది. అందుకే ఇక్కడకు దాకా వచ్చావు, అని మాట్లాడింది. కానీ నవ్వే వారిని మాత్రం ఆపలేదని ప్రోమో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.



స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కక్షపూరితంగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని కామెంట్లు చేశారు. నందమూరి కుంటుంబం కూడా చందబాబు అరెస్ట్ ను ఖండించింది. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
పూనమ్ కౌర్ “మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుగారు ప్రజల కోసం చాలా సేవ చేశారని, వారి కొరకు అన్నీ త్యాగం చేసిన గొప్ప మనిషి అని, అలాంటి చంద్రబాబు నాయుడిని 73 ఏళ్ల వయస్సులో జైలుకు పంపించడం, బాధ పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
పూనమ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండగా, కొందరు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సటైర్స్ వేస్తున్నారు. పూనమ్ కౌర్ ఫ్యాన్స్ మాత్రం వివాదాల్లో ఇరుక్కోవద్దని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.


రజినీకాంత్ , రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ నటించిన జైలర్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళ, తెలుగు బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలను కురిపించింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న, సూపర్ స్టార్ రజినీకాంత్ కు, నెలన్స్ దిలీప్ కుమర్ కు ఈ మూవీ ఊహించని విజయాన్ని ఇచ్చింది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ కూడా రికార్డ్స్ క్రియట్ చేస్తోంది. అయితే ఓటీటీ లో పలుమార్లు ఈ మూవీని చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని మిస్టేక్స్ ను గమనించారు. వాటిని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ జైలర్ గా ఉంటాడు. ఆ సమయంలో ఒక ఖైదీ నేను ఏపీ నుండి వచ్చా, ఒక ఫోన్ కొడ్తే చాలు నీ అంతు చూస్తారని రజినీకాంత్ తో అంటాడు.
నాకు చాలా పెద్ద కాంటాక్స్ ఉన్నాయని అంటాడు. దాంతో రజినికాంత్ ఫోన్ ఇచ్చి, కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ ఖైదీ తన మనుషులకి కాల్ చేసాడు. కానీ హీరో వారి కారులో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఆ విషయం తెలిసి ఆ ఖైదీ షాక్ అవుతాడు. అయితే ఖైదీకి ఇచ్చిన ఫోన్ ని తిరిగి తీసుకోడు. మరో సీన్ లో విలన్ పంపించిన రౌడీలు రజినీకాంత్ ఫ్యామిలి పై దాడి చేయడానికి వస్తారు. అప్పుడు రజినీకాంత్ మనవడిని ఒకదగ్గర దాచిపెడతాడు. కానీ అక్కడి నుండి తీసుకొచ్చినట్టు చూపించరు. ఇలా మర్చిపోతే ఎలా రజినీకాంత్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.