రీసెంట్ గా 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ లలో ఉత్తమ తమిళ చిత్రంగా ‘కడసీ వ్యవసాయి’ అనే మూవీ ఎంపిక అయ్యింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించారు. అంతేకాకుండా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఎం.మణికందన్ తెరకెక్కించాడు. వ్యవసాయ రంగంలోని సమస్యల పై తెరకెక్కిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో తమిళంతో పాటు, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
విజయ్ సేతుపతి, నల్లంది, యోగీబాబు నటించిన కడసీ వ్యవసాయి మూవీ కథ విషయానికి వస్తే, ఇది వ్యవసాయాన్ని నమ్ముకున్న ఒక రైతు కథ. అడవికి సమీపంగా ఉన్న ఒక పల్లెటూరులో వర్షాలు లేక కరువు వస్తుంది. దాంతో రైతులు తమ భూముల్ని అమ్ముకుంటారు. కానీ మల్లయ్య(నల్లంది) అనే 85 ఏళ్ల వృద్దుడు తన తాతముత్తాతల నుంచి వస్తున్న భూమినే నమ్ముకుని జీవిస్తుంటాడు. మల్లయ్య తన భూమిని అమ్మడానికి అంగీకరించడు. అయితే ఊరిలోని కరువు తొలగిపోవడానికి గ్రామదేవతకు జాతర చేయాలని ఊరివారు నిర్ణయించుకుంటారు.
కానీ గ్రామ దేవతకు వరి పండించి, దానిని మొక్కుగా ఇవ్వాలి. మల్లయ్య పొలంలోని బావిలో మాత్రమే నీళ్లు ఉండడంతో ఊరివాళ్లందరూ మల్లయ్య పొలంలో వారి పండించాలని అతన్ని ప్రాధేయపడతారు. మల్లయ్య దానికి అంగీకరించి, తన పొలంలోనే వరి పంటను వేస్తాడు. అయితే నెమళ్లు మల్లయ్య పొలంలో చనిపోవడంతో మల్లయ్యనే వాటిని చంపాడని కేసు పెడతారు.
జైలుకు వెళ్ళిన మల్లయ్య ఆ కేసు నుండి ఎలా బయటికి వచ్చాడు? పోలీసులు వరి పంట బాధ్యతను ఎందుకు తీసుకున్నారు? మల్లయ్యను ఊరి ప్రజలు ఎలా నిర్దోషిగా నిరూపించారు? మరణించిన మామా కుమార్తెను తలచుకుంటూ జీవిస్తున్న రామయ్య (విజయ్ సేతుపతి) ఎవరు? అన్నదే మిగిలిన కథ.
విజయ్ సేతుపతి మూవీలో కనిపించేది కాసేపే అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. యోగిబాబు చిన్న అతిథి పాత్రలో మెరిశాడు. మల్లయ్యతో పాటు నటించిన ప్రధాన పాత్రలలోని వారు సహజంగా నటించి, ఆకట్టుకున్నారు. కడసీ వ్యవసాయి మంచి సందేశంతో సాగే ఫీల్‌గుడ్ సినిమా. ఓపికతో చూస్తే మంచి ఫీల్ కలుగుతుంది.



సూపర్‌స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్‌లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

కేరళ రాష్ట్రంలోని అలమట్టి పట్టణంలో ఒకప్పుడు ట్రావెన్ కోర్ రాజ్యం రాజులు పాలించేవారు. వారు నివసించిన పెద్ద ఇల్లు ఇప్పటికీ ఉంది. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. ట్రావెన్కోర్ వంశానికి చెందిన రాజు అలమోట్టిల్ మెద చాలా క్రూరుడు. ఆ ఇంట్లో కింద ఉండే భాగంలో బంధువులు ఉండేవారు. పైన భాగంలో ఆ రాజు నివసించేవాడు. అతను బ్రిటిష్ వారికి శిస్తు కడుతూ, ఆ ప్రాంతాన్ని పాలించేవాడు. రాజు ఇంట్లో పనిచేసే వారు ఉండడానికి, ఆ ఇంటికి దూరంగా ఇల్లు ఉండేవి. రాజు తన ఉంపుడుగత్తెల కోసం కూడా ప్రత్యేకమైన ఇంటిని కాస్త దూరంలో నిర్మించాడు.
ఆ రాజు తన ఇంటి నుండి చూసినపుడు వారు కనిపించే విధంగా ఆ ఇంటిలో ఉంచేవారు. ఆ అందగత్తెలలో నాట్యం అద్భుతంగా చేసేవారిని పిలిచేవారు. అలా నాట్యం చేసి, రాజుని సంతోషపెట్టిన వారికి ఆభరణాలతో పాటు సత్కారం చేసేవాడు. అందమైన స్త్రీలు ఎక్కడ ఉన్నా, వారిని సొంతం చేసుకునే స్వభావం రాజుకు ఉండేది. ఆ క్రమంలోనే చంద్రముఖి స్టోరీ ఇక్కడే పుట్టింది. రాజు పాలించే రోజుల్లో రాజు సోదరి ఫ్యామిలీ రాజు ఇంటికి వచ్చింది. వారిని తన ఆస్థానంలో ఉండనిచ్చాడు.
కానీ రాజు అక్క, బావ అతని రాజభోగాలు, ఐశ్వర్యం చూసి అసూయపడి, రాజు ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనుకున్నారు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాము, తమకు కొంత ఆస్తి ఇస్తే తమ జీవితం తాము జీవిస్తామని రాజును అడిగారు. అప్పుడు రాజు ఒక పెద్ద భవంతి పాటు వెయ్యి ఎకరాల భూమిని కూడా ఇచ్చాడు. అయితే వారి చేతికి మాత్రం డబ్బు ఇవ్వలేదు. రాజు వార్ధక్యంలో ఆస్తి దక్కుతుందని వారు భావించారు. అయితే రాజుకి వయసు పెరుగుతుండడంతో ఆస్తి అంతటిని తన పిల్లల పేర్ల మీద రాసి, భార్యతో కూడా సంతకం పెట్టించి, ఇచ్చాడు.
దాంతో పగ పెంచుకున్న రాజు అక్క తనకు ఆస్తి ఇవ్వలేదని, రాజును చంపాలని నిర్ణయించుకుంది. ముందుగా రాజు భార్యను స్లో పాయిజన్ తో సందేహం రాకుండా చంపేశారు. భార్య చనిపోవడంతో ఒంటరి వాడైన రాజు తోడుగా ఉండేందుకు పనివాడి పద్దెనిమిదేళ్ళ కుమార్తెను ఇంట్లో పెట్టుకున్నాడు. రాజుని ఆమె బాగా చూసుకునేది. అయితే వకసరి అక్కడికి వచ్చిన ఒక పెయింటర్ రాజు చిత్రం వేస్తానని అనడంతో, రాజు తనతో పాటు ఆ అమ్మాయి చిత్రాన్ని కూడా గీయమని చెప్తాడు. వారం రోజులు సమయం తీసుకుని పని మనిషి చిత్రాన్ని చాలా అందంగా గీస్తాడు.
ఆ చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడైన రాజు పనిమనిషిని ఇష్టపడతాడు. అప్పుడే ఆ ఇంటికి వచ్చిన రాజు అక్క ఈ విషయాన్ని గమనించి, పెత్తనం అంతా తన గుప్పిట్లోకి తీసుకుంది. రాజును ఎలాగైనా చంపేయాలని అనుకుంది. అనుకున్న తాదువుగా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి చంపి, రాజు సంపదను అంతా ఆమె తన సంస్థానానికి చేరవేస్తుంది. ఆ తర్వాత రాజు, పనిమనిషిని చంపిన రూమ్ ను తప్ప, మిగతా ఇంటిని అంతా అందంగా తీర్చి దిద్దింది. రాజు కొడుకు అక్కడ ఒక సేవకున్ని ఉంచాడు.
అయితే ప్రతి అమావాస్యకు గది నుండి భయంకర శబ్దాలు వస్తుండడంతో అతను ఆ ఇంటిని నుండి పారిపోగా, రాజు కదుకు మరొక పనివాన్ని పంపిస్తాడు. కానీ అతనుకూడ శబ్ధాలకు భయపడి పారిపోతాడు. ఆఖరికి అక్కడ రాజు అక్క ఆ ఇంట్లోనే ఉంది. ఆ తరువాత వచ్చిన అమావాస్య రోజు రాత్రిపూట రాజు అక్క కూతురు కూడా ఇంట్లో ఉన్నప్పుడు, పని మనిషి ఆత్మ ఆమెను ఆవహించి, పని మనిషిలానే మాట్లాడుతూ రాజు అక్కను చంపేసింది. అప్పటి నుండి ఆ ఇంట్లో నుండి ప్రతి అమావాస్యకు భయంకరమైన శబ్దాలు వస్తుంటాయని అక్కడి వారు చెబుతారు. ఈ కథ ఆధారంగా చంద్రముఖి మూవీని తీశారు.
























