తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మినిస్టర్ మరియు ప్రముఖ హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మం పై కామెంట్స్ చేశారు. అతను చేసిన వ్యాఖ్యల పై దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అటు రాజకీయలలో తీవ్ర చర్చకు దారి తీసాయి. యూనియన్ హోం మినస్టర్ అమిత్ షాతో పాటు పలువురు రాజకీయనేతలు ఉదయనిధి కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు.
ఈ విషయాన్ని బిజెపి జాతీయ అంశంగా మార్చింది. ఉదయనిధి కామెంట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమిని అడ్డుకునే దిశగా ప్రయత్నం చేస్తోంది. తాజాగా చిల్కూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఉదయనిధి స్టాలిన్మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్ కోరారు.
watch video :
Also Read: “అంత ముఖ్యమైన విషయాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి..?” అంటూ… “నారప్ప” పై కామెంట్స్..!





ధనుష్, మంజు వారియర్ నటించిన సినిమా అసూరన్. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ధనుష్ కు అక్క కూతురు మరియమ్మ పాత్రలో అమ్ము అభిరామి నటించింది. ధనుష్ శివసామిగా నటించాడు. శివసామి, మారియమ్మలు ప్రేమించుకుంటారు. ఆమె కుటుంబంతో సహా గుడిసెలలో సజీవదహనం అవుతుంది.
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ మరియమ్మ పాత్రను చదువుకోవడానికి స్కూల్ కు వెళ్ళే పాత్రలో చూపించారు. ఈ మూవీ చదువు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2019లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ధనుష్ ఉత్తమ నటుడి అవార్డును అసురన్ చిత్రానికి గాను పొందారు. ఇదే సినిమాని తెలుగులో నారప్ప టైటిల్ తో తెరకెక్కించారు.
ఈ మూవీలో అగ్ర హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించారు. ఒరిజినల్ మూవీలో మరియమ్మ పాత్రను చేసిన అమ్ము అభిరామి నారప్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో అక్క కూతురి పాత్రలో కన్నమ్మగా నటించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కన్నమ్మ పాత్రను టైలరింగ్ నేర్చుకున్నట్టుగా చూపించారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు అసలు సినిమానే విద్య గురించి, కాబట్టి తమిళంలో చదువుకున్నట్టుగా చూపించారు. కానీ తెలుగులో ఆ పాయింట్ ఎందుకు మార్చారు అని కామెంట్స్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ నటిస్తున్న మూవీ ఓజి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాహో డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్, సుజిత్ కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.
పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలి మరింతగా పెరిగిపోయాయి. పవన్ లుక్స్, యాక్షన్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యూత్ అంతా ఓజి టీజర్ తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి.
ఒకటని కాకుండా కాస్ట్యూమ్స్, కత్తి, గన్ ఇలా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క దాని గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, తన దైన రీతిలో నటిస్తూ, సినిమా సినిమాకి అభిమానులను, క్రేజ్ ను పెంచుకుంటూ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల కన్నా పవన్ వ్యక్తిత్వంతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో సైతం పవన్ ను అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా ప్రజల సమస్యల పై తన గొంతు వినిపిస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలోనూ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కోరాలో “పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?” అనే ప్రశ్నను అడుగగా,
పవన్ కళ్యాణ్ కి కానీ ఇప్పటి యువ హీరోస్ ఎవరికైనా కానీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం అనే స్థాయి లేదు అని అందరికీ తెలుసు. ఆన్సర్స్ రాసే వాళ్ళు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఒక వేళ అలా అనాల్సి వస్తే ఒక సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ , కృష్ణ , చిరంజీవి లాంటి వాళ్లకి మాత్రమే ఆ స్థాయి వుంది” అని చెప్పుకొచ్చారు.






