ఒక సినిమా 50 రోజులు ఆడింది అంటే హిట్ అంటారు. వంద రోజులు ఆడింది అంటే సూపర్ హిట్ అంటారు. అదే ఒక సినిమా ఏడాది ఆడితే? అసలు ఏదైనా ఒక సినిమా ఏడాది పాటు ఆడుతుందా అనే అనుమానం కూడా వస్తుంది.
కానీ అలా ఏడాది పాటు ఆడిన సినిమా ఒకటి ఉంది. అది కూడా మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన సినిమా. ఆ సినిమా మరేదో కాదు రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా. ఈ సినిమా తమిళ్ లో సంవత్సరం ఆడింది. ఇందులో జ్యోతిక మరొక ముఖ్య పాత్రలో నటించారు. అసలు జ్యోతిక నటన చూసిన తర్వాత ఆమె చాలా సంవత్సరాల పాటు చంద్రముఖి గానే ప్రేక్షకులకి గుర్తున్నారు.

అందులోనూ ముఖ్యంగా ఆ పాట అయితే చాలా మందిని భయపెట్టేలా చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా పేరు వింటే భయపడే వాళ్ళు ఉంటారు. చంద్రముఖి సినిమా మలయాళంలో రూపొందిన మణిచిత్రతాళు అనే సినిమాకి రీమేక్. తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రని మలయాళంలో మోహన్ లాల్ పోషించారు. జ్యోతిక పోషించిన పాత్రని శోభన పోషించారు. ఈ సినిమాకి శోభన జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. అయితే చంద్రముఖి పాత్రలో చాలా మంది హీరోయిన్లు నటించారు. వారు ఎవరో వారు నటించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 శోభన
ఒరిజినల్ సినిమా అయిన మణిచిత్రతాళు సినిమాలో శోభన నాగవల్లి పాత్రలో నటించారు. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో నాగవల్లి పాత్ర తమిళ్ మాట్లాడుతుంది. ఈ సినిమాకి శోభన ఎన్నో అవార్డులు అభినందనలు అందుకున్నారు.

#2 సౌందర్య
కన్నడలో రూపొందిన ఆప్తమిత్ర సినిమాలో సౌందర్య గంగ పాత్రలో నటించారు. కన్నడలో కూడా ఈ పాత్ర పేరు నాగవల్లి అని పెట్టారు. ఇందులో కూడా నాగవల్లి పాత్ర తెలుగు మాట్లాడుతుంది.

#3 జ్యోతిక
తమిళ్ లో చంద్రముఖి పేరు పొందిన ఈ సినిమాలో గంగ పాత్రలో జ్యోతిక నటించారు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి అదే పేరుతో విడుదల చేశారు. తమిళ్ లో చంద్రముఖి పాత్ర తెలుగు మాట్లాడుతారు. తెలుగులో చంద్రముఖి తమిళ్ లో మాట్లాడుతారు.

#4 విద్యా బాలన్
హిందీలో భూల్ భులయ్యా పేరుతో రూపొందిన ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యా బాలన్ చంద్రముఖి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పేరుని మంజులిక అని మార్చారు. ఇందులో మంజులిక పాత్ర బెంగాలీ మాట్లాడుతుంది. ఈ పాత్రతో విద్యా బాలన్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది.

#5 అను చౌదరి
బెంగాలీలో ఇదే సినిమాని రాజ్ మొహుల్ పేరుతో రూపొందించారు. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో అను చౌదరి నటించారు.

#6 విమల రామన్
ఆప్తమిత్ర కి సీక్వెల్ గా రూపొందిన ఆప్త రక్షకలో నాగవల్లి పాత్రలో విమల రామన్ నటించారు.

#7 అనుష్క
చంద్రముఖికి సీక్వెల్ గా తెలుగులో రూపొందిన నాగవల్లి సినిమాలో ఇదే పాత్రలో అనుష్క నటించారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పేరు చంద్రముఖి కాదు అని, ఆమె అసలు పేరు నాగవల్లి అని చెప్తారు.

#8 టబు
హిందీలో వచ్చిన భూల్ భులయ్యా సినిమాకి సీక్వెల్ గా భూల్ భులయ్యా – 2 రూపొందించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా స్టోరీ చాలా వరకు మార్చారు. అయితే మొదటి భాగంలో మంజులిక అనే పాత్ర మీద కథ నడుస్తుంది. ఇందులో కూడా మంజులిక అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో టబు నటించారు.

అయితే చంద్రముఖి సినిమాకి, ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు. కానీ మొదటి పార్ట్ లో యూజ్ చేసిన పాటని మాత్రం ఇందులో కూడా వాడారు. అంతే కాకుండా ఈ సినిమాలో టబుని కూడా సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగానే చూపించారు. ఇందులో టబు అంజులిక అనే మరో పాత్రలో కూడా నటించారు.

#9 కంగనా రనౌత్
ఇప్పుడు చంద్రముఖి రూపొందిన చాలా సంవత్సరాల తరువాత దానికి అసలైన సీక్వెల్ గా రూపొందుతున్న చంద్రముఖి 2 సినిమాలో చంద్రముఖి అనే పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంటుంది అని చెప్పారు. అంతే కాకుండా మొదటి భాగంలో నటించిన వడివేలు కూడా ఇందులో ఉన్నారు. రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.

ఈ హీరోయిన్లు అందరూ కూడా చంద్రముఖి కథతో రూపొందిన రీమేక్ సినిమాల్లో ఆ హీరోయిన్ పాత్రలో నటించారు. ఒక సినిమాలో చంద్రముఖి అయితే, మరొక సినిమాలో నాగవల్లి. ఇంకొక సినిమాలో ఇంకొక పేరు. కానీ పాత్ర మాత్రం అన్ని సినిమాల్లో ఒకటే. కథ కూడా దాదాపు ఒకటేలాగా ఉంటుంది. మరి ఇప్పుడు చంద్రముఖి 2 లో ఎలా చూపిస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
ALSO READ : BIGG BOSS TELUGU-7 : అసలు ఎవరు ఈ పల్లవి ప్రశాంత్..? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?














#2
#3
#4
#5
#6
#7
#8
#9
రజినీకాంత్, శ్రియ జంటగా నటించిన మూవీ శివాజి. డైరెక్టర్ శంకర్ తెరక్కేకించిన ఈ మూవీ తమిళంతో పాటు, తెలుగులోను ఏకకాలంలో విడుదల అయ్యింది. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సౌత్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. రజినికాంత్ లుక్సం, డైలాగ్స్, స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఒక ఎన్నారై భారత్ కు వచ్చి, దేశంలో దాచిపెట్టిన బ్లాక్ మనీని ఎలా బయటకు రప్పించాడు. ఆ డబ్బుతో ప్రజలకు ఎలా సాయం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. సందేశాత్మక కథతో రూపొందిన ఈ మూవీలో రజినికాంత్ ఒక ఎన్నారై పాత్రలో నటించారు.
రజినికాంత్ మేనమామగా పూర్తి నిడివి ఉన్న పాత్రలో వివేక్ నటించారు. అయితే ఈ మూవీని ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కానీ, వివేక్ ఏం జాబ్ చేసేవాడేనే విషయాన్ని ప్రేక్షకులు గమనించలేదు. అయితే ఈ మూవీలో వివేక్ లాయర్ గా నటించాడు. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఇన్ని సార్లు చూసాం కాని వివేక్ ఏం చేస్తారు అనే విషయం గమనించలేదే అని కామెంట్స్ పెడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న మూవీ ఓజి. ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఈరోజు 100 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్లో ‘హంగ్రీ చీతా’ అంటూ రిలీజ్ చేసిన టీజర్ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా మేకర్స్ చెప్పినట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వైలైన్స్ ఊహించని రేంజ్లో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ వీడియో అంతా ఎలివేషన్లతో నిండిపోయింది. అయితే ఈ టీజర్ ఫ్లోనెస్ మధ్యలోనే ఆపేసినట్టు ఉందని, చివరి 5 సెకన్లు పర్వాలేదనిపించింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైటింగ్ విజువల్స్ ఇంకా క్వాలిటీగా ఉంటే బాగుండేదని అంటున్నారు.

రాజ్ బి శెట్టి కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ గా రాణిస్తున్నారు. ఆయన యాక్టర్ మాత్రమే కాదు దర్శకుడు మరియు రచయిత. పలు కన్నడ చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. ఈ ఏడాది టోబి అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించి, మెప్పించారు. గరుడ గమన వృషభ వాహన సినిమాతో పాపులర్ అయిన రాజ్ బి శెట్టి మొదటిసారి లీడ్ క్యారెక్టర్ పోషించిన మూవీ ‘ఒందు మొట్టేయ కథె’. 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ 30 లక్షలు బడ్జెట్ తో తెరకెక్కి, రూ. 2.5 కోట్లు కలెక్షన్స్ సాధించి కమర్షియల్‌గా విజయం సాధించింది. ఉత్తమ సినిమాగా అవార్డ్ అందుకుంది.
రొమాంటిక్ కామెడీమూవీగా తెరక్కేకిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, 28 ఏళ్ల జనార్ధన్( రాజ్ బి శెట్టి) వృత్తిరీత్యా కన్నడ లెక్చరర్. బట్టతల మరియు సన్నగా ఉండడంవల్ల పెళ్లి సంబంధాలనని తప్పిపోతుంటాయి. జనార్ధన్ జాతకం ప్రకారం, 29 ఏళ్లలోపు అంటే ఏడాది లోపు వివాహం కాకపోతే, అతడు సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని జ్యోతిష్యుడు హెచ్చరిస్తాడు. దాంతో జనార్ధన్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు.
ఆ క్రమంలో సహోద్యోగి అయిన ఎకనామిక్స్ లెక్చరర్ ను లవ్ లో పడేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల సరళ జనార్థన్ ని లవ్ చేస్తుంది. జానార్థన్‌కు నచ్చకపోయినా సరళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ అందమైన అమ్మాయినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జనార్థన్ లావుగా ఉన్న సరళను పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ఆమెతో పెళ్లి రద్దు చేసుకొని అందంగా ఉండే అమ్మాయి కోసం వెతకడం మొదలుపెడతాడా? అనేది మిగిలిన స్టోరీ.