గతంలో రీమేక్‌లు చేసినా, ఇతర భాషలలోని ట్యూన్లు కాపీ చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ భాష నుండి కాపీ చేసినా వెంటనే తెలిసిపోతోంది. జనాలు కూడా ఇట్టే పసిగడుతున్నారు.
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా రీరిలీజ్ అయ్యింది. ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాట అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఇప్పుడు నెటిజెన్లు ఆ పాటను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్‌నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్‌గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్‌గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.
https://www.instagram.com/reel/CwIRZnCJeYL/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

నిర్మాత ఎస్కేఎన్ చదువుకునే రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఎంతో యాక్టివ్ గా ఉండటంతో ఎస్కేఎన్ అల్లు శిరీష్ పిలిపించి మరి అల్లు అర్జున్ కి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడి, దొరికిన జాబ్ చేస్తూ, ఆ తరువాత హీరోలకు పిఆర్ చేసి, చివరకు ప్రొడ్యూసర్ గా మారాడు. ఇటీవల బేబీ మూవీతో విజయాన్ని అందుకున్న ఎస్కేఎన్, ప్రొడ్యూసర్ గా కన్నా, మెగా ఫ్యాన్ గానే ఎక్కువగా కనిపిస్తుంటాడు.
సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన పై తనకున్న అభిమానంతో ఎస్కేఎన్ మాట్లాడారు. మామూలుగానే ఎస్కేఎన్ పంచులతో ప్రేక్షకులని అలరిస్తాడనే విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో అదే స్థాయిలో స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో భోళా శంకర్ ప్లాప్ గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.
“బాస్ రీఎంట్రీ తరువాత మునుపెన్నడూ లేనంత అందంగా కనిపించిన సినిమా భోళా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఎవరో ఏదో చెప్తే వారి ట్రాప్ లో పడి ఫ్యాన్స్ ఈ మూవీని ప్లాప్ డిజాస్టర్ చేసుకున్నారు అన్నట్టుగా ఎస్కేఎన్ మాట్లాడారు. ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అభిమాన స్టార్ ఏం చేసినా వీరాభిమానులకు నచ్చుతుంది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు అయితే నచ్చాల్సింది ఆడియెన్స్ కూడా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన మూవీ భోళాశంకర్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి బాగా నటించినప్పటికీ, కొన్ని సీన్ల వల్ల ఈ మూవీ నెట్టింట్లో ట్రోల్ అయ్యింది. ఆ సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసినా కూడా అంతగా ఈ మూవీ ప్రభావం చూపెట్టలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక నష్టాలను మిగిల్చింది. ఆచార్య మూవీ కన్నా భారీ డిజాస్టర్ అనే టాక్ కూడా వచ్చింది.
అయితే ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో “ఈరోజు అమ్మని జైలర్ కి తీసుకెళ్ళా, సినిమా మొదలయ్యే ముందు పక్క స్క్రీన్ లో చిరంజీవి సినిమా ఆడుతుంది అని చెప్పా. అంతే ఆ తర్వాతి సెకను దానికి వెళితే అయ్యోపోయే కదా దీనికి ఎందుకు తీసుకొచ్చావు. సినిమా ఫ్లాప్ అయింది మా అంటే, చిరంజీవి సినిమా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అని అన్నారు. అదీ బాస్ అంటే” అని రాసుకొచ్చారు.
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలలో ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ మూవీ ఒకటి. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ యూత్ పుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ, చిన్న సినిమాగా జులై 26న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమానే ‘బాయ్స్ హాస్టల్’ అనే టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ‘బేబీ’ మూవీ యూనిట్ తో ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ ను లాంచ్ చేయించారు. అయితే ఈ ట్రైలర్ చివర్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డైలాగ్ ఉంటుంది.
ఒక కుర్రాడు ‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని అనగానే, మరొకరు “ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా” అని అంటాడు. ఈ డైలాగ్ లు సాధారణంగా అయితే ప్రజలు మామూలుగా మాట్లాడుకునేవే. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని అంటున్నారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ట్రోల్స్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రజినికాంత్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, జైలర్ మూవీ ఆయనతో కలిసి రజినికాంత్ చూడడం జరిగింది. యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కావడానికి ఆయన నివాసానికి వెళ్ళినపుడు, యోగి రజినికాంత్ ను ఆహ్వానించడం కోసం ఎదురు వచ్చారు. ఆ సమయంలో రజినికాంత్ యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వీడియో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వయసులో రజినికాంత్ యోగి కన్నా చాలా పెద్దవాడు. యోగి వయసు చాలా తక్కువ. రజినీ తన కన్నా చిన్నవాడైన యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశాడు. తమిళనాడులో అందరూ నిన్ను ఆరాధిస్తుంటే నువ్వెళ్లి యోగి పాదాలు మొక్కుతావా? తమ ఆత్మాభిమానాన్ని కించపరిచావంటూ తమిళ ఫ్యాన్స్ మండిపడ్డారు. రజిని యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు సమర్ధిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విమర్శల పై స్పందించారు. తాజాగా చెన్నైలో అడుగుపెట్టిన రజినీకాంత్ ను మీడియా ఈ వివాదం గురించి అడుగగా, తన పై వచ్చిన విమర్శుల పై స్పందించాడు. “వయసులో పెద్ద వారైనా, చిన్న వారైనా, సన్యాసి అయినా, మఠాధిపతి, మత గురువు, యోగి, స్వామిజీ అయినవారి పాదాలకు నమస్కరించడం నా అలవాటు” అని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తనయుడు, రేణు దేశాయ్ గారాల కుమారుడు అకిరా నందన్. రేణు దేశాయ్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అకిరా సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే చాలాసార్లు ప్రచారాలు జరిగాయి. అయితే వాటిని రేణూ దేశాయ్ ఖండించింది. అయినప్పటికీ అకిరా ఎంట్రీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అకిరా ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ నార్వేలో అకిరా నందన్‌తో ఉంది. తాజాగా అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అకిరాతో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
ఇక రాఘవేంద్ర రావుతో అకిరా కనిపించడంతో ఏదో ఉందని అనుకున్నారు. నెటిజెన్లు రాఘవేంద్ర రావుతో లాంచ్ చేయిస్తున్నారా? అకిరా యాక్టింగ్ స్కూల్లో చేరారా? అని రేణూ దేశాయ్ పై ప్రశ్నలు అడుగుతున్నారు. రేణూ దేశాయ్ నెటిజన్ల కామెంట్లకు ఇన్ స్టా స్టోరీలో జవాబు చెప్పింది. అకిరా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. అకిరాకు ఇప్పుడు నటన పై ఆసక్తి లేదు. అకిరాకు నటించే ఆసక్తి వచ్చినపుడు ఆ విషయాన్ని ముందుగా ఇన్ స్టాగ్రాంలో అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.












‘గన్స్ అండ్ గులాబ్స్’ 1990ల కాలంలో ‘గులాబ్ గంజ్’ అనే ఊరులో సాగే స్టోరీ. గులాబ్ గంజ్ లో గవర్నమెంట్, ఔషధ తయారీ అవసరాల కోసం ఆ ఊరి రైతులు నిషేధిత నల్లమందుకు సంబంధించిన పంటను పండిస్తుంటారు. వారి దగ్గర ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక గ్యాంగ్ కూడా అక్రమంగా అక్కడి రైతులతో పెద్ద మొత్తంలో నల్లమందు పంటను పండిస్తుంది. ఈ పంటను వెస్ట్ బెంగాల్ కు చెందిన పెద్ద గ్యాంగ్‌స్టర్ కు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనికి షేర్పూర్ లోని వేరే గ్యాంగ్ అడ్డుపడుతుంటుంది.
నల్లమందును కొనుగోలు విషయంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వార్ సాగుతూ ఉంటుంది. ఈ గోడవల వల్ల ‘నార్కోటిక్ ఆఫీసర్’ గా ఆ ప్రాంతానికి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) ను నియమిస్తారు. అర్జున్ నల్లమందు మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? బైక్ మెకానిక్ గా పనిచేసే టిప్పు ( రాజ్ కుమార్ రావు) పాత్ర ఏమిటి? రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అనేది మిలిన కథ.
ఏడు ఎపిసోడ్లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో టిప్పుగా రాజ్ కుమార్ రావ్ సహజంగా నటించాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ గా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడు. వైవిధ్యమైన పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. అయితే రాజ్ అండ్ డీకే గత సిరీస్ ల రేంజ్ లో లేదని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ అలరిస్తుంది.