ముకుంద చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే. చాలా తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
పూజా తన అందం, నటనతో ఎంతగానో ఆడియెన్స్ అలరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే మదర్స్ డే సందర్భంగా పూజా హెగ్డే తల్లి లతా హెగ్డే తన కుమార్తె గురించి, పూజా పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒక లైలా కోసం మూవీ తరువాత పూజా హెగ్డే వెనుదిరిగి చూడాల్సి రాని విధంగా ఓ రేంజ్ లో టాలీవుడ్ లో దూసుకెళ్లింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా నిలిచింది.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయితే వరుసగా ఫ్లాప్ లతో ఇప్పుడు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు ఆమెను సెంటిమెంట్ గా అనుకునే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమెకు తమ సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి వెనుకడుతున్నారు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా పూజా హెగ్డే తల్లి కూతురి పెళ్లి గురించి కొన్ని కండిషన్స్ వెల్లడించింది. మదర్స్ డే సందర్భంగా పూజా హెగ్డే తన తల్లితో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పూజ తల్లికి కూతురికి ఎలాంటి భర్త కావాలని అనుకుంటున్నారనే ప్రశ్నను అడగడంతో ఆమె తన అభిప్రాయన్ని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ “తన కుమార్తెను అన్ని విధాలుగా అర్ధం చేసుకోగల వ్యక్తి గురించి చూస్తున్నామని, పెళ్లి అనేది ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని, అప్పుడే వారి మధ్య గౌరవం పెరుగుతుంది. అలాంటి వ్యక్తి దొరికితే పూజను ఇచ్చి పెళ్లి చేస్తామని” వెల్లడించింది.
Also Read: ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 6 టైటిల్స్..! అవి ఏంటో తెలుసా..?























ఈ సినిమా గురించి నెల రోజులుగా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారని టాక్. మే 31న ఈ మూవీ నుండి అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తరువాత వస్తున్న మొదటి జయంతి కావడంతో ఘట్టమనేని అభిమానులకు మూవీ అప్డేట్ తో సంతోషం కలిగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినా 6 టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏమిటంటే..
1. అయోధ్యలో అర్జునుడు:
2. అమ్మకథ:
3. అమరావతికి అటు ఇటు:
4. గుంటూరు కారం:
5. ఊరికి మొనగాడు:
6. పల్నాడు పోటుగాడు:
ఈ మూవీ కథ పల్నాడు బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. దాంతో ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారంట.
































