ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. ‘బాహుబలి’ నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేసాడు రాజమౌళి.
ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. అయినప్పటికీ, కథ చెప్పడం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే.. ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ ఓ కామన్ పాయింట్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా..!?

స్టూడెంట్ నెం.1 నుండి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి సినిమాలో ఒక్కటి గమనించవచ్చు. రాజమౌళి ఒక్క స్టోరీ తీసుకుంటే అది ఏ ఫార్మాట్ అయిన సరే ఉదాహరణకు ఈగ, సింహాద్రి, మగధీర, బాహుబలి 1, బాహుబలి 2 అయిన యమదొంగ అయిన రాజమౌళి సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాని ఆధారంగా చేసుకొని ఆడియన్స్ ఎమోషనల్ తో సినిమాకి మంచి హైప్ తీసుకొస్తాడు.

ఒక హీరో ఉంటాడు వాళ్ళ అమ్మ గాని, నాన్న ఫ్రెండ్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ని బేస్ చేసుకొని బ్యాక్ గ్రౌండ్ లో ఏదో టార్గెట్ పెట్టుకొని హీరో దాని కోసం పోరాడుతాడు. చివరికి హీరో గెలుస్తాడు. ఉదాహరణకు కొన్ని సినిమాలు చూద్దాం..
#1. ఛత్రపతి:

హీరో వాళ్ళఅమ్మ ని బేస్ చేసుకొని ఫ్యామిలీ ఎమోషనల్ ని పండిస్తాడు దర్శకుడు. హీరో ఎక్కడి నుండో వచ్చి అక్కడ కూలీగా పని చేస్తారు. వాళ్ళ అరాచకం తట్టుకోలేక వాళ్ళని ఎదిరిస్తాడు హీరో.
#2. ఈగ:

హీరో, హీరోయిన్ కోసం విలన్ హీరో ని చంపేస్తే హీరో ఈగ లాగా వచ్చి విలన్ ని చివరికి చంపేస్తాడు. ఈ సినిమాలో ఎమోషనల్ చాలా బాగుంటుంది.
#3. ఆర్ఆర్ఆర్:

రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట కోసం పోలీస్ ఆఫీస్ అయి బ్రిటిష్ తుపాకులతో బ్రిటిష్ పై యుద్ధం చేయడం కోసం రామ్ వస్తాడు. అది బ్యాక్ గ్రౌండ్ స్టోరీ భీమ్ మల్లీ కోసం వస్తాడు అలా చిన్న చిన్న గొడవలు అయి భీమ్ రామ్ ని అర్ధం చేసుకొని రామ్ కోసం పోరాడుతాడు. చివరికి నాన్న కోరిక తీరుస్తాడు. అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు.

ఫస్ట్ హాఫ్ లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఇది ఇంటర్వెల్. సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఆ స్టోరీ ఎమోషనల్ గా ఆడియెన్స్ ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో అది సాధిస్తాడు. ఇలా ఉంటుంది రాజమౌళి మేకింగ్. రేపు రాబోయే మహేష్ బాబు సినిమా కూడా ఇలానే ఉండొచ్చు.

ఈ సినిమా గురించి నెల రోజులుగా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారని టాక్. మే 31న ఈ మూవీ నుండి అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తరువాత వస్తున్న మొదటి జయంతి కావడంతో ఘట్టమనేని అభిమానులకు మూవీ అప్డేట్ తో సంతోషం కలిగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినా 6 టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏమిటంటే..
1. అయోధ్యలో అర్జునుడు:
2. అమ్మకథ:
3. అమరావతికి అటు ఇటు:
4. గుంటూరు కారం:
5. ఊరికి మొనగాడు:
6. పల్నాడు పోటుగాడు:
ఈ మూవీ కథ పల్నాడు బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. దాంతో ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారంట.




































సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సౌమ్యా రావు, అనుకోకుండా ‘జబర్దస్త్’ షో యాంకర్ గా మారింది. ఈ షోలో చలాకీగా, తన మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సౌమ్య రియల్ లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా సౌమ్యా రావు తల్లి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. మదర్స్ డే రోజున సౌమ్యా రావు తన తల్లి వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ, చివరి రోజుల్లో తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
తన తల్లి పడిన నరకయాతన మరో తల్లికి రాకూడదని ఎమోషనల్ అయ్యారు. “అమ్మ, డాక్టర్లు, అంబులెన్స్, మందులు, ట్రీట్మెంట్, బాధ. అది ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దేవుడికి ఎన్ని పూజలు, ఉపవాసాలు చేసినా వృథా అయ్యాయి. అమ్మా నువ్వు లేకుండా నా లైఫ్ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు మళ్లీ నా కోసం పుడతావని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడా నా తల్లిదండ్రులను మళ్ళీ నాకు ఇవ్వు” అంటూ తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్తూ సౌమ్యా రావు ఎమోషనల్ అయ్యారు. సౌమ్య రావు పోస్ట్ చూసిన నెటిజెన్లు ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు జీవితంలో కొల్పోయిన ఆనందాలను దేవుడు తిరిగి ఇస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్‌లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్‌కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.