సినిమాల ప్రభావం మన మీద ఎంతగా పడుతుందో తెలిసిందే. నచ్చిన హీరోలు ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతారో ఆ విధంగానే మనం కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే హీరోలు ధరించే దుస్తులను చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళ యాటిట్యూడ్ ని వాళ్ళ స్టైల్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు.
నచ్చిన సినిమాల్లో డైలాగులని వాడడం.. వాళ్ల మేనరిజాన్ని అనుసరించడం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు.

అయితే ఇది ఈ రోజుల్లోనే కాదు ఇది వరకు కూడా హీరోలు, హీరోయిన్లని చూసి అలా ఫాలో అవుతూ ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే కమల్ హాసన్, సరిత జంటగా నటించిన మరో చరిత్ర సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది. కే. బాలచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అద్భుతమైన ప్రేమ కావ్యం ఇది.

ఈ సినిమా అప్పట్లో ఎంతో మంది హృదయాలని గెలుచుకుంది. యూత్ అయితే ఏకంగా ఈ సినిమాని అనేక సార్లు చూశారు. ఈ సినిమాకి అద్భుతమైన ట్రాజిడీ ఎండింగ్ ని ఇచ్చారు దర్శకుడు. ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈ సినిమాని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు.

ప్రేమలో సక్సెస్ అవ్వలేదు అని సూసైడ్ నోట్ రాసి ఈ సినిమా గురించి కూడా రాసి చనిపోయేవారట. ఏకంగా 20 జంటలకు పైగా ఈ సినిమాను చూసి సూసైడ్ చేసుకున్నారు. దీనితో మానవహక్కుల సంఘాలు మరియు కొన్ని అభ్యుదయ సంఘాలు దర్శకుడు బాలచంద్రన్ ని తిట్టడం మొదలు పెట్టాయి. అప్పుడు బాల చంద్రన్ ఈ సినిమాను తీసి తప్పు చేశాను. నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇది క్షమించండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాని తీసినందుకు ప్రతి రోజు నేను పశ్చాతాప పడుతున్నాను అని ఆయన చెప్పారు.




































సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సౌమ్యా రావు, అనుకోకుండా ‘జబర్దస్త్’ షో యాంకర్ గా మారింది. ఈ షోలో చలాకీగా, తన మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సౌమ్య రియల్ లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా సౌమ్యా రావు తల్లి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. మదర్స్ డే రోజున సౌమ్యా రావు తన తల్లి వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ, చివరి రోజుల్లో తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
తన తల్లి పడిన నరకయాతన మరో తల్లికి రాకూడదని ఎమోషనల్ అయ్యారు. “అమ్మ, డాక్టర్లు, అంబులెన్స్, మందులు, ట్రీట్మెంట్, బాధ. అది ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దేవుడికి ఎన్ని పూజలు, ఉపవాసాలు చేసినా వృథా అయ్యాయి. అమ్మా నువ్వు లేకుండా నా లైఫ్ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు మళ్లీ నా కోసం పుడతావని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడా నా తల్లిదండ్రులను మళ్ళీ నాకు ఇవ్వు” అంటూ తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్తూ సౌమ్యా రావు ఎమోషనల్ అయ్యారు. సౌమ్య రావు పోస్ట్ చూసిన నెటిజెన్లు ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు జీవితంలో కొల్పోయిన ఆనందాలను దేవుడు తిరిగి ఇస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.

1. ప్రభాస్ – 100-150 కోట్లు:
3. కృతి సనన్ – రూ. 3 కోట్లు:
4. సన్నీ సింగ్ – 1.5 కోట్లు:
5. సోనాల్ చౌహాన్ – రూ. 50 లక్షలు: