భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 5 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది.
అయితే ఒకవైపు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సూపర్ హిట్ చిత్రాలు వస్తుంటే.. మరోవైపు రెగ్యులర్ కథలతో పలు కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీపై ప్రకటన సమయం నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు దీన్ని ఏకంగా రూ. 80 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఫలితంగా భారీ అంచనాలతో అత్యధిక లోకేషన్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా దక్కలేదు.

రూ. 37 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ స్పై థ్రిల్ల్రర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.70 కోట్లు వరకూ షేర్ రూ. 12.50 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఫుల్ రన్లో కేవలం రూ. 7 కోట్లు లోపు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ఈ సినిమా ఏకంగా రూ. 30 కోట్లకు పైగా నష్టాలతో అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో ఎన్నో చెత్త రికార్డులు కూడా ఈ సినిమా పేరిట నమోదు అయ్యాయి.

మరోవైపు మాచో స్టార్ గోపీచంద్ నటించిన రామబాణం చిత్రం పరిస్థితి కూడా దాదాపు ఇదే.. ఈ మూవీ 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా.. 5 రోజుల్లో కేవలం 3 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకాస్త వస్తుందన్న వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఆల్ మోస్ట్ ఈ సినిమా 11.50 కోట్ల రేంజ్ లో నష్టాలు కలిగించే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ తోనే మినిమమ్ కలెక్షన్స్ అందుకొనే గోపీచంద్ కూడా ఈ చిత్రం తో దెబ్బతిన్నాడు.

ఇక వరుస హిట్స్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడుతున్న వేళ రెండు సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో చేరాయి. ఏజెంట్, రామబాణం డిజాస్టర్స్ వలన మార్కెట్ చాలా పడిపోయింది. ఎదో ఒక మంచి సినిమా వస్తేనే మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక త్వరలో రానున్న నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Also read: “చిరంజీవి” నుండి… “షారుక్ ఖాన్” వరకు… ఘోరమైన “ఫ్లాప్” తర్వాత కంబ్యాక్ ఇచ్చిన 8 హీరోస్..!

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు, హిందీ, తమిళం భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి గొప్పనటుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన కెరిర్ లో నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తన ఛానెల్ పరుచూరి పలుకుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ గా మారారని చెప్పారు. బి.నాగిరెడ్డి, కేవిరెడ్డి, చక్రపాణి వీరంతా చాలా గొప్పవారని అన్నారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అనే పాయింట్ తో దర్శకనిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించారని చెప్పారు.
ఈ చిత్రానికి ముందు వరకు జానపద చిత్రాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తుకు వచ్చేవారని తెలిపారు. అయితే పాతాళ భైరవి సినిమా విడుదలైన తరువాత జానపదం అంటే ఎన్టీఆర్ అనేంతగా ఆయన ప్రభావం చూపారని వెల్లడించారు. జానపదం, సాంఘికం,చారిత్రకం, పౌరాణికం లాంటి చిత్రాలలో ఎన్టీరామరావుగారు జీవించేవారని చెప్పారు. ఇక పాతాళభైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికి, మళ్ళీ చూడాలనిపించేలా ఏదో కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలిపారు.
ఆ మూవీలోని డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయని అన్నారు. యస్.వి. రంగారావుని మాంత్రికుడిగా చూస్తే భయమేసేదని అన్నారు. రీరిలీజ్ చేసినా వంద రోజులు ఆడే చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం ముందు ఉంటుందన్నారు. ఈ చిత్రం ఓటీటీల్లో ఉన్నట్లయితే చూడమని అందరిని పరుచూరి కోరారు.






బాలీవుడ్ లో తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఆదిపురూష్ సినిమాని రూపొందించాడు. దాంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. అది మాత్రమే కాకుండా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఆడియెన్స్, అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్యన రిలీజ్ అయిన మూవీ టీజర్ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను నిరాశ పరిచింది. కారణం క్యారెక్టర్స్ లుక్స్, గ్రాఫిక్స్.
మరి ముఖ్యంగా రావణుడు, హానుమాన్ రూపాలను చూడగానే ఆంగ్ల చిత్రాలను చూసినట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. రాముడు, సీత, పాత్రలను అవమానించారంటూ మూవీ యూనిట్ పై విమర్శలు చేశారు. దీంతో మూవీ యూనిట్ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాని జూన్ 16కు వాయిదా వేసింది. గ్రాఫిక్స్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆ మార్పు అర్ధం అవుతోంది. ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కన్నా ముందుగా డైరెక్టర్ ఓంరౌత్ బాలీవుడ్ స్టార్ హీరోను రాముడిగా అనుకున్నారంట. దర్శకుడు ఓం రౌత్ ముందుగా హృతిక్ రోషన్ కథ చెప్పారట, దానికి హృతిక్ ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పాడట. చివరకు ప్రభాస్ కు కథ చెప్పడం ఆయన ఒప్పుకోవడం జరిగింది.















తొలిప్రేమ మూవీ సూపర్‌హిట్ అవడంతో పాటు వాసుకి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె సినిమాలలో నటిస్తూ బిజీగా మారుతుందని అందరు అనుకున్నారు. కానీ వాసుకి ఆ మూవీ తరువాత యాక్టింగ్ మానేసి, తొలిప్రేమ మూవీ ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆమె పిల్లలు, ఫ్యామిలీ జీవితంతో బిజీ అయిపోయింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వాసుకి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్ సిస్టర్ క్యారెక్టర్ లో వాసుకి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విందా మూవీస్, స్వప్న సినిమా సంస్థల పై ప్రియాంక దత్, స్వప్న దత్, ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నటించిన వాసుకి మీడియాతో మూవీ విశేషాలు మరియు ఆమె మళ్ళీ సినిమాలలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు.
వాసుకి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు నటించడం కుదరలేదు.పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు వీటితో నటించడం కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యారు. యూకేలో పాప మెడిసిన్, బాబు ఆర్కిటెక్చెర్ చదువుతున్నారు. నా భర్త తన పనిలో బిజీగా వుంటారు. దాంతో ప్రస్తుతం ఏదైనా చేయడానికి నాకు టైమ్ కుదిరింది. ఇలాంటి టైమ్ లోనే డైరెక్టర్ నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించానని వెల్లడించారు.


మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్‌తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.