దర్శకుడు వెట్రిమారన్ కల్ట్ కంటెంట్ తో సామాజిక అంశాలను వాటి మూలాల్లోకి వెళ్లి స్టోరిని తెర పై అద్భుతంగా ఆవిష్కరించి విజయాన్ని సాధిస్తాడు. వెట్రిమారన్ చిత్రాలలో అంతర్లీనంగా సొసైటీలో అణచివేతకు గురి అవుతున్న ఒక వర్గం యొక్క వేదన కనిపిస్తుంది.
ఇటీవల వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘విడుతలై పార్ట్-1’. కోలీవుడ్ లో ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఈ మూవీ కథ, ఈ చిత్రంలోని పాత్రల గురించి అక్కడ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సమాచారం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారత్ లోని గొప్ప డైరెక్టర్ల జాబితాలో వెట్రిమారన్ పేరు కూడా ఉంటుంది. ఆయన తీసింది 5 చిత్రాలే అయినా, ప్రతీ చిత్రం ఒక అద్భుతమే. ఆయన చిత్రాలకు అవార్డులు కూడా దాసోహం అవుతుంటాయి. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘విడుతలై పార్ట్-1’ విడుదల అయ్యి, కోలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతుంది. ఎక్కడో, ఎప్పుడో విన్న లేదా చూసిన సంఘటలనే వెట్రిమారన్ మూవీగా తెరకెక్కిస్తుంటాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘విడుదల పార్ట్ 1’ కూడా అలాంటి చిత్రమే.
1987 లో తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగే స్టోరీ ఇది. ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను ప్రజాదళం అనే విప్లవ పార్టీ వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఈ క్రమంలో పోలీసులకు మరియు ప్రజాదళం పార్టీకి మధ్య జరిగే సంఘర్షణ ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత తమిళ నాడులో ఈ సినిమా పై చర్చలు మొదలయ్యాయి. 1980వ దశకంలో తమిళనాడులో ఎక్కువగా వినిపించిన పేరు కవి కు.కళీయపెరుమాళ్. ఈ పాత్రనే ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో విజయ్ సేతుపతి చేశారని తెలుస్తోంది.
కళీయపెరుమాళ్ అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. ఆ తర్వాత విభేదాలతో ఉద్యమంలో చేరారు. ఉపధ్యాయుడు అయిన పెరుమాళ్ కుల నిర్మూలన పై పోరాడారు. కుల నిర్మూలన, వర్గ విముక్తి కోసం కృషి చేయడం కోసం ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. పెన్నాడంలోని ప్రైవేట్ చక్కెర కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల హక్కుల కోసం కలియ పెరుమాళ్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరిగాయి. కార్మికులు సమ్మెకు దిగారు.
దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కలియపెరుమాళ్ను చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. రాత్రిపూట కలియ పెరుమాళ్ కూలిలను తీసుకెళ్ళి, రైతుల ఆధీనంలో ఉన్న భూముల్లోని వరిపంటను కోసి పేదలకు, పంపిణీ చేసేవాడు. ఈ ‘పంట ఉద్యమం’ గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో మార్మోగింది. కలియపెరుమాళ్ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. పొన్పరప్పికి చెందిన తమిళరసన్‌తో పాటుగా చాలామంది యువకులు కలియపెరుమాళ్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు.
రైలును బాంబుతో పేల్చే సీన్ ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో మొదటి సన్నివేశంలో కనిపిస్తుంది. అయితే 1987లో అరియలూరు సమీపంలోని మరుదైయార్త్ వంతెనను బాంబుతో పేల్చివేసిన ఘటన కూడా మూవీలో చూపించిన తరహాలోనే జరుగిందని అంటున్నారు. అప్పుడు వంతెనను పేల్చివేయడంతో, మలైకోట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూలి 50 మందికి పైగా చనిపోయారు. ఆ కేసులో తమిళరసన్‌తో పాటు లిబరేషన్ ఆర్మీ మెంబర్స్ కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో పొన్పరప్పిలోని బ్యాంకులో చోరీకి ప్రయత్నించి తమిళరసన్‌తో పాటు ఐదుగురిని కొట్టి చంపారు.
హత్య కేసులో, కవి కలియపెరుమాళ్ మరియు అతని పెద్ద కుమారుడు వల్లువన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1972లో కడలూరు కోర్టు రెండో కుమారుడు చోళ నంబియార్‌తో సహా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వల్లువన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. కలియపెరుమాళ్కు విధించిన మరణశిక్షను, ఇతరులకు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది.
అనంతరం కలియపెరుమాళ్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ కాళయపెరుమాళ్ మరియు అతని కుమారులు జైలులో ఉన్నారని తెలుసుకుని, సుప్రీం కోర్టులో కేసు వేశారు. విచారన తర్వాత, 1983లో సుప్రీంకోర్టు కలియపెరుమాళ్ తో పాటు ఇతరులకు పెరోల్ మంజూరు చేసింది.కొన్నేళ్ళ తర్వాత, సుప్రీం కోర్టు ఆదేశాలతో వారు పూర్తిగా శిక్ష నుండి విముక్తి పొందారు. కలియపెరుమాళ్ మే 16, 2007న మరణించారు.
కవి కలియపెరుమాళ్ రెండవ కుమారుడు చోళ నంబియార్ ‘విడుతలై పార్ట్-1’ సినిమా గురించి మాట్లాడుతూ, “తన తండ్రి ప్రజల కోసం పోరాడారు. ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆ విషయాన్ని అలాగే ఈ చిత్రంలో చూపించారు’’ అని చెప్పారు.
Also Read: చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తుంటాను.. అలేఖ్యారెడ్డి పోస్ట్ వైరల్!


















ప్రేమ, పెళ్లితో తారకరత్న, అలేఖ్యారెడ్డి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరు కలిసి జీవించడం కోసం అయిన వారందరికీ దూరమయ్యారు. హృదయంలోని భరించలేనంత బాధను చిరునవ్వుతో దాచేస్తూ ఇద్దరు కొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు నిషిక, తాన్యారామ్, రేయా. తారకరత్న ఒక వైపు ఇండస్ట్రీలో కొనసాగుతూ, మరో వైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న ఇప్పుడిప్పుడే తన కుటుంబానికి దగ్గర అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే అర్థంతరంగా కన్నుమూశారు.
నందమూరి తారకరత్న మరణించి రెండు నెలలకు పైగా అవుతుంది. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న, సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న కన్నుమూశారు. జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త హఠాన్మరణంతో ఆయన భార్య అలేక్య రెడ్డి వేదన వర్ణణాతీతం. తన ముగ్గురు పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగుకుంటూ జీవిస్తోంది. తన భర్తతో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తారకరత్నను తలచుకుంటూ “ఈ జీవితానికి సరిపడా మధురమైన జ్ఞాపకాలను ఇచ్చి వెళ్లావు. ఆ జ్ఞాపకాలతోనే ముందుకు వెళతాను. నా ఆఖరి శ్వాస వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను” అని రాసుకొచ్చారు. అలేఖ్యారెడ్డి మరో పోస్ట్ లో తన కుమారుడి ఫోటోతో పాటుగా తారకరత్న చిన్నప్పటి ఫోటోను కూడా షేర్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ లను లైక్ చేస్తూ, ఆమెకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలేఖ్యారెడ్డి తన పిల్లలను చూసుకుంటున్నారు. కెరీర్ విషయంలో ఆమె జాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తారకరత్న బిజినెస్ కు సంబంధించిన విషయాలను అలేఖ్యారెడ్డి చూస్తున్నారని తెలుస్తోంది. అలేఖ్యారెడ్డి ఇటీవల సామాజిక మధ్యమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది.










1. గౌరవం:
2. హలో బ్రదర్:
3. దుర్గ:
4. అదే నువ్వు అదే నేను:
5. నాగ చైతన్య – ఇంద్రగంటి చిత్రం :
6. నాగేశ్వరరావు :









