నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం ‘దసరా’ రీసెంట్ గా భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఈ చితానికి కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.
ఈ మూవీలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించారు. థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. నాని ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ గురించి తాజాగా ఒక అప్ డేట్ నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారీ అంచనాలతో రిలీజ్ అయిన నాని ‘దసరా’ మూవీ అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్రం నాని కెరీర్ లోనే మంచి ఒపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్స్‌ను వసూల్ చేసి, నాని కెరీర్లో రికార్డ్ సృష్టించింది. వసూళ్ల పరంగా 100 కోట్ల క్లబ్బులో చేరింది. తాజాగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే నాని తన 30వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ టైటిల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారి ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ నెట్టింట్లో ఒక టాక్. ఈ మూవీలో నాని జెర్సీ మూవీ తరువాత మరోసారి తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. పేరెంట్స్ విడాకులు తీసుకోగా వారి ఇద్దరి మధ్యలో వారి పాప ఎలా సఫర్ అయ్యిందనేది ఈ మూవీ స్టోరీ అని టాక్.
ఇక ఈ చిత్రానికి కూడా కొత్త డైరెక్టర్ అయిన శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సీతారామం మూవీతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ ‘దసరా’ మూవీ తరువాత వస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: ఒక పాటలో నటించడానికి ”ఊర్వశి రౌతేలా” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

1. అంబికాపతి:
2. పూంపుహార్:
3. రాజరాజ చోళన్:
4. మధురైయై మీట్టా సుందరపాండియన్:
5. ఆయిరతిల్ ఒరువన్- యుగానికి ఒక్కడు:
6. పొన్నియన్ సెల్వన్-1:
7. పొన్నియన్ సెల్వన్-2:
Also Read: 


బాలీవుడ్ లోని పాపులర్ హీరోయిన్స్ లలో ఊర్వశి రౌతేల ఒకరు. ఆమె హీరోయిన్గా నటించడమే కాకుండా ప్రత్యేక సాంగ్స్ లో నర్తించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశీ తన గ్లామరస్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంది. అలాగే ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా దక్షణాది మూవీ మేకర్స్ కూడా ఊర్వశీని తమ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె హసీనో కా దీవానాలో సాంగ్ లో చేసిన డ్యాన్స్ అమితాబ్ బచ్చన్ నుండి ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుండి ఆమెను పలువురు బాలీవుడ్ మరియు సౌత్ మేకర్స్ ఊర్వశిని తమ చిత్రాల్లో ఆమెతో డ్యాన్స్ చేయించాలని అనుకుంటున్నారు. అయితే ఆమె ఎంతబాగా డాన్స్ చేస్తుందో, ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో సీటీ మార్ మూవీ నిర్మాత తమ మూవీ కోసం ఒక సాంగ్ లో డ్యాన్స్ చేయమని ఊర్వశిని ఆడగగా అందుకు ఆమె కోటి డిమాండ్ చేసిందంట. దీంతో ఆ ప్రొడ్యూసర్ తన ఆలోచనను విరమించుకున్నాడట.
లెజెండ్ మూవీ కోసం 20 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. బాస్ పార్టీ సాంగ్ కి ఊర్వశి రౌతేల 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ‘ఏజెంట్’ మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ‘వైల్డ్ సాలా’ పాటతో యువతను ఉర్రూతలూగించారు. ఇందులో ఆమె ధరిచిన డ్రెస్ కోసం 20 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. డ్రెస్ కే అంత ఖర్చు అయితే ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవచ్చని టాక్ వినిపిస్తోంది.
























