కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పుడు మళ్లీ ఏజెంట్ సినిమాతో చాలా సమయం తీసుకొని ప్రేక్షకులని అలరించడానికి వచ్చారు. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఏజెంట్
- నటీనటులు : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి.
- నిర్మాత : అనిల్ సుంకర
- దర్శకత్వం : సురేందర్ రెడ్డి
- సంగీతం : హిప్ హాప్ తమిళ
- విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

స్టోరీ :
సినిమా మహదేవ్ (మమ్ముట్టి) అనే ఒక చీఫ్ తో మొదలవుతుంది. మహదేవ్ ఒక మిషన్ మీద ఉంటారు. గాడ్ (డినో మోరియా) అనే ఒక డాన్ ని పట్టుకోవాలి అనుకుంటారు. దీని కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే సమయంలో రామకృష్ణ (అఖిల్ అక్కినేని) అనే ఒక హ్యాకర్ మహదేవ్ తో కలిసి వారి ఏజెన్సీలో పని చేయడానికి, మహదేవ్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రామకృష్ణ వారితో కలిశాడా? ఆ తర్వాత రామకృష్ణ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? చివరికి వారు అనుకున్న మిషన్ సాధించారా? ఇంతకీ అసలు వారు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
సాధారణంగా యాక్షన్ సినిమాలు అంటే ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులకు అయినా సరే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సినిమా ట్రైలర్ చూశాక అలాంటి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో చాలా గుర్తింపు పొందారు. అంతకుముందు కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా సురేందర్ రెడ్డి సినిమాలు అంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి, అందులో యాక్షన్ చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు.

అది కూడా సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబినేషన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను మార్చుకున్న తీరు కూడా అస్సలు ఊహించలేదు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా కూడా జనాలకి అంత పెద్దగా ఎక్కలేదు. చాలా రొటీన్ సినిమా లాగా అనిపించింది. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా పెద్ద హిట్ కొడతారు అని అనుకున్నారు. సినిమా చాలా వైల్డ్ గా ఉంటుంది అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. చెప్పినట్టుగానే సినిమా నిజంగానే చాలా వైల్డ్ గా ఉంది. హీరో అఖిల్ మేక్ ఓవర్ బాగుంది.

నిజంగా ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు అఖిల్ పడిన కష్టం అంతా కూడా తెరపై కనిపిస్తోంది. అంతకుముందు అఖిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా ఒక రకం అయిన టెంప్లేట్ తో సాగుతాయి. అందులో అఖిల్ అక్కినేని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే సినిమాలు అయిపోయాయి. కానీ ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. లుక్స్ విషయం నుండి, డైలాగ్ చెప్పే విధానం వరకు ఈ సినిమాలో నిజంగానే ఒక కొత్త అఖిల్ కనిపిస్తారు. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అఖిల్ ఇంత హుషారుగా తెరపై కనిపించలేదు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక యాక్షన్ సినిమాకి ఎలా అయితే కావాలో సినిమా వాతావరణం మొత్తం అలాగే ఉంటుంది. అది చూస్తూ ఉంటే సినిమా బృందం ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమా తెరపై చూపించడానికి చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. కానీ కథ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. చాలా రొటీన్ గా ఉంది. సినిమా ముందుకు వెళుతూ ఉంటే కూడా ప్రేక్షకులకు అసలు ఏమవుతుంది అనే ఆసక్తి ఒక్క చోట కూడా కనిపించదు.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ స్టైలిష్ గా ఉన్న సినిమా ఇదే. లొకేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. చూస్తున్నంత సేపు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం ఏమో అనిపిస్తుంది. కానీ వైల్డ్ అని చెప్పి కొన్ని చోట్ల సినిమాలో కొన్ని సీన్స్ ఓవర్ గా రూపొందించారు ఏమో అనిపిస్తుంది. సినిమాకి మరొక పెద్ద మైనస్ పాటల ప్లేస్మెంట్. సినిమా మంచి ఫ్లోలో నడుస్తోంది అనుకునే సమయంలో పాటలు వస్తాయి. అసలు రామకృష్ణ గోవిందా పాట ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. అలాగే వైల్డ్ సాలా పాట లేకపోయినా కూడా అంత పెద్ద తేడా ఏమీ అనిపించదు.

కానీ పాటతో పాటు పక్కన స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. సినిమాకి మరొక హైలైట్ మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటన. ఆ పాత్రకి మమ్ముట్టి చాలా బాగా సరిపోయారు. హీరోయిన్ సాక్షి వైద్య తన పాత్రకి తగ్గట్టు నటించారు. హిందీ హీరో డినో మోరియా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఒక డాన్ పాత్రకి ఎలా అయితే నటించాలో అలాగే నటించారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరొక రకంగా ఉండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- ఫైటింగ్ సీన్స్
- నటీనటుల పర్ఫార్మెన్స్
- లొకేషన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- పాటలు
- ఓవర్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
కథపరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమా చూడాలి, అసలు అఖిల్ అక్కినేని ఈ సినిమాలో ఎలా చేశారు, మమ్ముట్టి కోసం సినిమా చూడాలి అని అనుకునే వారికి ఏజెంట్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :







తేజ్ కి యాక్సిడెంట్ జరిగినపుడు అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేశారు. కిందపడిన తేజ్ ను లేపి, నీళ్లు తాగించాడు. అయితే ఆ సమయంలో అతనికి ప్రమాదం జరిగింది సాయి ధరమ్ తేజ్ కు అని తెలియదంట. మానవత్వంతోనే సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. అయితే తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్ ను తేజ్ కలిశాడని, అలాగే అతనికి ఏ సాయం కావాలన్నా అడగమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతే కాక మెగా కుటుంబం లక్షల రూపాయలు, కారు, బంగ్లా వంటివి బహుమతిగా ఇచ్చారని కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఇటీవల తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ నిజం కాదని, ఎలాంటి రివార్డు కూడా అబ్దుల్ కి ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ అబ్దుల్ కి ఇచ్చానని, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయమన్నానని తెలిపాడు.
ఇదే విషయాన్ని అబ్దుల్ ఫర్హాన్ అడుగగా సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా కుటుంబం కానీ తనకు ఎటువంటి సాయం చేయలేదని అబ్దుల్ అన్నారు. తేజ్ తనను కలవలేదని, ఫోన్ నంబర్ ఇవ్వలేదని, ఈ ఫేక్ ప్రచారాలు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చేసే ఉద్యోగం కూడా వదిలేశానని అన్నాడు.
అప్పట్లో ఒక షాప్ లో వర్క్ చేసేవాడిని, తేజ్ ను కాపాడినందుకు మెగా కుటుంబం డబ్బులు, కారు, బిల్డింగ్ ఇచ్చినట్టు రూమర్స్ రావడంతో షాప్ కు వచ్చిన వారందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా అని బాగా వేధించారని అది తట్టుకోలేక ఆఖరికి ఉద్యోగం మానేశాను. 4 నెలల నుండి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
సమంత అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన అప్పటి నుండి ఆమె ఏం చేసినా? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఆమెకు సంబంధించిన చిన్న విషయం అయిన సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విడాకుల తరువాత ఆమె పెట్టే పోస్ట్ లపై నెటిజన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యింది. ఆమె సామాజిక మధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పై ఎవరైనా కామెంట్ చేసినా, వారికి ధీటుగా కౌంటర్ ఇస్తూనే ఉంది.
ఫ్యామిలీ మ్యాన్, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాటతో బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. యశోద మూవీ షూటింగ్ సమయంలో ఆమె అనారోగ్యానికి గురి అయిన విషయం అందరికి తెలిసిందే. అనారోగ్యంతోనే షూటింగ్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి, ఆమె తన తరువాతి సినిమాల పై దృష్టి సారించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్ విషయం పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. గతంలో పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ కోసం సమంత కోటిన్నర పారితోషికం తీసుకుందంట. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 3-4 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక యాడ్ పోస్ట్ చేయడం కోసం ఇంతకు ముందు 8 లక్షలు తీసుకునేదట. ప్రస్తుతం ఆమె యాడ్ పోస్ట్ కి 20 లక్షలకు పెంచిందంట. సమంత ఇన్స్టాగ్రామ్ లో కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయడం కోసం 15- 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ .
కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే గ్రామంలో 1883లో నవంబర్ 3న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి తండ్రి స్పూర్తితో బాబాయి కోడి నారాయణస్వామి వద్ద పెరిగారు. అక్కడ ఉండే ఒక వ్యాయామశాలలో చేరి కుస్తీ నేర్చుకుంటూ దేహధారుడ్యాన్ని పెంచుకునేవాడు. 21 ఏళ్ల వయసులోనే చెస్ట్ పై 1 1/2 టన్నుల బరువును మోసేవారు. ఆ తరువాత మూడు టన్నుల బరువు కూడా మోసేవారు.
మద్రాసులో ఒక కాలేజిలో ఏడాది వ్యాయామశాలలో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ అందుకుని వ్యాయామ ఉపాధ్యాయుడుగా తాను చదివిన విజయనగరంలో హైస్కూలులోనే చేరారు. అక్కడే తన మిత్రుడు పొట్టి పంతులు సహాయంతో సర్కస్ కంపెనీ పెట్టారు. తుని రాజాగారి సహకారం కూడా లభించింది. రామమూర్తి సర్కస్ కంపెనీ చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
1912లో మద్రాసుకు చేరుకున్నారు. చైనా, జపాన్ కళాకారుల సహకారంతో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంది. వీటిలో భాగంగా రామ్మూర్తి గట్టిగా గాలి పీల్చుకుని కండలను బిగించి, ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను సైతం తెంచేవారు. ఆయన తన చెస్ట్ పై ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాల పాటు అలాగే ఉండేవారు. ఆయన 2 కార్లను తాళ్ళతో కట్టి 2 చేతులుతో పట్టుకుని వాటిని కదలకుండా ఆపేవారు. అంతే కాకుండా ఒక్క చేత్తోనే రైల్ ఇంజను ఆపేవాడు. ఆ రోజుల్లోనే లండన్ కు వెళ్లి అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ లో కుస్తీ పోటీలో సత్తా చాటాడు.
అప్పుడే బ్రిటిష్ రాణి రామ్మూర్తికి ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన జీవితంలో ఎన్నో బిరుదులు అందుకున్నారు. అంత గొప్ప మల్లయుద్ధ యోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథ పై త్వరలోనే ఒక సినిమా రానుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 మూవీ కోడి రామ్మూర్తి బయోపిక్ ఆని సమాచారం.
గోపీచంద్ , శ్రీవాస్ కలయికలో వస్తున్న 3వ చిత్రం ఇది. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో మొదలుపెట్టింది. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. డైరెక్టర్ శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే సెన్సార్ సభ్యులు తమ చిత్రాన్ని ప్రశంసించారని కూడా తెలిపారు.
ఈ చిత్రంలో ఎలాంటి కట్స్ కానీ మ్యూట్ కానీ చేయకుండా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఈ మూవీని చూసిన తరువాత సెన్సార్ సభ్యులు తనని, కో ప్రొడ్యూసర్ వివేక్ ని పిలిచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారని, కట్ చేసే అడియొకని, వీడియో కానీ లేవని చెప్పి అభినందించారని పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిపారని రాసుకొచ్చారు. అలాగే సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
మే 5న మా సినిమా విడుదల అయినప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా అనుభూతి చెంది మా ‘రామబాణం’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి కుష్బూ కీలక రోల్ లో నటిస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ డైరెక్టర్ తేజతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మూవీ సాధించే వసూళ్ల ఆధారంగా గోపీచంద్ నెక్స్ట్ చేసే చిత్రాల బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది.
టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
ఇటీవల హైదరాబాద్కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే పాన్-ఇండియా సినిమాలతో భారతీయ చిత్రసీమలో స్టార్ హీరోయిన్. పూజా హెగ్డే సినిమాల నుండి, ఎండార్స్మెంట్ల నుండి భారీగా సంపాదీస్తోంది. పూజా హెగ్డే ఆస్తుల విలువ సుమారుగా 50 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు, హ్యాండ్బ్యాగులు సేకరించే అభిరుచి ఉంది.ఇక పూజా హెగ్డే లగ్జీరియస్ లైఫ్ గురించి, ఆమె దగ్గరున్న విలువైన 9 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇక్కడ చూద్దాం..
2. హైదరాబాద్లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు తీసుకుంది.
3. ముంబైలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్మెంట్ తీసుకుంది.దీని విలువ రూ. 6-8 కోట్లు
5. బుట్టబొమ్మ వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350d కారు ఉంది.
6. ఆమె దగ్గరున్న ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షలు.
7. పూజా హెగ్డే దగ్గర క్రిస్టియన్ డియర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ విలువ రూ. 1.3 లక్షలు
8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ. 1.4 లక్షలు.
9. లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 1.91 లక్షలు