వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే 2007 లో విడుదల అయింది. శ్రీ రామ్, కోట శ్రీనివాసరావు, సునీల్ ఈ చిత్రంలో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసారు. ఈ చిత్రానికి టైటిల్ మిస్సమ్మ సినిమాలో పాట ఆధారంగా తీసుకురావడం జరిగింది.
సెల్వరాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమాకు మూడు నంది అవార్డులు కూడా వచ్చాయి.

ఒక ఫిలింఫేర్ అవార్డును కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే త్రిషకి చెల్లెలుగా ఈ సినిమాలో స్వాతి మరియు మరొక యాంకర్ నటించారు. మరి ఆ యాంకర్ ఎవరో మీకు గుర్తున్నారా..? ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాలో త్రిషకు చెల్లెలుగా స్వాతి కాకుండా హరితేజ నటించారు.

హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరితేజ అందరికీ సుపరిచితమే. తెలుగు టెలివిజన్ రంగంలో కొన్ని సీరియల్స్ లో హరితేజ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సీరియల్స్ మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా ఫేమస్ అయిపోయారు హరితేజ. హరితేజ సూపర్ సింగర్, ఫిదా, పండగ చేస్కో వంటి షోలకు యాంకరింగ్ కూడా చేశారు. కొన్ని సినిమాల్లో కూడా ఈమె నటించారు. దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, దమ్ము, 1 నేనొక్కడినే, విన్నర్, అందరి బంధువయా వంటి సినిమాల్లో కూడా హరితేజ నటించడం జరిగింది.

ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోలు సీమంతం వేడుకలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులు అందరూ కూడా ఆమెకి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హరితేజ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూనే వున్నారు. అయితే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లో హరితేజ త్రిషకి చెల్లెలి పాత్రలో నటించారు. పైగా రోజూ త్రిష వెనకనే ఉంటున్నానని ఆమె సరదా పడే వారట. ఆ విషయాన్ని స్టేజ్ మీద హరితేజ స్వయంగా త్రిష ముందు చెప్పారు.







నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.
సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.



















