ఒక్క అడుగు.. చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఆర్ఆర్ఆర్ . సినీ ప్రియులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూసిన ఆస్కార్ తుది నామినేషన్ల లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్టులో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట నిలిచింది. ఇప్పుడు యావత్ భారత ప్రేక్షకుల దృష్టంతా దీనిపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ లభిస్తే.. దేశంలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది తెలుగు సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇటీవలే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.
చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా.. కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించి చరిత్ర సృష్టించారు రాజమౌళి. యంగ్ టైగర్ ను కొమురం భీమ్ గా మెగా పవర్ స్టార్ ను మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా చూపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జక్కన్న. ఈ సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ టీం ఎంతో కష్టపడింది. దానికి ఫలితమే ఇంతటి ఖ్యాతి. ఈ సాంగ్ ని ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. ఈ సాంగ్ లో వెనుక కనిపించేది ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం.

కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నాటు నాటు పాట పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి దాదాపు 19 నెలలు పట్టింది. ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమరక్షిత్ ని ఎన్నుకున్నారు. ఇక ప్రేమ్ రక్షిత్ ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశాడు. తారక్, చరణ్‌లు భుజాలపై చేతులేసుకుని వేసిన హూక్ స్టెప్ కోసం ఏకంగా 30 వెర్షన్లు రెడీ చేశాడు.

అయితే ఈ సాంగ్ ఈ స్థాయికి రావడం పై అందరూ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లనే పొగుడుతున్నారు. ఏవైనా అవార్డు లు అందుకోవడానికి కూడా రాజమౌళి, కీరవాణి ముందు వరుసలో ఉంటున్నారు. కానీ ఈ ప్రశంసల్లో ముందుగా పాత రచయిత చంద్రబోస్ కి, కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ కి, సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ని, ముఖ్యం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత , ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లేంత వరకు అండగా నిలిచిన నిర్మాత డివివి దానయ్య గారిని అందరూ విస్మరిస్తున్నారు.

వారిని అన్ని మీడియా చానెళ్లు, ముఖ్యంగా సినిమా టీం కూడా వీరిని విస్మరించడం సరైన విషయం కాదు. అంత పెద్ద టీం సాన్ ఫ్రాన్సిస్కో కి వెళ్లారు కదా వీరికి మాత్రం ఆ అవకాశం ఎందుకు దొరకలేదు అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా.. ఆస్కార్ నామినేషన్లలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో 15 పాటలను ఎంపిక చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. వాటిలోనే మన నాటు నాటు పాట కూడా ఒకటి. మార్చి 13, 2023న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.



స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా విలన్ గా భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్.జె సూర్య అద్భుతంగా నటించారు.
ఈ అబ్బాయి పేరు సంజయ్. శ్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత అతన్ని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ తరువాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు. మాగముని, జాక్ పాట్, గజినీకాంత్, ఎచ్చరిక్కై తుగ్లక్, దర్బార్ వంటి సినిమాలలో నటించాడు.
సంజయ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోను సంజయ్ యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు.
1949వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు 18 ఫిబ్రవరిన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగేశ్వరరావు తన వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ జంట తమ 78 సంవత్సరాల ప్రయాణంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో తమ వైవాహిక జీవితం ద్వారా చూపించారు. వీరికి ఐదుగురు పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మాయాబజార్, బ్రతుకు వీధి, సంసారం, ఆరాధన, దొంగ రాముడు, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, మాంగల్య బలం, శాంతినివాసం, భార్య భర్తలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, బాటసారి, ధర్మదాత, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను తెలుగు సినిపరిశ్రమకి అందించారు
1970ల లో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకు రావటంలో ముఖ్య పాత్రను పోషించారు. 1976వ సంవత్సరంలో తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి తెలుగు సినిమాకు మౌలిక సదుపాయాలను అందించారు. అక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు.

















ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.


