ప్రభాస్, కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోందని నేషనల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది. ఇక కృతి సనన్ ఇప్పుడు వరుణ్ ధావన్ భేడియా (తెలుగులో తోడేలు) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పరోక్షంగా ప్రభాస్ మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే తామిద్దరి మధ్య ఏమి లేదని కృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అయితే ఈ విషయం పై తాజాగా ప్రముఖ రివ్యూయర్, క్రిటిక్ అయిన ఉమైర్ సంధూ కూడా ట్వీట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు మండి పడుతున్నారు. ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తుంటాడు. తాజాగా ప్రభాస్-కృతి బంధంపై కూడా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

“మీ బంధాన్ని ఎందుకు దాస్తున్నావ్ కృతి సనన్..?? ధైర్యం ఉంటే అందరి ముందు ఒప్పుకో..” అని ఉమైర్ తాజా గా ట్వీట్ చేసాడు. గతంలో కూడా ఉమైర్ సందు వీరిద్దరి బంధం గురించి పలు ట్వీట్ లు చేసాడు. “అధికారికంగా చెబుతున్నాను.. ఆదిపురుష్ షూటింగ్ లో కృతిసనన్ కు ప్రభాస్ యే లవ్ ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే నిశ్చితార్థం” అంటూ రెండు హార్ట్ ఎమోజీలను గతం లో షేర్ చేశాడు.

అయితే ఇది ఫేక్ న్యూస్ అని ప్రభాస్ అభిమానులు ఉమైర్ సంధుని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కృతి సనన్ కూడా అలాంటిదేమి లేదని చెప్పడంతో ఉమైర్ ఆమెను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసాడు. అయితే దాదాపు రెండున్నర నెలల కిందట అందరికన్నా ముందు ప్రభాస్- కృతి రిలేషన్ లో ఉన్నారంటూ ట్వీట్ చేసిన మొదటి వ్యక్తి ఉమైర్ సందు నే కావటం విశేషం.




కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.

కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.

అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.

ఇప్పటికే మహేష్‌బాబు,త్రివిక్రమ్‌ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్‌కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్‌బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
