Jai Balayya Song: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి. తాజాగా ఈ మూవీ నుండి జై బాలయ్య సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ పాటలో తమన్ వెరైటీ డ్రెస్ లో కనిపించారు. దీంతో తమన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్‌లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.
Filmy Adda
అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వం లో ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 .
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ఈ సినిమా రన్‌టైం రెండు గంటలు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో ఏ సినిమా రాలేదు. థ్రిల్లర్ సినిమాలకు ఈ రన్‌టైం ఉంటే చాలా వరకు ప్లస్ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలోనే ఈ చిత్రం చిన్న పిల్లలకి చూడడానికి లేదని స్ట్రిక్ట్ గా పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతో ఉంచుతుందని ఇన్సైడ్ టాక్. సినిమాలో విలన్ ని ఎక్సపోజ్ చేసే సీన్ చాలా అద్భుతం గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు దర్శకుడిని అభినందించినట్లు సమాచారం. అంతే కాకుండా క్లైమాక్స్ లో అడివి శేష్ నటన సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది తెలుస్తోంది. చివరిగా హిట్ 3 గురించి దర్శకుడు క్లూ వదిలాడని టాక్.

ఈ చిత్రం లో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. రావురమేష్, కోమలి ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంత్ తిపిరినేనితో కలిసి హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో సినిమా ఎలా ఉండబోతోంది అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు అవ్వాల్సిందే.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ఆ సినిమాలో సీతామహాలక్ష్మీగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్గా మృణాల్ తన నటనతో ఫిదా చేశారు.
అయితే తాజాగా ముంబై లో జరిగిన ఒక ఫాషన్ ఈవెంట్ లో మృణాల్ పాల్గొని సందడి చేసారు. ఈ ఈవెంట్ లో మృణాల్ బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. ఈ లుక్ తో పాటు ఆమె తన హెయిర్ స్టైల్ ని కూడా మార్చడంతో.. ఒక్క సారిగా ఈమె సీతారామం లోని సీత ఏ నా అన్న సందేహం కలుగుతోంది. ఈ లుక్ పై కొందరు ప్రసంశలు కురిపిస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

అయితే సీతారామం తెచ్చిన క్రేజ్ తో మృణాల్ సౌత్ లో ఫేమస్ అయిపోయింది. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ పెరిగిపోయారు. అయితే సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా హాటుగా, ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.. ఇదేంటీ.. ఇలా ఫోటోలు ఏంటీ.. అని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఫోటోలతో మృణాల్ పరువు పోగొట్టుకుంటోందని మరికొందరు అంటున్నారు.

ఇక ఈ భామ నటించిన సీతా రామం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమెకు ఆఫర్లు బాగా పెరిగినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు మృణాల్ ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు.
ఎట్టకేలకు ఓటీటీ లోకి “నితిన్” ‘మాచర్ల నియోజకవర్గం’..!! ఎప్పుడు వస్తుందంటే..??
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొన్నటి వరకు లవ్‌స్టోరీ సినిమాలు తీసే నితిన్.. ఈ సారి తన జానర్‌కు భిన్నంగా పూర్తి స్థాయి సీరియస్ కథతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.
ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మాచర్ల నియోజకవర్గం వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్ మోస్ట్ 950 వరకు థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ-5’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.

ప్రస్తుతం నితిన్ ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్‌కు ఇప్పటివరకు మరో హిట్ లేదు. ఇక నితిన్ తన నెక్ట్స్ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. చేతి నిండా బిగ్ ప్రాజెక్టులతో ఉన్నాడు. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ నటిస్తోంది. అయితే ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వీరి డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసింది. వీరిద్దరినీ అలా చూసిన ఫ్యాన్స్.. జంట చూడముచ్చటగా ఉంది అంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి ఈ జంట చర్చల్లో నిలిచింది. ప్రస్తుతం వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి బేడియా సినిమాలో నటించారు. ఆ సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్‌కి కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్.. ముగ్గురు హీరోలను ఆప్షన్‌గా ఇచ్చి వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు.. ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు అని అడిగారు. దానికి కృతి కార్తీక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్ చేస్తానని, టైగర్ ష్రాప్‌తో డేట్‌కి వెళతానని, ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

ఇంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ ట్రాక్ నడిచిందని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆది పురుష్ తర్వాత ప్రభాస్, కృతి సనన్ మధ్య లవ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా.. టీజర్లో కృతి, ప్రభాస్ కనిపించిన సీన్‌పై మాత్రం చాలా మంది మనసు పారేసుకున్నారు. ఆ విజువల్ చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు. ప్రభాస్, కృతి జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకి రానుంది.
సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్… అయినా కూడా 2023 కి సాలిడ్ ప్లాన్..? “కిరణ్ అబ్బవరం” స్ట్రాటజీ మామూలుగా లేదుగా..?
రాజా వారు రాణి గారు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో గ్యాప్ లేకుండా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా కిరణ్ అబ్బవరం ఇదే జోష్ కొనసాగిస్తాడని సమాచారం.
2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశాడు కిరణ్ అబ్బవరం.అమాయకత్వంతో కూడిన తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు.ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2021 లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ కిరణ్ అబ్బవరం రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. కరోనా టైంలో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించారు దర్శక నిర్మాతలు. అయితే సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ సినిమా సక్సెస్ అందుకుని థియేటర్లకు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమాగా నిలిచింది.

టాలెంట్ అనేది ఉంటే ఏరంగంలోనైనా నిలదొక్కుకోవచ్చు. అయితే సినిమా రంగంలో టాలెంట్ పాటు లక్ కూడా కావాలి. కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసి, ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు.కిరణ్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా సినిమాల విడుదల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.ఈ యంగ్ హీరో వరుస సినిమాలను విడుదల చేస్తునే ఉన్నాడు.
ఈ ఏడాది లో మూడు చిత్రాలను విడుదల చేశాడు. తన మూడో సినిమా కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ గా ‘సెబాస్టియన్ పిసి 524’తో వచ్చాడు. ఈ సినిమాలో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసు పాత్రలో నటించాడు.ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అవలేదు. ఆ తరువాత మే 24న‘సమ్మతమే’ విడుదలై హిట్ అయ్యింది. సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా నిలిచింది.

అయినా కూడా కిరణ్ జోష్ ఏమాత్రం తగ్గలేదు. హిట్టు, ఫ్లాప్ లను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుండటంతో అతని చేతినిండా సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్, గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లతో త్వరలో సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలాగే వచ్చే ఏడాది (2023)లోనూ కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఒకటో, రెండు హిట్ అయినా ఈ హీరోకి స్టార్ స్టేటస్ దక్కుతుంది.
Tollywood: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రాల తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమా స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఏడాది మార్చిలో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ సందడి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్‌గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్‌లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
“అమ్మడు లెట్స్ డు కుమ్ముడు, బాస్ పార్టీ” లాగానే… ముందు “ట్రోల్” అయ్యి తర్వాత సూపర్ హిట్ అయిన 13 తెలుగు పాటలు..!
సినిమాకు ‘సంగీతం సగం బలం’ అంటారు మన పెద్దలు. పాటలు బాగుంటే సినిమాలు కూడా బాగానే ఉంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కొన్ని సినిమాలను పాటల కోసమే చూస్తారు ప్రేక్షకులు. అలాగే పాటలు హిట్ కాకపోతే సినిమా ఫలితం ఆశించినంతగా ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో పాటలపై, సింగెర్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు మేకర్స్.
చిత్ర రిలీజ్ కి ముందు నుంచే పాటల టీజర్లు అంటూ ఆడియన్స్ లో హైప్ పెంచుతుంటారు. అయితే కొన్ని పాటలు మాత్రం రిలీజ్ అయినప్పుడు యావరేజ్ గా అనిపించి.. ఫైనల్ గా మాత్రం సూపర్ హిట్స్ అవుతాయి. అలాంటి పాటలేవో ఇప్పడు చూద్దాం..
#1 ఊ అంటావా మావ..
సుకుమార్ దర్శకత్వం లో అల్లుఅర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఇందులో సమంత ఒక ప్రత్యేక గీతం లో నటించింది. దీంతో ఈ పాటకి చాలా హైప్ వచ్చేసింది. కానీ ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. విపరీతం గా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా సూపర్ హిట్ గా నిలిచింది.
#2 బాస్ పార్టీ
మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం నుంచి ‘బాస్ పార్టీ’ ప్రోమో వదిలారు. ఈ పాటకు దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు. అయితే ప్రోమో రాగానే నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ స్టార్ట్ చేసారు. అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ కాగానే అందరి నోళ్లు మూతబడ్డాయి. ప్రస్తుతం ‘బాస్ పార్టీ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
#3 అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’. దాదాపు 10 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత డాన్సింగ్‌లో అదే జోరును చూపించారు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మి పడేసారు చిరంజీవి. అయితే మొదట ఈ పాట రిలీజ్ అయినపుడు అసలు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ కట్ చేస్తే పాట్లతో పాటు మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#4 శివాజీ మూవీ సాంగ్స్
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన శివాజీ మూవీ లో సాంగ్స్ అన్నీ.. చాలా స్లో గా .. అవుట్ ఆఫ్ రజని స్టైల్ లో ఉంటాయి. కానీ ఇప్పటికీ ఆ పాటలు సూపర్ హిట్టే..
#5 మైండ్ బ్లాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ గతంలో ఎన్నడూ చేయనంత మాస్ సాంగ్‌ను ఆడియన్స్‌కు చూపించాలని అనిల్ ట్రై చేసి ‘మైండ్ బ్లాక్’ సాంగ్ చేసారు. అయితే దీనిపై ఆడియన్స్ నిరుత్సాహం వ్యక్తం చేసారు. ఇదేం సాంగ్ అంటూ.. దేవి శ్రీ ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. కానీ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
#6 సామి సామి..
పుష్ప లో వచ్చిన మరో సూపర్ హిట్ పాట సామి సామి.. అయితే ఈ సాంగ్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ వేరే సాంగ్స్ నుంచి ట్యూన్స్ కాపీ చేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేసారు.
#7 పైసా వసూల్..
ఈ వయసులో కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా పైసా వసూల్ సాంగ్ కి డాన్స్ చేశారు బాలయ్య. అయితే ఈ సాంగ్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ సూపర్ హిట్ అయ్యింది.
#8 నాథ్ నాథ్..
బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ పాటపై కూడా మొదట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి.. కానీ అల్లు అర్జున్, తమన్నాల గ్రేస్ డాన్స్ తో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
#9 అరబిక్ కుతూ..
బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ ఎంత సూపర్ హిట్టో చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. అవి కాస్తా తెలుగులోకి వచ్చేసరికి చాలా ట్రోలింగ్ జరిగింది.
#10 కిలిమంజారో
రోబో సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన పాట కిలి మంజారో.. అయితే ఈ పాట లిరిక్స్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ.. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్.
#11 బ్లాక్ బస్టర్..
సరైనోడు సినిమాలోని మాస్ సాంగ్ బ్లాక్ బస్టర్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ పై అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ ఇది సూపర్ హిట్ అయ్యింది.
#12 మహేశా..
మహేష్ ని మరో సారి మాస్ అప్పీల్ లో చూపించిన సాంగ్ మహేశా..సర్కారు వారి పాటలోని ఈ పాట పై కూడా మొదట్లో నెగటివ్ ట్రోల్స్ వచ్చినా.. సూపర్ హిట్ అయ్యింది.
#13 ఇనుములో హృదయం..
రోబో సినిమాలోని మరో పాట ఇది. దీనిలో లిరిక్స్ వెరైటీ గా ఉన్నాయంటూ ట్రోల్స్ చేసారు కానీ హిట్ అయ్యింది ఈ సాంగ్..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేశారు. అయితే ఇదే వీడియోలో కనిపించిన రాజీవ్ కనకాల పై మీమ్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
వీరసింహారెడ్డి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్ టీజర్ ఇతర ప్రత్యేకమైన పోస్టర్లకు మంచి స్పందన లభించింది.ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

ఈ సాంగ్ లో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. పాట హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగుతుంది. ఈ పాటతో బాలయ్య అభిమానుల సంతోషం పడుతున్నారు. లీడర్ గా వైట్ అండ్ వైట్‌లో బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటున్నారు.ముఖ్యంగా ఈ పాటకు సంగీతాన్ని అందించిన తమన్ కూడా ఈ వీడియోలో బాగానే ఆకట్టుకున్నారు.అయితే ఇదే వీడియోలో కనిపించిన రాజీవ్ కనకాల పై మీమ్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

రాజీవ్ కనకాల జై బాలయ్య వీడియోలో కనిపించడంతో రకరకాల మీమ్స్ నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. ఎందుకంటే రాజీవ్ నటించిన చాలా సినిమాలలో పాట అవగానే ఫైట్ సీన్లలో విలన్ ఆ పాత్రను చంపడం గాని, మరేదైనా కారణంతో అతని పాత్ర ఆ సినిమాలో ముగిసిపోతుంది. ఆ పాత్రని చంపడానికే పెడుతారా అన్నంతగా రాజీవ్ కనకాల పై మీమ్స్ పెడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు వీరసింహారెడ్డిని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు.ఇందులో కన్నడ నటుడు విజయ్ దునియా విలన్ గా నటిస్తూ ఉన్నారు.అంతేకాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కూడా ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మలచలేకపోయింది.
ది లెజెండ్’ మూవీ జూలై 28 న రిలీజ్ అయ్యింది. ఇదేమీ సూపర్ హిట్ మూవీ కాదు. కానీ ఈ మూవీ ఇంకా ట్రెండింగ్ లో ఉండటానికి కారణం మాత్రం ఈ చిత్రం హీరో మరియు శరవణ స్టోర్స్ అధినేత అయిన అరుళ్ శరవణన్. 51 ఏళ్ల వయసులో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘శరవణ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి మరీ రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ పాన్ ఇండియా సినిమాని తీశాడు.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.25 కోట్లు కూడా చేయలేకపోయింది. కేవలం తన శరవణన్ స్టోర్స్ ప్రమోషన్ కోసం మాత్రమే అతను హీరోగా మారి ఈ సినిమా తీసినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమాకి ఇదివరకే ఓటీటీ కోసం భారీ ఆఫర్స్ రాగా అరుళ్ ఆసక్తి చూపలేదు. అయితే ఫైనల్ గా అతను ‘ది లెజెండ్’ ను ఓటీటీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు శరవణన్ అరుళ్. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట.
