ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది.
ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..? సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది. ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే.
ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం. ఓ సినిమా ఈవెంట్ లో సిరివెన్నెల గారి గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ మాట అంటారు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అని.. ఆయన రాసిన పాటలని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. పేరులో వెన్నెల ఉన్నా.. ఆయన అక్షరాలు మాత్రం ఉత్సాహాన్ని నింపే అగ్నికణాల్లా మండుతాయి.. ఆయన రాసిన ప్రతి పాట సాహితి ప్రపంచంలో ఆణిముత్యమే.
సిరివెన్నెలకు ఒక్కటే దురలవాటు ఉంది. అది సిగరెట్ కాల్చడం. దానివల్లనే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈ అలవాటు గురించి ఆయన ఓపెన్ హార్ట్ విత్ RK లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పుకున్నారు. నాకు సహజంగానే అహంకారం ఉందని.. ఇంత అహంకారం ఉండి కూడా సిగరెట్ ముందు తల వంచుతున్నానని.. మానుకోలేకపోతున్నానని ఆయన చెప్పుకున్నారు.
ఈ మాటలు వింటుంటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆయన కొంచం కష్టపడి ఈ అలవాటుని మానుకుని ఉండి ఉంటె.. ఈరోజు ఆయన మన మధ్య భౌతికంగా ఉండగలిగేవారేమో. పిల్లలకు కూడా ఈ విషయం గురించి చెప్పేవారట. చిన్నపిల్లల ముందు, పబ్లిక్ ప్లేసెస్ లోను సిగరెట్ తాగకూడదు అని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Watch Video:








#2
#3
#5
#6
#7
#9
#10
#11
#13
#14
#16







