సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సినిమాకి ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటించారు.
ఈ మధ్య తెలుగు అమ్మాయిలకి మంచి అవకాశాలు వస్తున్నాయి. శివాని కూడా తెలుగు అమ్మాయే కావడం విశేషం. ఈ సినిమా గురించి శివాని మీడియాతో మాట్లాడారు. సినిమా చూసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నాను అని అన్నారు.

“ఇంస్టాగ్రామ్ లో ఆడిషన్స్ కి రమ్మని ఒక మెసేజ్ పెట్టారు. ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా ఇంకొక క్యారెక్టర్ అనుకోని ఆడిషన్స్ కి వెళ్ళాను. ఆడిషన్ చేశాక వివరాలు తర్వాత చెప్తాము అని అన్నారు. ఆ తర్వాత కాల్ చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో హీరోయిన్ నేనే అని చెప్పారు. ఈ విషయం నాకు నమ్మబుద్ధి కాలేదు. షూటింగ్ సెట్స్ కి వెళ్ళాక కూడా అలాగే అనిపించేది. కానీ ఆ తర్వాత సినిమా బృందం హీరోయిన్ నేనే అని చెప్పి సీన్స్ షూట్ చేశాక నాకు నమ్మకం కుదిరింది” అని శివాని చెప్పారు. దుష్యంత్ కాటికనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ కూడా మరొక ముఖ్య పాత్రలో నటించారు. గోపరాజు రమణ కూడా ఈ సినిమాలో నటించారు. ఒక ఊరిలో జరిగే ఒక యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. అతని ప్రేమకథ ఎలా ఉంటుంది? ఆ ఊరిలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే స్టోరీ మీద ఈ సినిమా నడుస్తుంది.

సినిమాలో ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్ కూడా ఉంటాయి అని దర్శకుడు చెప్పారు. ఇటీవల గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే కనిపిస్తోంది. ట్రైలర్ లో ఉన్న సీన్స్ చూస్తూ ఉంటే సినిమా చాలా సహజంగా తీశారు అని అర్థం అవుతోంది. ఇంకా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని ఎంతవరకు అందుకుంటుందో తెలియాలి అంటే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
ALSO READ : అప్పుడు RGVని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఇప్పుడు ఎంపీగా పోటీ… వైసీపీ ప్లానింగ్ మాములుగా లేదుగా?







ఇక కథ విషయానికి వస్తే, అనుపమ(ప్రియమణి) అమాయకపు గృహిణి. ఆమె ఒక అపార్ట్మెంట్ లో భర్త మోహన్, కొడుకు వరుణ్‌తో కలిసి నివసిస్తుంటుంది. యూట్యూబ్‌లో సొంత కుకింగ్ ఛానెల్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఇతరుల ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ కిటికీలోంచి ఇతరులను గమనిస్తూ, అపార్ట్మెంట్ లో పనిచేసే పనిమనిషి శిల్ప నుండి వారి విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరుకారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలోని టైటిల్ సాంగ్ ధమ్ మసాలా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి, ఆకట్టుకుంటోంది. ఈ పాటలో మహేష్ బాబు పక్కన స్టెప్స్ వేసిన ఒక సైడ్ డ్యాన్సర్ హైలైట్ అయ్యింది.
ఆ అమ్మాయి ఎవరా అని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఫల్గుణి బంగేరా. ఆమె డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె ఒమన్‌లో పుట్టి పెరిగింది. ఫాల్గుణి తన కెరీర్ ను కొనసాగించడానికి ఇండియాకి వచ్చారు. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షోలు అయిన ఢీ 10, ఆట 6 జూనియర్స్ లో ఉన్న కొరియోగ్రాఫర్లలో ఆమె కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోల పాటలకు పని చేసింది. టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్‌తో కలిసి ఫల్గుణి కొరియోగ్రఫీ చేశారు.
వెంకీ మామా, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠపురములో, భీష్మ వంటి సినిమాలకు పనిచేసింది. తమిళ సినిమాలకు కూడా ఫల్గుణి వర్క్ చేసింది. ఎన్నో పాటల్లో కనిపించింది. ఆమె సినిమాల్లో పనిచేయడమే కాకుండా ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా తీసుకుంటుంది. ఆమె యశ్వంత్ మాస్టర్ తో కలిసి అనేక స్టేజ్ షోలు మరియు ప్రత్యేక కార్యక్రమాలలో కనిపించింది. ఆమె ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫల్గుణిని ఇన్ స్టాగ్రామ్ లో 163K ఫాలో అవుతున్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి అభినందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అలీ, సందీప్ రెడ్డి వంగా నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ లు కూడా వెళ్లి చిరంజీవిని అభినందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది.అందులో ‘‘ బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకోవడానికి అర్హులు. ఆయన కరోనా టైమ్ లో చేసిన సేవ ఎనలేనివి. కానీ ఆయనకు ఏ పొలిటికల్ లీడర్ ని కాకాపట్టడం తెలియదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజెన్లు ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. పూనమ్ కౌర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సామాజిక మధ్యమాలలో యాక్టీవ్‌గా ఉంటూ తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె కామెంట్స్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
