ఇటీవలి కాలంలో నీటికి బదులుగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటు పెరిగిపోయింది. ఇక వేసవి కాలంలో చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కూలిడ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరిగించుకునేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ ను అదేపనిగా తాగుతుంటారు. అయితే తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఒక డిఫరెన్స్ గమనించి ఉంటారు. అదే బాటిల్స్ లో ఉండే డ్రింక్స్, క్యాన్స్ లో ఉండే డ్రింక్ టేస్ట్ వేరుగా ఉండటం మనం చూసే ఉంటాం.. ఇప్పుడు దానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
కూల్ డ్రింక్స్ ను సాధారణం గా గాజు బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, లేదా క్యాన్స్ లో ఉండటం మనం చూస్తాం.. అయితే వాటన్నిటిని తయారు చేసే విధానం ఒకటే అయినా.. ఒక్కో దానిలో తాగితే ఒక్కో రుచి ఉంటుంది. అయితే కూల్ డ్రింక్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో నింపినపుడు.. ప్లాస్టిక్ లో ఉండే ఎసిటాల్డిహైడ్ అనే రసాయనం వల్ల డ్రింక్ టేస్ట్ మారుతుంది. ఆ రసాయనం కూల్ డ్రింక్స్ లోకి వెళ్లడంతో వేరే రుచి వస్తుంది.

అదే విధంగా అల్యూమినియం క్యాన్ లలో కూడా జరుగుతుంది. అల్యూమినియం క్యాన్స్ లో ఒక వాటర్ రెసిస్టెంట్ పాలిమర్ తో పూత పూస్తారు. దీని వల్ల అల్యూమినియం, డ్రింక్ కలవకుండా ఉంటాయి. అలాగే ఆ పాలిమర్ అల్యూమినియం టిన్ తుప్పు పట్టకుండా చూస్తుంది. ఈ పాలిమర్ పూత వల్ల క్యాన్స్ లో కూల్ డ్రింక్ టేస్ట్ వేరే గా ఉంటుంది.

అయితే మనం కూల్ డ్రింక్స్ అసలు టేస్ట్ రుచి చూడాలి అనుకుంటే గాజు సీసాల్లో తాగటం ఉత్తమ పద్ధతి. గాజు సీసాల్లో కూల్ డ్రింక్ పొయ్యడం వల్ల ఎటువంటి రసాయనాలు ఆ పానీయం లోకి వెళ్లవు. కాబట్టి దాని ఒరిజినల్ టేస్ట్ కి అది దగ్గరగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని పరిస్థితుల్లో కూల్ డ్రింక్ టేస్ట్ మారే అవకాశం ఉంది. బాటిల్స్‌పై బెస్ట్-బై లేదా ఫ్రెష్‌నెస్ తేదీలు ఉన్నప్పటికీ.. కూల్ డ్రింక్ స్టోర్ చేసిన టెంపరతురే ని బట్టి దాని టేస్ట్ మారుతుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంది డ్రింక్, లేదా తాజా డ్రింక్ కూడా వేర్వేరు రుచులని కలిగి ఉంటాయి.

అయితే కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కూల్డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కూల్ డ్రింక్ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్లు 30% పెరగుతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి. 350మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ లో 35 నుండి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన ఐదు నిమిషాల్లో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహం బారిన పడే అవకాశాలను 67% వరకూ కొని తెచ్చుకున్నట్లే.




ఎంబీఏ చదివినా, అందుకు తగ్గ జాబ్ రాలేదని బాధపడకుండా మానస అనే మహిళ తనకు లభించిన ఉపాధితో పారిశుద్ధ్య కార్మికురాలిగా వర్క్ చేస్తోంది. హన్మకొండ జిల్లా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మానస, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటపుడు బంధువు అయిన దిలీప్ కుమార్ ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె ఎంబీఏను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం సాధించి, మంచి జీవితాన్ని పొందాలనుకున్న మానస లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.
దాంతో ఆమె వెంకటాపూర్ పంచాయితీ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఎనిమిది వేల రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలా ఎంబిఎ చేసిన ఆ భార్యభర్తలు ఇద్దరు పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. మానస తండ్రి చనిపవడంతో, తల్లిని ఒంటరిగా వదిలేయలేక, ఆర్థిక పరిస్థితుల వల్ల సొంత గ్రామాన్ని వదల్లేక, ఇక్కడే ఉండిపోయామని మానస వెల్లడించారు. అక్కడే దొరికిన ఉపాధితో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కు కూడా మానస దరఖాస్తు చేసింది. చాలా కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ, ఆమె పోలీస్ సెలెక్షన్లలో సెలెక్ట్ కాలేదు. ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయానని మానస తెలిపారు. మానస తమ చదువుకు తగిన ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తను చూసిన నెటిజెన్లు ఎంబీఏ చదివి కూడా పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న మానస పై ప్రశంసలు కురిపిస్తున్నారు.























