భారత్ ఎంత అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికి.. ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలను సంతానం గా వద్దు అనుకునే వారు ఉన్నారు. కొందరైతే, ఆడపిల్లలని పుట్టగానే చెత్తబుట్టలో వదిలివేస్తున్నారు. ఇది వినటానికి దారుణంగా ఉన్నా, కఠినమైన వాస్తవం. అయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము లో కూడా ఇలానే ఓ ఆడపిల్లను డస్ట్ బిన్ లో వదిలేస్తే, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పసి పిల్లను చేరదీసి దత్తత తీసుకున్నాడు. ఆమె బాగోగులన్నీ తానే చూసుకున్నాడు.
ఇప్పటి వరకు దీని గురించి బయటప్రపంచానికి అంతగా తెలియదు. రోడ్డు పైన ఉన్న డస్ట్ బిన్ లో ఓ పసిపాప పడి ఏడుస్తుంటే.. ఒక ఎన్జిఓ మరియు కొంతమంది ప్రభుత్వ అధికారులు రక్షించారు. ఈ పాప చాలా బలహీనమైన పరిస్థితిలో ఉందని వారు గుర్తించారు. అయితే, ఈ వార్త పేపర్ లో ప్రచురితం అవడం తో, అది చూసిన మిథున్ చక్రవర్తి చలించిపోయి.. ఆ పాపను తాను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చాడు. మిథున్ భార్య యోగిత కూడా ఈ విషయం లో మిథున్ కు సహకరించారు.
యోగిత కూడా ఆ పిల్లను పెంచడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ రాత్రంతా కష్టపడి పేపర్ వర్క్ ను పూర్తి చేసి, అధికారికం గా దత్తత తీసుకున్నారు. ఆ పాపకు దిశాని అని నామకరణం చేసారు. అప్పటి నుంచి ఆమె ను వారు ఎంతో కేరింగ్ గా ప్రేమ గా పెంచుకుంటున్నారు. యోగిత, మిథున్ లకు మిమోహ్, ఉష్మీ, మరియు నమాషి అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో సమానం గానే దిశాని ని కూడా అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.
దిశాని కూడా యాక్టింగ్ వైపు రావడానికి ఆసక్తిని కనబరుస్తోంది. యాక్టింగ్ పై ఇంటరెస్ట్ తో దిశాని ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంటోంది. కాబట్టి, తొందరలోనే దిశాని కూడా హీరోయిన్ కాబోతోందన్నమాట.