ఈటీవి , జెమిని ,మాటివి ఇవేవి లేని కాలంలో అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లోనే తను మంచి యాంకర్ . సీరియల్స్ , టెలిఫిల్మ్స్ చేస్తూ నటిగాను గుర్తింపు తెచ్చుకుంది తనే అనితా చౌదరి .ఈ కాలం వాళ్లకి పరిచయం తక్కువే ఉన్నా పేరు చివరన ఉన్న పెద్ద కులం తోక తనను ఏం అందలం ఎక్కించలేదని, ఆనాటి చేదు జ్ణాపకాలను ఇటీవల శేర్ చేస్కుంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అనితా చౌదరి అంటే హా సంతోషం సినిమాలో నాగార్జున సిస్టర్ గా నటించింది ఆమె అన్నట్టుగా గుర్తురావొచ్చు కానీ తొంబైల్లో వాళ్లకి మాత్రం తను టాప్ యాంకర్ , మోస్ట్ ఫేవరెట్ సీరియల్ స్టార్. ఒకప్పుడు ఈ టివిలో ప్రసారం అయిన కస్తూరి సీరియల్ అప్పట్లోనే సంచలనం . వరుసగా ఏడు సంవత్సరాలు అనితా చౌదరికి ఉత్తమ నటి అవార్డుని కట్టపెట్టిందంటే మీరే అర్దం చేస్కోండి.
అమృతం ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అమృతం లో హర్శవర్ధన్ కి జోడిగా సంజూ పాత్రలో అలరించింది.కెరీర్ తొలినాళ్లల్లోనే బ్రహ్మనందంతో పాటుగా యాంకర్ కి చేసే అవకాశం దక్కించుకుంది. నటుడు నరేశ్ తో కౌంట్ డౌన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనితా చౌదరి.“వాసంతసమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా… సాగే జీవనరాగం అణువణువున రుతురాగం” తొంభైల్లో ఈ సీరియల్, ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . రుతురాగాల్లో నటించిన అనిత ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మప్పైకి పైగా చిత్రాల్లో నటించింది.
సినిమా ఇండస్ట్రీలో కులం కార్డు ఎంతగా పనిచేస్తుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా కొన్ని వర్గాల చేతుల్లోనే ఇండస్ట్రీ ఉన్న విషయం అందరికి తెలిసిందే. అందులోనూ లేడి , ఉమన్ కార్డుని కూడా బాగానే వాడేసి ఉంటుంది అనుకుంటాం. కానీ తన కులం కానీ, తన పేరులోని చౌదరి కాని తనకెన్నడూ ఉపయోగపడలేదని, చౌదరిని తీసేయాలని ఉన్నా, అప్పటికే ఇండస్ట్రీలో ఎందరో అనితలు ఉండడంతో అనితా చౌదరిగానే ఉండాల్సి వచ్చిందని, . యాంకరింగ్ చేసే తొలిరోజుల్లో తన పరిస్థితి యాంకర్ కి తక్కువ , ఆఫీస్ బాయ్ కి ఎక్కువ అన్నట్టు ఉండేదని ఆనాటి తన పరిస్థితి వివరించారు . కుక్క చాకీరి చేసానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నిజానికి అనితకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి . ఆనాడు తను ఒప్పుకున్నుంటే హీరోయిన్ గానే తనని వెండి తెరపై చూసేవాళ్లం, ఇవివి,శ్రీకాంత్ కాంభినేషన్లో వచ్చిన తాళి సినిమాలో శ్రీకాంత్ సరసన ముందు అనితనే అడిగారట , కానీ ఆర్నెళ్లు షూటింగ్ రాజమండ్రిలో ఉండడంతో క్యాన్సిల్ చేస్కుందట. సినిమా అవకాశాల్ని వద్దనుకునేవాళ్లని నిన్నే చూస్తున్నా అని ఇవివి ఆశ్చర్యపోతే , నవ్వి ఊరుకుందట. దటీజ్ అనితా చౌదరి.