స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, సిబిఐ కోర్టులో హాజరు పరచారు. వాద ప్రతివాదలు విన్న తరువాత సీబీఐ కోర్టు చంద్రబాబు నాయుడికి 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో చద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో చంద్రబాబు తరుపున వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా డిల్లీ నుండి వచ్చారు. ఆయన మరెవరో కాదు సుప్రీంకోర్టు సినియర్ అడ్వకేట్. భారత్ లో టాప్ టెన్ పాపులర్ న్యాయవాదుల్లో సిద్ధార్ధ్ లుథ్రా ఒకరు. ఆయన కేసు వాదించడానికి ఎంత ఫీజు తీసుకున్నారో? ఇప్పుడు చూద్దాం..
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ అంతా భగ్గుమంటోంది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో టిడిపి వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు తరుఫున వాదించడం కోసం సుప్రీం కోర్టు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రాను టిడిపి నియమించింది. అమరావతి లాండ్ కేసులో కూడా లూథ్రా వాదించారు. చందబాబు నాయుడికి సంబంధించి ఇతర కేసులను కూడా లూథ్రానే చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో కూడా విజయవాడ సిబిఐ కోర్టులో లూథ్రా చంద్రబాబు తరుపున వాదించారు. అయితే సిద్దార్ధ్ లూథ్రా దేశంలోనే టాప్ 10 లాయర్ల లో ఒకరు మాత్రమే కాదు. దేశంలో అత్యధిక ఫీజు అందుకునే లాయర్లలో ఒకరు. ఇలాంటి ఖరీదైన లాయర్ ను టిడిపి నియమించుకుంది. ఈ కేసును వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లుథ్రా ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు.
లుథ్రా ఢిల్లీలో కాకుండా వేరే రాష్ట్రాలలో లేదా ప్రాంతాలలో కేసు వాదించడం కోసం రోజుకు ఫీజు రూ. 1.5 కోట్లు తీసుకుంటారని సమాచారం. అంతే కాకుండా లుథ్రా ప్రయాణానికి ప్రత్యేకమైన ఫ్లైట్ మరియు లగ్జరీ కారుతో పాటుగా స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేయాలని తెలుస్తోంది.
Also Read: స్కిల్ డెవలప్మెంట్ కేసులో “లాయర్ లూథ్రా” వేసిన ప్రశ్నలు ఏంటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, 24 గంటలు పూర్తి అయ్యే సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా గంటకు పైగా వాదించారు. ఆయన వాదన మొదలవగానే కోర్టు లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

స్కిల్ డెవలెప్మెంట్ కు సంబంధించి ఏపీలో రూ.241 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థలు రూ.3300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో ఏపీ ప్రభుత్వం 10శాతం నిధులు, 90 శాతం నిధులు సీమెన్స్ సంస్థ చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. ప్రభుత్వం తరపున 10 శాతం నిధులు జీఎస్టీతో సహ రూ.370 కోట్లను చెల్లించింది. అయితే ప్రభుత్వం చెల్లించిన ఈ నిధులలో రూ.240 కోట్లు సీమెన్స్ సంస్థకు కాకుండా వేరే సంస్థకు బదలాయించారు.
చంద్రబాబు ఆర్డర్స్ తో ఈ నిధులు రిలీజ్ అయ్యాయని అభియోగం. స్కిల్‌కి సంబంధించిన పనులు జరగలేదని, ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని ఆరోపణలు. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్లు విదేశాలకు వెళ్లి, సుమారు 70 షెల్ కంపెనీల ద్వారా తిరిగి దేశానికి వచ్చేయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై నాన్‌బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) ల కింద ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం నోటీసులు ఇచ్చింది.
అరెస్ట్‌కు సంబంధించిన పత్రాలను చంద్రబాబుకు, ఆయన లాయర్లకు ఇచ్చిన తరువాతే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని అంటున్నారు. చంద్రబాబు తన అరెస్టు పై స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తుంటే అణిచివేస్తున్నారన్నారు. ఏ తప్పు చేశానో కూడా చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని ఆర్కే బీచ్ లోని ముప్పై ఐదు కిలోమీటర్ల సాగరతీరంలోని ఇసుక ఎప్పుడు బంగారు రంగులో మెరిసిపోతూ టూరిస్తులను, స్థానికులు ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఇసుకతిన్నెల పై ఎంజాయ్ చేసేవారికి గురువారం నాడు షాక్ తగిలింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆర్కే బీచ్ లోని ఇసుక ప్రస్తుతం నలుపురంగులో కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ మరియు వుడా పార్క్ నడుమ ఉండే సముద్రతీరం నల్లగా మారింది. దాంతో విశాఖ ప్రజలు అక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనలో మునిగిపోయారు.
ఆర్కే సముద్రతీరంలో బంగారు వర్ణంలోని ఇసుక నల్లగా మారిపోవడం ఎప్పుడూ చూడని విశాఖ ప్రజలు సముద్రతీరానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. స్థానికులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇసుక నల్లగా మారపోవడం ఇప్పటి దాకా ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు మాట్లాడుతూ ఇసుకలో ఉన్న లైట్ మరియు హెవీ మినరల్స్ సపరేట్ కావడం వల్లే ఇసుక నల్లగా మారింది చెబుతున్నారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా అలల ఉధృతి పెరిగిన సమయంలో తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటిలో కలిసి సముద్రంలో కలుస్తాయని, అయితే హెవీ మినరల్స్ మాత్రం బీచ్ లోనే ఉండిపోతాయని అంటున్నారు. హేవిగా ఉండే మినరల్స్‌లో అధికంగా ఇలమనైట్, జింకాన్, గార్నెట్, రుటైల్, సిలిమినైట్ లాంటివి ఉంటాయని చెబుతున్నారు. ఇసుక నల్లగా మారడానికి ముఖ్యంగా ఇలమనైట్, రుటైల్ లాంటి బరువున్న మినరల్స్ లే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు హెవీ మినరల్స్ నల్లని రంగులో ఉంటాయని అందువల్లనే ఇసుక కూడా నల్లగా మారుతుందని చెబుతున్నారు.
జీ20 అంటే ఇరవై దేశాలతో ఏర్పడిన ఒక సమూహం. జీ-20 సదస్సు అనేది వరల్డ్ ఫైనాన్షియల్ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ జీ20సదస్సులోని దేశాలకు ప్రపంచంలోని ఆర్థిక ఉత్పత్తిలో ఎనబై ఐదు శాతం, ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. జీ20లో అర్జెంటీనా, యూకే, యూఎస్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మెక్సికో, ఇటలీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియేతో పాటు స్పెయిన్ శాశ్వత గెస్ట్ గా ఉంది.
ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సెక్యూరిటీ నుండి ఆతిథ్యం వరకు మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ ఏడాది జరగబోయే జీ-20లో స్థిరమైన అభివృద్ధి పై ఫోకస్ చేయనుంది.
అదే విధంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరగనుందని సమాచారం. అభివృద్ధి చెందిన దేశాలకు మంచి జరిగేలా తక్కువ ఇంట్రెస్ట్ కు రుణాలు ఇచ్చేలా ఎండీబీలో మార్పులు తీసుకురావాలని చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణంలోని మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరియు పేదరికం పై పోరాడడానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడతారని వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు.





ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్ సెంటర్‌కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం..
33. భూమి స్వభావం..
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం..
4. రవాణా సదుపాయం..
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..
ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.