ఆర్ధిక సంక్షోభంలో ఫ్యూచర్ రిటైల్ మార్కెట్ ఉంది.దానిని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకురాక మూసివేత దిశగా సంస్థ పనులు ప్రారంభించింది.ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ లిక్విడేషన్ బాట పట్టనుంది.
ఈ సంస్థ యొక్క లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్-ముంబైలో పరిష్కార నిపుణుడు దరఖాస్తు సమర్పించినట్లు,స్టాక్ ఎక్సే్చంజీలకు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ రిటైలకు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్ రిటైల్ ప్రతిపాదించింది.అమెజాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ- (కార్పొరేట్ ఇంసొల్వెన్సీ రెసొల్యూషన్ ప్రాసెస్- CIRP ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT ) నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ లిక్విడేషన్ బాట పట్టనుంది.
జిందాల్ (ఇండియా) కేవలం ఈ కంపెనీ మాత్రమే ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ని బీడ్ చేసింది.ఈ కంపెనీ ఒక్కటే క్రెడిట్ర్స్ కి తమ ప్లాన్ ని నవంబర్ మొదటి వారంలో అందించారు. నవంబర్ 10 వ తారీకు ప్లన్స్ ని ఫుత్రే గ్రూప్ కి అందివ్వడానికి చివరి తేదీ కాగా అది ఎంత వరుకు సక్సెస్ అవుతుంది అంది తెలియాల్సి ఉంది. స్పేస్ మంత్ర వాళ్ళు రూ.553 కోట్లు అందించారు కానీ అది రూ20,000 కోట్ల అప్పులలో చిన్న మొత్తం వల్ల అది సాధ్యపడలేదు. కేవలం 42 శాతం మాత్రమే వీళ్ళకి మద్దతులో ఉన్నారు అది సరిపోవాలేదు.
ఫ్యూచర్ రిటైల్ కంపెనీ ముంబై లో కిషోర్ బియ్యాన్ని 2013 లో స్థాపించారు.రిటైల్,ఫ్యాషన్ సెక్టార్,ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు, సూపర్ మర్కెట్స్ రూపంలో ప్రజల మధ్యలోకి వచ్చాయి.ఫ్యూచర్ రిటైల్ యొక్క బ్రాండ్స్ స్టోర్స్ ఇవి:- బిగ్ బజార్,సెంట్రల్ (డిపార్ట్మెంట్ స్టోర్), FBB (ఫ్యాషన్ at బిగ్ బజార్),నీల్గిరీస్ 1905, aLL (ఆ లిటిల్ లార్జర్),హెరిటేజ్ ఫ్రెష్,ఈజీ day,WH స్మిత్,బ్రాండ్ ఫ్యాక్టరీ,ఆధార్ హోల్ సేల్.