మహేంద్ర సింగ్ ధోనీ. ఈ వ్యక్తికి పరిచయం అవసరం లేదు. ధోనీ తెలియనివారు బహుశా భారత దేశంలో ఉండరేమో. ఎన్నో సంవత్సరాల నుండి తన ఆటతీరుతో ఎంతో పేరు తెచ్చుకున్నారు ధోనీ. ధోనీకి సోషల్ మీడియాలో అన్ని రకాల ప్లాట్ ఫార్మ్స్ లో, అంటే ఫేస్ బుక్ ,ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో అకౌంట్స్ ఉన్నాయి.
ధోని తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల ధోనీ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ధోనీ ట్విట్టర్ ఎకౌంట్ లో వెరిఫైడ్ టిక్ తీసేసారు.
సడన్ గా బ్లూ టిక్ పోవడంతో ధోనీ అభిమానులు అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ అలా ట్విట్టర్ అకౌంట్లో బ్లూ టిక్ పోవడం వెనకాల ఒక కారణం ఉంది. అది ఏంటంటే ధోనీ ట్విట్టర్ లో యాక్టివ్ గా పోస్ట్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ట్విట్టర్ ఎకౌంట్ మీటర్ బ్లూ టిక్ తొలగించారు. కానీ తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ తిరిగి బ్లూ టిక్ వచ్చింది.