సింగర్ చిత్ర.. సగటు తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేని పేరు. ఎన్నేళ్ళైనా ఆమె గానం తెలుగు లోగిళ్ళలో మోగుతూనే ఉంటుంది. ఐతే ఆమె గానమే తప్ప.. ఆమె ఇంటర్వ్యూ లు ఇచ్చింది కూడా తక్కువే. ఆమె అభిమానులు ఐతే ఆమెను ఒక్కసారి అయినా చూడాలని తపించిపోతుంటారు. ఎట్టకేలకు అభిమానుల కోరిక తీరింది. ఇటీవలే ఆమె అలీతో సరదాగా షో కి వచ్చారు.

ఈ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఈ సందర్భం గా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు రాయడం, చదవడం నేర్చుకుంటున్నారట గా అని అలీ గారు అడగగా.. తనకు అక్షరాలు నేర్పింది బాలుగారేనని ఈ సందర్భం గా ఆమె గుర్తు చేసుకున్నారు. చాల పాటలు పాడి వినిపించి అలరించారు.. అరబిక్ సాంగ్ ని కూడా అలవోకగా పాడేసి అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తారు

ఇక తన తండ్రిగారిని తలుచుకుని చిత్ర ఎమోషనల్ అయ్యారు. తాను ఫిలిమ్స్ లో పాడాలని తనకంటే తన తండ్రే ఎక్కువ కోరుకున్నారని.. తీరా తనకు నేషనల్ అవార్డు వచ్చిన టైం లో ఆయన ఓరల్ కాన్సర్ తో బాధపడుతుండడం తో రాలేకపోయారని.. అది మాత్రం చాలా బాధ కలిగిస్తుందని గుర్తు చేసుకున్నారు.














