మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీ నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ఈ చిత్రంలో నయనతార కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలానే సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సినిమాలో వుండే సస్పెన్స్ ని చెప్పేస్తూ వుంటారు. రంగస్థలం అప్పుడు ఆది రంగస్థలం సినిమాలో చనిపోతాడని చెప్పేసారు. తాజాగా అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చారు. అలానే చిత్రంలో కట్టప్ప లాంటి పాత్ర ఉంటుందని మెగాస్టార్ లీక్ చేసేసారు.

అయితే ఆ పాత్ర సునీల్ చేసారని అన్నారు మెగాస్టార్. ఈ చిత్రంలో సునీల్ పాత్ర చాలా మిస్టీరియస్ అని అన్నారు. చిరు పోషిస్తున్న బ్రహ్మ ని సునీల్ వెన్నుపోటు పొడుస్తారని.. అరెస్ట్ చేయిస్తారని చెప్పేసారు. దీనితో సినిమా పై చాలా మటుకు క్లారిటీ ప్రేక్షకులకి వచ్చేసింది.

గతం లో కూడా సినిమాల గురించి లీక్ చేసేసారు చిరంజీవి. అప్పుడు మెహర్ రమేష్ ప్రాజెక్టు గురించి కూడా చిరంజీవి బిగ్ బాస్ 4 ఫినాలేకి వెళ్ళినప్పుడు లీక్ చేసేసారు. అది కూడా అధికారిక ప్రకటన ఏమి రాక ముందే.  అలానే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

గాడ్ ఫాదర్ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమా లో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది.