ఆన్ లైన్ లో పాఠం వింటుంటే వచ్చిన లింక్ పై క్లిక్ చేసాడు… లక్ష యాభై వేల రూపాయలు ఔట్.. అసలేమైందంటే..?

ఆన్ లైన్ లో పాఠం వింటుంటే వచ్చిన లింక్ పై క్లిక్ చేసాడు… లక్ష యాభై వేల రూపాయలు ఔట్.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చిన తరువాత మనం ఇంటికే పరిమితం అయిపోయాం. మరీ అత్యవసరాలకు తప్పిస్తే.. బయటకు వెళ్ళడానికి ఎవరు పెద్ద గా ఆసక్తి కనబరచడం లేదు. మరో వైపు పిల్లలను పాఠశాలలకు కూడా పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ స్కూలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

Video Advertisement

online classes 1

ఉపాధ్యాయులు జూమ్ మీటింగ్ ద్వారానే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమం లో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే చిన్న పిల్లలను త్వరగా అట్ట్రాక్ట్ చేసే అడ్వేర్టైజ్మెంట్ లు మరో వైపు. ఇటీవల ఓ పిల్లాడు ఆన్ లైన్ క్లాస్ టైం లో పాఠం వింటూ ఉండగా వచ్చిన నోటిఫికేషన్ ను చూసాడు. “వంద రూపాయలతో ఆడి రెండు వందల రూపాయలు గెలవండి..” అంటూ వచ్చిన నోటిఫికేషన్ ను చూసి ఆత్రుత కొద్దీ క్లిక్ చేసాడు.

online classes 2

అంతే వెంటనే.. ఆ ఫోన్ కు లింక్ అప్ అయ్యి ఉన్న బ్యాంకు ఖాతా నుంచి లక్ష యాభై వేల రూపాయలు కట్ అయ్యాయి. దీనితో.. ఆ పిల్లవాడి తల్లి తండ్రులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ లో ఓ గిరిజన తండా కు చెందిన వెంకన్న ఖాతా లో ఇటీవలే ధాన్యం విక్రయం కింద 86 వేల రూపాయలు, రైతు బంధు పధకానికి సంబంధించి పదకొండు వేల రూపాయలు జమ అయ్యాయి. మొత్తం గా అతని అకౌంట్ లో లక్షన్నర నగదు ఉంది.

online games

ఇటీవల విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కోసం బ్యాంకు కు వెళ్లగా.. అందులో కేవలం 613 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. దీనితో వెంకన్న హతాశుడయ్యాడు. బ్యాంకు స్టేట్ మెంట్ ను చెక్ చేసుకుని చూడగా జూన్ 15 వ తేదీ నుంచి 17 వ తేదీ లోపు లక్షన్నర రూపాయలు బదిలీ అయినట్లు కనిపించింది. 9 వ తరగతి చదువుతున్న తన కొడుకు ఆన్ లైన్ క్లాస్ ల కోసం ఫోన్ ను కొనిచ్చాడు. ఆ ఫోన్ కె బ్యాంకు ను లింక్ అప్ చేసాడు. దీనివల్లనే ఎక్కడో ఎదో జరిగిందని వెంకన్న అర్ధం చేసుకుని.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను సంప్రదించాడు.


End of Article

You may also like