ఇండియన్ ఒలింపిక్ మెడల్ గెలవడంపై పాకిస్థానీ ప్లేయర్ ట్వీట్ వైరల్..కొందరు తిడుతున్నారు మరికొందరు సబాష్ అంటున్నారు !

ఇండియన్ ఒలింపిక్ మెడల్ గెలవడంపై పాకిస్థానీ ప్లేయర్ ట్వీట్ వైరల్..కొందరు తిడుతున్నారు మరికొందరు సబాష్ అంటున్నారు !

by Anudeep

Ads

అసలు మనుషుల్లో ఐక్యతను, దగ్గరితనాన్ని పెంచడం కోసమే ఆటలను కనిపెట్టారు. పోటీ తత్వాన్ని పెంచుతూ.. గెలిసినా.. ఓడినా కలిసి ఉండాలి.. ఉత్సాహం గా, ఉల్లాసం గా జీవితాన్ని కొనసాగించాలి అన్న ఉద్దేశ్యాన్ని నేర్పించడం కోసమే మన చిన్నతనం లో కూడా ఆటలు ఆడించే వారు. ఐతే, వయసు పెరిగే కొద్దీ ఆటలకు సమయం కేటాయించలేక.. మనమే ఒత్తిడి కి గురి అవుతూ ఉంటాం.

Video Advertisement

arshad nadeem 1

ఇదిలా ఉంచితే.. తాజాగా ఓ పాకిస్థాన్ ఆటగాడు ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్స్ లో పాల్గొని బంగారు పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. అతనితో పాటు ఆ పోటీలలో పాల్గొన్న పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్నే అతను సోషల్ మీడియా వేదిక గా ప్రస్తావిస్తూ ట్వీట్ ను పోస్ట్ చేసారు.

arshad nadeem

“నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన నీరజ్ చోప్రా గోల్డ్ ను సాధించినందుకు శుభాభినందనలు తెలుపుతున్నా.. సారీ పాకిస్థాన్! నేను పతకం సాధించలేకపోయా..” అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పట్ల చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటల వెనుక ఉన్న స్ఫూర్తి ఇదే అంటూ అర్షద్ ను ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం అర్షద్ చేసిన ట్వీట్ ను తప్పుబడుతున్నారు.


End of Article

You may also like