దేశం లో కరోనా మహమ్మారి ఉదృతి ఇంతకు ఆగడం లేదు ఉప్పెన లా మీదకి వచ్చిన వేవ్ 2 .తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ లో 64,362 కరోనా పరీక్షలు చేయగా ..వాటిలో 4,298 మందికి పాజిటివ్ గా తేలింది.అత్యధికంగా జీహెచ్ఎంసీ లోనే 601 కేసులు గుర్తించారు.మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కరోనా కేసులు వచ్చాయిఇదిలా ఉండగా పాజిటివ్ రేట్ కూడా బాగానే ఉంది.సుమారు 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు.తెలంగాణాలో మరణించిన వారి సంఖ్య 32 .
తెలంగాణ లో ఇప్పటి దాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007 కాగా 4,69,007 మంది రోగులు ఈ మహమ్మారి నుంచి పోర్తిగా కోలుకొని బయటపడ్డారు.మరో వైపు మరణించిన వారి సంఖ్య 2,928 నమోదు అయ్యింది. రికవరీ రేట్ కూడా తెలంగాణ లో బాగానే ఉంది ఇప్పటి దాకా 89.33 శాతంగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.జాతీయస్థాయిలో రికవరీ రేటు 83.8 శాతం కాగా, తెలంగాణలో ఆ రేటు ఆశాజనకంగా ఉంది.